20, జులై 2024, శనివారం

సమస్య - 4827

21-7-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్”

(లేదా...)

“షండుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

20 కామెంట్‌లు:

  1. దండిగ మద్యము గ్రోలియు
    మండెడు మాటలను బల్కు మందుండొ కచో
    మొండిగ వాగుచు నిట్ల నె
    షండుడు గొడ్రాలి గూడి సంతున్ బడసెన్

    రిప్లయితొలగించండి
  2. అండగనుండగశాస్త్రము
    చెండాడిరిసృష్టినంతచిత్రముగనగా
    పిండంబెదిగెనునాళము
    షండుడుగొడ్రాలిగూడిసంతున్బడసెన్

    రిప్లయితొలగించండి
  3. నిండుగ ద్రాగియు మత్తున
    చండాలుడొకండు వదర సాగెనిటుల భూ
    మండలమందున వింతగ
    షండుడు గొడ్రాలి గూడి సంతున్ బడసెన్

    రిప్లయితొలగించండి

  4. షండుడు నీ మగడను వా
    గ్దండము భరియింపలేక తప్పదటంచున్
    దుండగ మొనరింపగ పా
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్.


    షండున్ భార్యవు నీవుగాన నికపై సంతానమేలేక వా
    గ్దండమ్మున్ భరియింపగా వలయునో కాంతామణీ వింటివా
    పుండున్ రమ్మని పిల్చినంత సతి యామోదమ్ము నే తెల్ప పా
    షండుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా.

    రిప్లయితొలగించండి
  5. అండంబందునశక్తియైబరగునాయానందరూపంబుతో
    పండించెన్గదపార్వతీసతియుతాభావంబువిఘ్నేశునిన్
    చండుండైజనెశంకరుండుపితయైతాకండుశర్వాణినే
    షండుండొక్కడుగొడ్డురాలిగవసెన్సంతానమందెన్భళా

    రిప్లయితొలగించండి
  6. కందం
    పండదు కడుపు తనకనుచుఁ
    గొండలగొని నాకు పసరు గూర్చగమందున్. ,
    జండిక, చిరునామానిడ
    షండుఁడు, గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్!

    శార్దూలవిక్రీడితము
    పండన్ యోగములేదు గర్భమె, దగన్ బండింతు మందంచుఁ దాఁ
    గొండల్ గోనల నొంది మూలికలతోఁ గూర్చంగ పేరొందగన్. ,
    జండీదేవియె తల్లినౌదుననుచున్ సాగన్, విలాసంబిడన్
    షండుండొక్కఁడు, గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా!

    రిప్లయితొలగించండి
  7. బెండుగ నుండెను మనుగడ ,
    కొండిక లేడని కుములుచు కొమరుని కొరకై
    నిండుగ దత్తత తోడన
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ నిండగు శాస్త్రపు శోధన
    మెండుగ జగతిని విరియఁగ మేలిమి వైద్యం
    పండను శస్త్ర చికిత్సల
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్

    శా॥ నిండౌ శాస్త్రపు శోధనా గరిమమే నెట్టించె నావిష్కృతుల్
    మెండౌ వైద్యము శాస్త్రబద్ధతనిటుల్ మేదిన్ గుబాళించఁగన్
    జెండన్ సాధ్యతఁ గాంచె లోపములిలన్ శీఘ్రమ్ముగా నీవిధిన్
    షడుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా!

    నేను శాస్త్ర విద్యార్థినండి. పద్యములో తప్పలు రాగలవు. కానీ శాస్త్రాన్ని మన్నించాలి కదండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము చివరి పాదము మొదటి పదము షండుండొక్కడు. పొరపాటున షడుండొక్కడు అని టైపు చేసానండి

      తొలగించండి
  9. పండంటి శిశువును బడయు
    నిండగు కోరిక కలిగిన నెచ్చెలి కొరకై
    ఖండితమగు కృషితో పా
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్

    పండుంబోలెడి చక్కనైన శిశువున్ వాంఛించు గొడ్రాలితో
    పండింతున్ గడుపంచు పల్కె మగడే భార్యా విధేయుండుగా
    గుండెల్లో ననురాగమే పదిలమై కోల్పోని పంతాన పా
    షండుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా

