మ:యువకుం డిట్టుల భాజపా గెలుపు కై యుక్తిన్ బ్రసంగించె "నీ శివదేవాలయ మెంతొ బాగు పడగన్ జేసెన్ నరేంద్రుండె మీ రవలోకింపుడు వాని వీడి పరులం దాసక్తి తో వో టిడన్ *శివనామస్మరణమ్ము దోషమగు గాశీక్షేత్ర మందెప్పడున్!!*" ("నరేంద్ర మోడీ వారణాసిని బాగు చేసాడు.అక్కడ పోటీ చేసాడు.ఆయనకి వోటు వెయ్యక పోతే భవిష్యత్ లో అక్కడ శివనామస్మరణ కూడా చెయ్య లేరు అని ఒక యువకుడు ప్రచారం చేసాడు" అన్నాను.నేను రాజకీయం మాట్లాడటం లేదు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశివునిదలచుటదొసగుకాశీపురమున
రిప్లయితొలగించండిరామనామముపలుకరాదయోధ్య
మధురమధురంబుగాదుగామాయతోడ
చిత్ర గతులను నడచుగాచేదునిజము
నవకంబీయదినేటిసంఘముననీనాభేదముల్లేకనే
తొలగించండితవనామంబునురాముడాపలుకనేతావుల్గనన్లేముమా
దవ! కృష్ణా! నినుగొల్చువారలకునేస్థానంబులేదందువా
కవిసెన్కాఱునుమబ్బులీయవని, యీగర్వాంథులన్గావవే
శివనామస్మరణమ్ముదోషమగుకాశీక్షేత్రమందెప్పుడున్
తొలగించండితవనామంబునురాముడా! పలుకనేతావున్గనన్లేము మా
ధవ! కృష్ణా! నినుగొల్చువారలకునేస్థనంబులేదందువా
కవిసెన్కాఱునుమబ్బులీయవనియీగర్వాంథులన్గావవే
స్థానంబు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాప భీతిని వీడుచు పడుపు గొమ్మ
రిప్లయితొలగించండిజేకొనివిహార యాత్రంచు జేరి యచట
గోవు మాంసమ్ము భక్షించి కోపు గ్రోలి
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున.
శివమందించెడు వాడు భర్గుడనుచున్ జిత్తంబులో భక్తితో
నవిరామమ్ముగ వానినామమె శరణ్యమ్మంచు భావించుచున్
భవబంధమ్ముల వీడి సాధనమునే వాంఛించు భక్తాళికిన్
శివనామస్మరణమ్ము దోషమగుఁ , గాశీక్షేత్రమం దెప్పుడున్.
తే॥ పరుల నెపుడు వంచనఁ జేసి వరలు నతఁడు
రిప్లయితొలగించండిభోగభాగ్యాదులఁ బడయఁ బొరలు నతఁడు
పాపము శమమగుననెడి భావనఁగని
శివునిఁ దలఁదుట దొసఁగు కాశీపురమున
మ॥ భవమే నాకమటంచు సంపదల సంప్రాప్తమ్ముకై సర్వదా
నవకమ్మున్ గనకుండ వంచనయె మాన్యంబంచు నార్జించుచున్
యవనమ్మందున వృద్ధుఁడై తుదుకు సాహాయంబుకై ముక్తికిన్
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్ర మందెప్పుడున్
(9 రోజుల క్రితపు పూరణకు సాధ్యమైనంత భిన్నంగా వ్రాయడానికి యత్నించానండి)
పరుల హింసించి మిక్కిలి బాధ పెట్టి
రిప్లయితొలగించండిదురిత కృత్యము లొనరించు ధూ ర్తు లగుచు
భక్తి యేలేని వారలై పావనంపు
శివుని దల చుట దొ సగు కాశీ పురమున
పరమ శివునిపై యిసుమంత భక్తి లేక
రిప్లయితొలగించండిపాప కార్యాల తేలెడు పతితులెల్ల
తాము సల్పెడు మోసాల దన్ను కోరి
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున
భవబంధమ్ములఁ వీడకుండు సతమున్ పాపాలపై దృష్టితో
నవలంభించును మోస పూరితములౌ వ్యాసంగమున్ బ్రీతితో
లవలేశంబగు భక్తి లేని జనుడై లక్ష్యంబు వ్యాకూతిగా
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
జననమొసగుచుండెడి వాడు జన్యువనుచు
రిప్లయితొలగించండిశరణునొసగుచుండెడి వాడు జక్రియనుచు
పాటవముగ ప్రాణము తీయు వాడితడని
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున
తే.గీ.||
రిప్లయితొలగించండివరములేవియు వలదని భక్తితోడ
హరుని వేడిన హరియించు నఘములెల్ల
పాపచింతన విడువక పరము గోరి
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున
