12, జులై 2024, శుక్రవారం

సమస్య - 4819

13-7-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ”

(లేదా...)

“విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

19 కామెంట్‌లు:

  1. దాడిసేయగతురకలుతాల్మితోడ
    మౌనమెంచినయోగియైమాధవుండు
    ఱాతిబొమ్మగనిలచినరమణుడాయె
    విష్ణుదేవుడుసూపెనువినయమెంతొ

    రిప్లయితొలగించండి
  2. తే॥ భక్తి మీరఁగఁ దపమున శక్తిఁ గనుచు
    నితర ధ్యాసను గాంచక నిరతమటులఁ
    గొలువఁగ బ్రియము మీరఁగఁ బలుకఁ దలచి
    విష్ణుదేవుఁడు సూపెను వినయ మెంతొ

    మత్త॥ కృష్ణదేవుఁడు గోపబాలురఁ గోరి చెంతను నిల్చునే
    జిష్ణుదేవుడుఁ భక్తి మెచ్చుచు శ్రేయ మెంతయొ కాంచునే
    తృష్ణ వీడిన భక్తవర్యుని తీరు తృప్తిని నింపగా
    విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    భృగువు హరి వక్షమునఁ దన్నఁ బొగరు గాను
    లక్ష్మి యవమానమెంచుచు రగిలినంత
    కాలి కంటిఁ జిదిమి మౌని గర్వమడఁచ
    విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ

    మత్తకోకిల
    తృష్ణ తీరక వక్ష మందున దేవదేవునిఁ దన్నినన్
    విష్ణు పత్నిగ లక్ష్మి కుందిన విజ్ఞుడై పదమంటి కో
    పోష్ణమున్ విడి మౌని గర్వము పుచ్చ కంటిని గిల్లుచున్
    విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే!

    రిప్లయితొలగించండి
  4. తనపయి నలుక నొందిన దార పయిన
    సుంతయును కోపగించక సొలపు తోడ
    పాదముల నొత్తుచుండుచు పడతి యెడల
    విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ

    రిప్లయితొలగించండి
  5. విష్ణు దేవుడు కృష్ణుడై వెలసి నపుడు
    సత్య యలుకను దీర్చగ సాధు వగుచు
    పాదముల నొ త్త దొడగె ను పతి గ నపుడు
    విష్ణు దేవుడు సూపను వినయ మెంతొ

    రిప్లయితొలగించండి

  6. భవుని విల్లు విరిచెనొక పాపి యనుచు
    పరశు రాముడాగ్రహమందు వచ్చినతరి
    నోర్మి జూపుచు నతనితో పేర్మి తోడ
    విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ.


    తృష్ణతో సతి పారిజాతము తెమ్మటంచు గోరినన్
    గృష్ణుడెట్టల వచ్చెనంచును కింకతో సమరమ్ముకై
    వృష్ణిచేరిన నేమి, వచ్చిన వేదవేద్యుని గాంచగన్
    విష్ణుదేవుఁడు , సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే.

    రిప్లయితొలగించండి
  7. ముఖ్యు డెవ్వడొ ముగ్గురు మూర్తులందు
    నెరుగనెంచి ప్రయాణమై పరమపదము
    పొగరు చూపుచు తన్నగ భృగుమహర్షి
    విష్ణు దేవుఁడు సూపెను వినయమెంతొ

    తృష్ణ కల్గి త్రిమూర్తులందున దిట్టనే కనిపెట్టగా
    ధృష్ణియై ఋషులందు తోచెను ధీరుడౌ భృగువేకదా
    విష్ణులోకముఁ జొచ్చి తన్నగ విజ్ఞతన్ భగవానుడౌ
    విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే

    రిప్లయితొలగించండి
  8. సకల సురులకు నాద్యుఁడై సంతతమ్ము
    నతుల నింపుగ నందెడు నలువ పద్మ
    సంభవుండు సనంగ దర్శన మొసంగ
    విష్ణుదేవుఁడు సూపెను వినయ మెంతొ


    కృష్ణ! కృష్ణ! పరీక్షకై వెస నేఁగ నేల నితాంత రో
    చిష్ణునిం గట చిన్నవుచ్చుట చిద్విలాసమె మౌనికిన్
    విష్ణు మాయ యనంగ నా భృగు విప్రుఁ డాతనిఁ దన్నఁగా
    విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే

    రిప్లయితొలగించండి
  9. ధృష్ణి కానని యల్క గీమున దీనయై పవళించగా
    కృష్ణుడల్లన సత్యభామకు కిన్క బాపఁగ శయ్యపై
    తృష్ణతో నుపవిష్టుడై యతి దీనతన్ బ్రతిమాలుచున్
    విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే

    రిప్లయితొలగించండి
  10. అలుక బూనిన సత్యకు నలుక బాప
    విష్ణుదేవుని యంశయౌ కృష్ణమూర్తి
    పాదములుబట్టి జాలిగా బ్రతిమలాడి
    విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:విశ్వనేత యయ్యు మహర్షి భృగువు పట్ల
    రామచంద్రుడై దశరథరాజు పట్ల
    విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ”
    ధర్మమార్గమ్ము ప్రజలకు దాను తెలుప

    రిప్లయితొలగించండి
  12. మ.కో:విష్ణువే వటురూపియై బలి వేడ బోవగ శుక్రుడా
    తృష్ణ దీర్చు బలిన్ నయమ్ముగ హెచ్చరించె నిటుల్ "నృపా!
    విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే
    విష్ణుమాయె యీ వటుండను వింత రూపము నమ్ముమా!

    రిప్లయితొలగించండి
  13. భృగుని యొద్దకు కృష్ణుఁడు రాగ జూచి
    కృద్ధుఁడగుచును దన్నగ ఛాతి మీద
    విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ
    ఋషుల యెడలను గౌరవ మిట్లె యుండు

    రిప్లయితొలగించండి
  14. కృష్ణుఁజూచిన నాక్షణంబున కృద్ధుఁడైముని ఛాతిపై
    తీక్షణంబుగ తన్నగావెస దేరికొంచును బ్రేమగా
    విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే
    విష్ణునామముఁబల్కు వారికి విశ్వమంతయు స్వర్గమే

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    భృగుమహర్షి యాగ్రహమున విష్ణు వక్ష
    మందు తన్నగా కోపము నొందకుండ
    పాద సేవను చేయు నెపమున కంటి
    ని చిదిమి భృగుమహాముని నిక్కునణచి
    విష్ణుదేవుడు సూపెను వినయమెంతొ.

    రిప్లయితొలగించండి

  16. డా బల్లూరి ఉమాదేవి

    ధరణిమొరనువినుచుపుట్టిదాశరథిగ
    మార్గదర్శియయ్యె ప్రజకు మానుగాను
    గురువుచెంత విద్యలునేర్చి కువలయమున
    విష్ణుదేవుండు సూపెను వినయమెంతొ


    విష్ణుమూర్తియు ద్వాపరమ్మున వెన్నదొంగగ ఖ్యాతుడై
    తృష్ణదీర్చెనుతల్లికాతడుతీరుగానట విశ్వమున్
    కృష్ణమూర్తిగ నోటనే యొక క్రీడగాహరియివ్విధిన్
    *“విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే”*

    రిప్లయితొలగించండి