27, మే 2024, సోమవారం

సమస్య - 4776

28-5-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్”
(లేదా...)
“సురరాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

35 కామెంట్‌లు:

  1. మురిసెన్కౌరవరాజును
    పరచెన్పాచికశకునియుపైదలివగతో
    కురువంశంబునువణకెను
    సురరాడ్వైభవముదక్కెశుంఠలకుఁగడున్

    రిప్లయితొలగించండి
  2. భారతదేశములో అక్కడక్కడ నెలకొన్న శోచనీయమైన పరిస్థితుల నేపథ్యంలో...

    వర శ్రీరాముని పోలిక
    స్మరణీయులు రాజకీయ స్పర్ధను వీడన్
    దురితులు పాలకులైనన్
    సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్!

    మత్తేభవిక్రీడితము
    స్మరణీయుల్ విడ రాజకీయమునహో సాధించలేమన్ భ్రమన్
    వర శ్రీరాముని బోలినట్టి ప్రభువుల్ వాంఛింప మృగ్యమ్మునై
    భరతోర్విన్ గలుషాత్ములేలుట ప్రజాస్వామ్యంపు వైఫల్యమో ?
    సుర రాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్!

    రిప్లయితొలగించండి
  3. విరివిగ ధనమున్ మద్య
    మ్మెరజూపుచు నోటు పొంది యెన్నిక లందున్
    దెరలించెడు వారలకే
    సురరాడ్వైభవము దక్కె , శుంఠలకుఁ గడున్.


    ధరణిన్ బౌరులు స్వార్థచిత్తులగుచున్ ద్రవ్యమ్ము మద్యమ్ముకై
    పరిపాలించెడు నేతనెన్నుకొనగన్ బ్రాచీన విత్తుండ్రె దే
    వరలై యక్రమ మార్గమున్ ధనము సంపాదించు నవ్వారికే
    సుర రాడ్వైభవ మబ్బె, శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్.

    రిప్లయితొలగించండి
  4. అరయన్దారముపూవుతోనిలచెగాహంగున్శిరోధార్యమై
    మురియన్ముత్యముగూడితామెఱసెగామోదంబుతోకంఠమున్
    వరమైనూలునువస్త్రమేతనువుపైవ్రాలెంగదాశ్శ్రేష్టమై
    సురరాడ్వైభవమబ్బెశుంఠలకునస్తోకంబుగాధాత్రిలోన్

    రిప్లయితొలగించండి
  5. భరతోర్వియందు నేతలు
    కరముగ డబ్బులనుపంచి కడు దుర్వృత్తిన్
    విరవిగ సీట్లను గెల్వగ
    సురరాడ్వైభవముదక్కెశుంఠలకుఁగడున్

    రిప్లయితొలగించండి
  6. వరమే నేతలకు పదవి
    పరమానందము వశపడి ప్రత్యేకతతో
    విరివిగ చేకూర్చబడిన
    సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్

    సురలోకంబున దక్కు దేవపతికిన్ సొంపార వైభోగముల్
    మరియిచ్చోట లభించె గాదె పదవే మత్తిల్లగా జేయుచున్
    బరమానందముఁ గూర్చె నేతలనుచున్ బ్రత్యేక భోగాలతో
    సురరాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్

    రిప్లయితొలగించండి
  7. నెరవేర్చగ లేని హామీల్
    విరివిగ సభ లందు జెప్పి విజయము పిదప న్
    మరచెడు నేతల కి య్యె డ
    సుర రా డ్వై భవము ద క్కె శుంఠ ల కు కడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నెరవేర్చలేని హామీల్" అనండి.

      తొలగించండి
  8. పురజను లొకే విధంబుగ
    చరాచరముల నడుమ గల సత్వము లందున్
    నరమర తెలియక నుండగ
    సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్

    రిప్లయితొలగించండి
  9. అరయన్నేడిట రాజకీయ పధికారాంధత్వమే క్రమ్మగన్
    పరపీడాకరులై యసత్య వరముల్ ప్రప్తించునన్నెచ్చులౌ
    బురిడీలాడగనవ్వె చెల్లుగద ముమ్మాటికారీతిగన్
    సురరాడ్వైభవమబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్

    రిప్లయితొలగించండి
  10. కం॥ విరియఁగ ధనమన మక్కువ
    తరుగఁగ విద్యా విలువలు ధరలో నరయన్
    సరగున కాలమహిమమున
    సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్

    మ॥ పరఁగన్ సంపద లైశ్వర్యమ్ములటు సంభారమ్ముగాఁ బ్రీతినిన్
    గరిమన్ బొందుచు మానవాళికిని మగ్నంబయ్యె విద్యా ప్రభల్
    ధరలో మన్ననఁ గాంచకన్ మడుఁగ సంత్రాణంబు లుప్తమ్మునై
    సురరాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తం మొదటిపాదంలో గణభంగం. 'కాంచక' అన్నది కళ.

      తొలగించండి
  11. కం:వరమౌచు ప్రజాస్వామ్యము,
    కరవై విజ్ఞత , ధన కుల కారణముల,భీ
    కర హింసా పరు లైనన్
    సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్.

    రిప్లయితొలగించండి
  12. శా:వరమో యీ గణతంత్ర?మిద్దియును శాపమ్మో? యనన్ విజ్ఞతల్
    కరవై, మందియు, మందు, సొమ్ము, కులముల్,కార్పణ్యముల్ ముఖ్యమై,
    సరు కే యింతయు లేక యున్న, జనమున్ శాసింప వీ లిచ్చుచున్
    సురరాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. కురు వంశాధముఁడు సిరిని
      హరింప వంచించి నిర్దయ నఖిలము పృథా
      వర తనయు నుండి యంతట
      సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్


      నరవిద్యాధికు లెన్న కుండు కతనన్ నైరాశ్య మేపారఁగా
      వరదానమ్ముల కాసఁ జెందఁగను నల్పప్రాణు లజ్ఞానులై
      ఖర దుష్టాత్ములు నెగ్గ నెన్నికలలోఁ గాపట్యమే వర్ధిలన్
      సురరాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సరిగ చదువు లేకున్నను
    సిరితో కొన యోట్లనన్ని చిక్కగ గెలుపున్
    వరియించెను మంత్రి పదవి
    సురరా డ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్.

    రిప్లయితొలగించండి
  15. తరుణముకొరకై జూచుచు
    ఎరజూపుచుకాసులనిల నిమ్ముగ ప్రజకున్
    తిరుగుచు నుండుకుమతులకు
    *“సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్”*

    రిప్లయితొలగించండి
  16. నిరతము ధనమార్జించెడు
    వెరవులు జూచుచు ప్రజలను పీడించెడు జా
    జరగాండ్రదె ప్రాబల్యము
    సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁగడున్

    రిప్లయితొలగించండి