23, జులై 2024, మంగళవారం

సమస్య - 4830

24-7-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్”
(లేదా...)
“సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

34 కామెంట్‌లు:

  1. అన్యాక్రాంతముగాకను
    మున్యావాసమువిపినముముక్కునుమూయన్
    ధన్యంబౌజీవనమది
    సన్యాసమెమేలుదొలఁగసంక్లిష్టంబుల్

    రిప్లయితొలగించండి
  2. స్వామీ నిత్యానంద వంటి సన్యాసుల గూర్చి.....

    ధన్యత నిండిన మనుగడ
    కన్యారత్నములఁ గూడి కవ్వింతలతో
    విన్యాసము సలుప నగును
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్

    ధన్యాత్ముల్ గద చూడ సైకితికులే తామెంచు కొన్నట్టివౌ
    కన్యారత్నములే లభించునుగదా కామాగ్ని చల్లార్చగా
    విన్యాసంబులు సల్పవచ్చు ననుచున్ వేనోళ్ళ పేర్కొంద్రుగా
    సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. కందం
      అన్యులు స్వార్థమునెంతురు
      పుణ్యాత్ములు యోగులనుచు ముచ్చటనెన్నన్
      ధన్యులు రాష్ట్రములేలిరి
      సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్!


      శార్దూలవిక్రీడితము
      అన్యుల్ స్వార్థపరత్వమై చెలఁగి మాయల్ జేయుచున్ దోచగన్
      బుణ్యాత్ముల్ గద యోగులంచు జనులున్ బూజించి యెన్నంగనే
      ధన్యుల్ రాష్ట్రములేలు యోగమున నుత్సాహాన రాణింపగన్
      సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. అన్యుండయ్యెగధర్మబద్ధుడునునేహంగుల్గనన్లేడుగా
    ధన్యండాయెగమంత్రిసత్తముడుతాదాత్మ్యుండుమోసంబుతో
    మున్యావాసముమేలుగూర్చునుగదామోహంబువీడన్సదా
    సన్యాసంబదిమేలుగాదెకలిలోసంక్ల్లిష్టముల్వీడగా

    రిప్లయితొలగించండి
  5. కన్యామణి నాలుగగొని
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్
    ఏన్యాయము నెంచితివో !
    యన్యాయమగు గద యటుల ననుకొనుచుండన్

    రిప్లయితొలగించండి

  6. మాన్యుండని పూజించుచు
    మాన్యాల నొసంగి జనులు మన్నింతురు సా
    మాన్యులు పరమాత్ములనెడి
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్.


    అన్యాయమ్ముగ విత్తమున్ విరివిగా నార్జించినన్ లోకులే
    మాన్యుండ్రంచు పరాత్పరుండనుచు సమ్మానించి పూజింపరే
    సన్యాసాశ్రమ జీవనమ్ము కనగా సౌఖ్యంబులే మిన్నయౌ
    సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా.

    రిప్లయితొలగించండి
  7. అన్య మనస్కు లు గాకను
    ధన్యా త్ముల కథలు వినుచు ధార్మి క పరులై
    యన్యా యము విడ నాడిన
    సన్యాస మె మేలు దొలగ స o క్లిష్ట o బుల్

    రిప్లయితొలగించండి
  8. కం॥ అన్యాయము హెచ్చి ధరను
    మాన్యత నొందఁగ సుజనుల మనుఁగడ బరువై
    విన్యాసములడరఁగనటు
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లింష్టంబుల్

    శా॥ అన్యాయమ్మటు హెచ్చఁ గాపురుషులే యత్యంత మర్యాదతో
    మాన్యత్వమ్మును బొంది సాగఁగను సామాన్యుల్ విచారమ్ముతో
    విన్యాసమ్ములఁ జేసి కష్టములిలన్ భేదించ సామాన్యమే!
    సన్యాసంబిక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా

    రిప్లయితొలగించండి
  9. అన్యాయము చేయుటకును
    సన్యాసికి సందులేదు సత్వర్తనతో
    మాన్యత బొందెడి చక్కని
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్.

