19, మే 2024, ఆదివారం

సమస్య - 4768


20-5-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పద్మనాభుని దూరిరి భక్తులెల్ల”

(లేదా...)

“ఛీ ఛీ ఛీ యని చీదరింతురిట రాజీవాక్షునిన్ లోకులే

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సుతుడు ప్రహ్లాదునిఁద్రోసి శోకమందు
    హడలఁ గొట్టియుఁ దండ్రియె యంతమెంచ
    కలత చెందియు దైత్యునిఁ, గావమనుచు
    పద్మనాభుని, దూరిరి భక్తులెల్ల

    శార్దూలవిక్రీడితము
    బ్రోచేవాడవటంచు భక్తిఁగొని యాలోకించి ప్రహ్లాదుఁడున్
    నీ చిద్రూపము నాత్మనందు సతమున్ నిర్మోహుడై వేడఁగన్
    గాచన్వెల్వడఁ గంబమందు గనుచున్, గాఠిన్యునిన్ దైత్యునిన్
    ఛీఛీఛీ యని చీదరించిరట, రాజీవాక్షునిన్ లోకులే

    రిప్లయితొలగించండి

  2. పద్మనాభుని కోరిరి భక్తులెల్ల
    యనుచు వ్రాయమనగ నొక యర్భకుండు
    కొంటెతనమున దూ వ్రాసె కో కు బదులు
    పద్మనాభుని దూరిరి భక్తులెల్ల.



    *( ప్రహ్లాదునితో గురువులు చండామార్కులు పలకిన మాటలుగ)*


    నీ చిత్తంబు మరల్చనెంచిసతమున్ నీ క్షేమ మున్ గోరి బా
    లా చేరంగను వచ్చినామిటకు ప్రహ్లాదా! గళగ్రాహియే
    ప్రాచీనమ్ముననుండి దానవులకా పద్మాక్షుడే కావునన్
    ఛీ ఛీ ఛీ యని చీదరింతురిట రాజీవాక్షునిన్ లోకులే.

    రిప్లయితొలగించండి
  3. దైవమేలేడు లేడని తలచునట్టి
    మూఢమతులు సభ జరిపి పురమునందు
    పద్మనాభుని దూరిరి, భక్తులెల్ల
    వారి నభిశంసనము జేసి పనిచిరపుఁడు

    రిప్లయితొలగించండి
  4. పొడువలకు దండన నొసగ పొగడుచుండు
    పద్మనాభుని ; దూరిరి భక్తులెల్ల
    దమను బాధించు రాక్షస దండు నంత,
    వారి కర్మములకు తగు ఫలితముండు

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మగర్భుడు రాక్షస వైరి గనుక
      దానవ పరిపాలనమున దనుజులెల్ల
      పద్మనాభుని దూరిరి; భక్తులెల్ల
      హరిని ప్రార్థింప మనెనుప్రహ్లాదుడపుడు

      ఈ ఛందోనియమాల చిక్కుముడులే హెచ్చైనవే సత్కవీ!
      ఈ ఛీ ప్రాసము కక్కసించి మదికిన్ జీకాకు తెప్పించగా
      ఛీ ఛీ ఛీ యని చీదరింతురిట; రాజీవాక్షునిన్ లోకులే
      మా ఛిద్రంబుల సైపువాడవనుచున్ మన్నింపగావేడరే

      తొలగించండి
  6. బ్రోచే రేడనయోధ్య వాసులు సదా పూజించు శ్రీ రాముడే
    వాచాలుండవివేకమున్ బలుకగన్ వైదేహినిన్ కూరిమిన్
    సైచన్జాలక కాననమ్మున విడన్ సౌమిత్రినోజించగన్
    ఛీ ఛీ ఛీ యని చీదరింతురిట రాజీవాక్షునిన్ లోకులే