మత్తేభము:
ప్రవిభాసంబగు భక్తి నిల్పిమది నిస్వార్థమ్ముగా నీశునిన్
భవనాశంబొనరింప వేడుకొన సంభావించు మోక్షమ్ముతో
భవబంధమ్ములఁ జిక్కి తుచ్ఛమగు సౌభాగ్యమ్ము లాశించుచున్
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
శివనామామృత పాన మత్తులను కాశీక్షేత్రమం దెన్నడున్
తొలగించండిభవ నాశంకరుఁడైన శంకరుడు సంభావించు మోక్షమ్ముతో
ప్రవిభాసంబగు భక్తి మృగ్యమయి స్వార్థమ్మే శరవ్యమ్ముగా
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
దారుణముగ మనుష్యులు దర్ప మూని
రిప్లయితొలగించండినియమముల నెన్న కించుక భయము భక్తి
రక్తి నెదల వీడి యనాదరమున సాంబ
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీ పురమున
రవి చంద్రాది దివౌకసప్రకర మర్త్యవ్రాత గంధర్వ భా
ర్గవ రక్షోవర సిద్ధ కిన్నర గ ణారాధ్యుండు ఫాలాక్షుఁ డీ
భువిలోఁ దారక మంత్ర రాజము సదా పూజ్యంబు దూషింపఁగా
శివ నామస్మరణమ్ము దోష మగుఁ గాశీ క్షేత్రమం దెప్పుడున్
మ:యువకుం డిట్టుల భాజపా గెలుపు కై యుక్తిన్ బ్రసంగించె "నీ
రిప్లయితొలగించండిశివదేవాలయ మెంతొ బాగు పడగన్ జేసెన్ నరేంద్రుండె మీ
రవలోకింపుడు వాని వీడి పరులం దాసక్తి తో వో టిడన్
*శివనామస్మరణమ్ము దోషమగు గాశీక్షేత్ర మందెప్పడున్!!*"
("నరేంద్ర మోడీ వారణాసిని బాగు చేసాడు.అక్కడ పోటీ చేసాడు.ఆయనకి వోటు వెయ్యక పోతే భవిష్యత్ లో అక్కడ శివనామస్మరణ కూడా చెయ్య లేరు అని ఒక యువకుడు ప్రచారం చేసాడు" అన్నాను.నేను రాజకీయం మాట్లాడటం లేదు.)
తే.గీ:వారణాసి నిట్టుల బల్కె భక్తు డొకడు
రిప్లయితొలగించండి"శివుని గుడిని మోడీ వన్నె జేసె నిటుల
నతడె గెలువక గెలువగ నన్యు లేవరొ
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున”
హింస లొనరించు ధూర్త విద్వంస వరులు
రిప్లయితొలగించండిప్రజల మోసగించిసతము బ్రతుకువారు
పాప పంకము గడుగర్గు భ్రష్ట జనులు
శివునిదలచుటదొసగుకాశీపురమున
పరుల నెప్పుడు హింసించు పాతకుండు
రిప్లయితొలగించండిదుష్ట పాలనఁజేసెడు ధూర్త జనుడు
సత్యమాడుట నేర్వని భృత్య జనము
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున
అవకాశంబును జారనీక కడు బాహాటంబుగాఁజాటుచున్
రిప్లయితొలగించండిజవరాండ్రన్ బలుహింసఁజేయుచును నీచాలాప యుక్తుండు నౌ
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
భవు నామంబునె పల్కగావలయు గా భావంబు నందెప్పుడున్
తేటగీతి
రిప్లయితొలగించండిదివ్య భాగీరథీ నదిఁ దేలకుండ
నన్నపూర్ణమ్మ నాశీస్సులందకుండ
జనులు సూడ డంబమ్మున సాగి గుడికి
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున
మత్తేభవిక్రీడితము
స్తవనీయంబగు గంగలో మునిగి తీర్థానన్ బునీతమ్మునై
వివశత్వమ్మున నన్నపూర్ణ నతితో వీక్షించి నర్చించుచున్
భవునిన్ గొల్చఁగ కాలభైరవుఁడు నొప్పారంగ నా కోవెలన్
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
స్థిర నివాసులు ప్రతిరోజు చేయుటొప్పు
శివునిఁ దలచుట; దొసగు కాశీపురమున
మద్యమున్ గ్రోలి వీధుల మధ్యలోన
విటుకులాడికై తిరుగుట విటుని వోలె.
చేతులెత్తి మ్రొక్కు చుసదా చిత్తమందు
రిప్లయితొలగించండివేడుకొనిన మంచిదగును వినుము విడక
*“శివునిఁ దలఁచుట, దొసఁగు కాశీపురమున”*
పాపపుపనులుచేయుచుభక్తులనుట