    రిప్లయితొలగించండి
  10. షండుఁడు పుత్రుల కొరకు ప్ర
    చండంబుగ తపముఁ జేసి శంకరుని కృపన్
    కొండొక దివసంబున నా
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్

    రిప్లయితొలగించండి
  11. షండుండై జనియించి జీవనము నిస్సారంబుగామార నా
    తండీశున్ మది నిల్పి భక్తి దనరన్ తండ్రీ కటాక్షింపవే
    షండుండన్ వరమీయవేయనుచు తా సంతానమర్ధించగా
    షండుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా

    రిప్లయితొలగించండి
  12. ఎండిన యుర్వీరుహ మె
    న్నండైనఁ జిగుర్చు నిల ననఁగ నమ్మెద వి
    శ్వాండంబున వింతఁగ నే
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్


    చెండాడెం గద భీక రాహవమునం జిత్రాతి చిత్రంబుగాఁ
    బాండుక్ష్మాపతి సూను వర్గము ధనుర్బాణాస్త్ర దివ్యప్రభా
    షండంబున్ దిన మందు సింధు నృపుఁ డాశ్చర్యంబు విశ్వంబునన్
    షండుం డొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతాన మందెన్ భళా

    రిప్లయితొలగించండి
  13. కం:షండత,గొడ్రాలు తనము
    రెండు మానసికమె యంచు "రెవిటా" లిడుచున్
    గుండె దిటవు సమర మిడగ
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్”
    (షండత్వం ,అందువలన ఆమె గొడ్రాలి తనం రెండూ సైకలాజికల్ అని డాక్టర్ సమరం గారు రెవిటాల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి ధైర్యం చెప్పాడు.ఆయన పుణ్యాన వాళ్ల రెండు జబ్బులూ పోయాయి.)

    రిప్లయితొలగించండి
  14. శా:తిండే ముఖ్యము,తాగుడున్ రతుల తో దేహంపు సౌఖ్యమ్ములే
    మెండౌ స్వర్గములంచు ,నైతికత లో మేలేది లేదంచు పా
    షండుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్, సంతానమందెన్ భళా!
    నిండౌ ప్రేమ నొసంగు భార్య వలనన్ నీమమ్ములన్ వీడుచున్.
    (ఆ పాషండుడు నీతి వదలి ఎవతో గొడ్రాలు తో కలిసాడు.సంతానం మాత్రం భార్య తో పొందాడు.)

    రిప్లయితొలగించండి
  15. పండరి పురమునఁగలయొక
    చండాలుఁడు ద్రావిబీరు చతికిల పడుచున్
    గుండును దాకుచు నిట్లనె
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్

    రిప్లయితొలగించండి
  16. షండుంలింగము మార్పు చేయుటన నేసంతాన సాఫల్యమై
    షండుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా
    యండంమార్పిడి చేసెగొడ్డుది యు సాకారంబుచిహ్నంబుగా
    పిండంబంతట పుట్టి సంతువగనై బేరాశ కల్పించెనే

    రిప్లయితొలగించండి
  17. కం||
    గండముకాన్పుననాలికి
    కొండమ్మనుమంత్రసాని కుదిరెవెదుకగా
    పిండంబడ్డంబట పా
    షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్

    డా.గాదిరాజు మధుసూదనరాజు

    (ఒక పాషండుడు ..తన పెళ్ళాం ..కడుపులో పిండం అడ్డం తిరిగిన గండం నుండి ఒక మంత్ర సాని వలన బయట పడి
    సంతానాన్ని పొందాడు. మంత్ర సాని కొండమ్మ గొడ్రాలు అయినా ఆమెను
    కలిసి అభయం పొంది సంతానవంతుడయ్యాడు

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    షండుడు మారెను మంచిగ
    మెండగు శస్త్రపు చికిత్స మేలుగ జరుగన్
    పండుగ వాతావరణమె
    షండుడు గొడ్రాలి గూడి సంతున్ బడసెన్.

    రిప్లయితొలగించండి