    సైచు : మన్నించు

    రిప్లయితొలగించండి
  7. బ్రోచేవాడు పరాత్పరుండు భువిలో పుణ్యాత్ములౌ భక్తులన్
    వాచాలత్వముతోడ మూఢులయి నిర్వ్యాజమ్ముగా దైవమున్
    నీచుల్ నాస్తికులెల్ల రొక్క సభలో నిందింప పాపాత్ములై
    ఛీ చీ ఛీ యని చీదరింతురిట రాజీవాక్షునిన్ లోకులే

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. తే॥ రాక్షస గణము సేరి పాలాక్షునిఁ గడు
      భక్తినిడి కొలుచుచునుండఁ బలుక నొకఁడు
      మాధవుని నామ మచ్చటఁ గ్రోధమొంది
      పద్మనాభుని దూరిరి భక్తులెల్ల

      శా॥ ఛీ ఛీ ఛీ యని చీదరించఁ దగు పేచీకోరు నెల్లప్పుడున్
      ఛీ ఛీ ఛీ యని చీదరించఁగను రాజీవాక్షునిన్ మానవుల్
      ఛీ ఛీ ఛీ యని చీదరింతురట, రాజీవాక్షునిన్ లోకులే
      యోఛత్రమ్ముగ రక్ష జేయునని భావోద్రేకతన్ మ్రొక్కరే!

      ఇక్కడ ప్రాసాక్షరము ఛ కదండి థధ లకు అల్ప ప్రాణము లేక థ బదులు ధ వేసుకొనే వెసలు బాటుందని చదివాను మరి ఛ రెండవాక్షరముగా చాలాపదాలు లేవుకదండి. చ వేసుకొనే వెసలు బాటుందా తెలుపవలయునని మనవి

      తొలగించండి
  9. "ఛీఛీఛీ యని చీదరింతురిట రాజీవాక్షునిన్ లోకులే"
    ఈ' ఛీ' ప్రాసయె దుష్కరంబు మముబోంట్లేరీతి పూరింతురో!
    ఛీఛీయన్నను 'చీ' యటన్ననొకటే -చీత్కారమే గావుతన్
    నే' ఛీ' మారుగ 'చీ' యటందు నది యెంతేని న్వొడంబాటగున్

    రిప్లయితొలగించండి
  10. భక్తి పరవళ్లు త్రొ క్క గా వార లపుడు
    మంది రమ్మును జేరియు మహిత మైన
    చక్క నైన విధాన వ్యా జ స్తు తి గ ను
    పద్మ నాభుని దూరిరి భక్తులెల్ల

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. లేఁడు దైవమ్ము దయ్యమ్ము లేదు సూపుఁ
      డేడ రాముండు గీముండు లేఁ డనుచు స
      రసను జేర నాస్తికుల నరసి నుతించి
      పద్మనాభుని దూఱిరి భక్తు లెల్ల


      చీ చీ యంచును గొంద ఱా హరునిఁ జీ చీ యంచు నా క్రీస్తునిం
      జీ చీ యంచు మతప్రవక్తను బరుం జీ యంచు నిం కొందఱుం
      జీ చీ నేరక దేవుఁ డొక్కఁ డని లోఁ జింతింపకే యన్యులుం
      జీ చీ చీ యని చీదరింతు రిట రాజీవాక్షునిన్ లోకులే

      [ఛీ గ్రామ్యము. చీ దేశ్య పదము. ]

      తొలగించండి
  12. స్వేచ్ఛావాదము పెచ్చరిల్లగ నశించెన్ సభ్యసంస్కారముల్
    స్వేచ్ఛా వర్తనులై స్వదేశజులపై ప్రేలంగ దండించరే
    మ్లేచ్ఛాచారులు నాట్యశాల కడ నిల్చీ నర్తకున్ గాంచుచున్
    ఛీఛీఛీ యని చీదరించిరిట రాజీవాక్షునిన్ లోకులే

    రిప్లయితొలగించండి