    రిప్లయితొలగించండి
  10. ధన్యాత్ములు మును లెల్లరు
    కన్యా ధన లాలసమ్ము కాంచఁగఁ బుడమిన్
    శూన్య ఫలము సంసారము
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్


    అన్యాయార్జిత విత్త మేల మన కం చాదర్శముం జాటఁగా
    నన్యోన్యమ్ము పరోపకారమును నిత్యం బెంచి సద్బుద్ధితో
    నన్యాక్రాంత నిమిత్త సంజనిత ఘోరాన్వస్త్ర ధారా మహా
    సన్యాసం బిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా

    రిప్లయితొలగించండి
  11. ధన్యాత్ముండిల సర్వసంగముల నిర్ద్వంద్వంబుగా వీడి తా
    సన్యాసాశ్రమ మాశ్రయించ నిక కష్టంబుల్ పటాపంచలౌ
    విన్యాసంబొనరించు సౌఖ్యములు నిర్భేద్యమ్ముగా నిత్యమున్
    సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా

    రిప్లయితొలగించండి
  12. ధన్యాత్ములు భూతలమున
    సన్యాసులుగాదె పొంద సౌఖ్యములెల్లన్
    బుణ్యముతోబాటు, గనఁగ
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్

    రిప్లయితొలగించండి
  13. కం:నే న్యస్తాక్షరి కొప్పగ
    మాన్యత విడి ప్రాశ్నికుండు మతి దొలిచెను గా!
    అన్యాంశము గొని న్యస్తపు
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్”
    (అవధానం లో న్యస్తాక్షరి చేస్తానని ఒప్పుకుంటే ఈ పృచ్ఛకుడు మతి పోగొట్టే విధం గా న్యస్తాక్షరి ఇచ్చాడు.ఇక నేను న్యస్తాక్షరిని సన్యసించి ఏ వ్యస్తాక్షరో,పురాణమో పట్టుకుంటే మంచిది అని ఒక అవధాని అన్నట్టు.అది నిజం కావచ్చు.జోక్ కావచ్చు.)

    రిప్లయితొలగించండి
  14. శా:"సన్యాసమ్ము లవేల?కర్మఫలమున్ సన్యస్తమున్ జేయుటే
    మాన్యం" బంచు వచించు నీ యతుల నే మన్నించగా దక్కె నా
    కన్యాయమ్మె,కుటుంబమున్ విడచి తత్త్వాన్వేషినై యెంచినన్
    సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా”
    ("సన్యాసాలు తీసుకో నక్కర లేదు.కర్మ యోగం చేస్తూ కుటుంబం లోనే తరించండి అని సన్యాసులు చెపుతున్నారు.అది వినటం బుద్ధి తక్కు వైంది.సన్యసిస్తేనే బాధలు పోతాయి" అని ఒక గృహస్తుడు పశ్చాత్తాపం పడినట్టు.)

    రిప్లయితొలగించండి
  15. అన్యాపదేశపలుకుల
    విన్యాసముసలుపుచుండి వికృతముఁజేయన్
    ధన్యతనొందుట కొఱకై
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్

    రిప్లయితొలగించండి
  16. అన్యాంక్రాంతమయాయె భూములు రమా!యాదాద్రి ప్రాంతంబునన్
    కన్యారాశినిఁజూడ నష్టములనే కాంక్షించు నేడాదియున్
    సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా
    నన్యాయంబని జెప్ప ధూర్తుని వలెన్ యానంద ముంబొందిరే

    రిప్లయితొలగించండి
  17. అన్యాయపు దారి చనక
    అన్యపు మార్గం బరయక ఆలోచించన్
    శూన్యమగు బ్రతుకు కన్నను
    సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్”*

    రిప్లయితొలగించండి
  18. దైన్యంబొందకవాసిగాసతతమీధాత్రిన్ సదాకాలమున్
    నన్యాక్రాంతములైనసొమ్ములనునే,నాశించకన్డెందమున్
    కన్యన్కోరకహాయిగానికనునాకంసారినేగొల్చుచున్
    *“సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా”*


    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అన్యాయమయె కుటుంబము
    ధన్యాత్ములు వారలంత ధర వీడి చనన్
    శూన్యమ్మయె బ్రతుకంతయు
    సన్యాసమె మేలు దొలగ సంక్లిష్టంబుల్.

    రిప్లయితొలగించండి