6, జులై 2024, శనివారం

సమస్య - 4813

7-7-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ”

(లేదా...)

“కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

38 కామెంట్‌లు:

  1. పలురీతులభావనలను
    విలువలతోడుతసభలనువిజ్ఞులుకనగా
    చెలిమినిచంద్రులుకాగా
    కలువలువికసించెపవలెకంటివెసుకవీ!

    రిప్లయితొలగించండి
  2. విలువల్జూపుచుపండితాగ్రణులుసద్విజ్ఞానచంద్రాత్ములై
    పలుశాస్త్రంబులభావజాలములువిప్పారంగమేథావులై
    చెలిమిన్సభ్యులమానసంబులనువేజేరంగశీతాంశువుల్
    కలువల్బూచెవియత్తలంబునఁబవల్గన్గొంటివేసత్కవీ

    రిప్లయితొలగించండి
  3. కందం
    గెలువన్ జంద్రుడునెన్నిక
    వెలుగొందగ ముఖ్యమంత్రి పీఠమునందున్
    బులకల టపాసులెగయఁగ
    కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ!


    మత్తేభవిక్రీడితము
    గెలువన్ జంద్రుడు నాంధ్రరాష్ట్రమున సత్కృత్యంబుగా నెన్వికన్
    వెలుగొందున్ దగు ముఖ్యమంత్రియనగన్ వేవేల స్తోత్రంబులై
    బులకల్ రేగ టపాసులన్ జనులు నుప్పొంగంగ నంటించఁగన్
    గలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ!

    రిప్లయితొలగించండి
  4. పలు రకముల పూరణ లన్
    విలసి త ముగ సల్పు విబు ధు
    ని గాంచన్
    చెలువపు లల నల కనులను
    కలువలు వికసి o చె బ వ లె కంటి వె సుకవీ!

    రిప్లయితొలగించండి

  5. వలచిన నినుగనినంతనె
    యెలమిని తాబొందినట్టి యింతి కనులవే
    యలరారుట జూచితి గన
    కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ.


    నిలువన్ నీడయె లేని యిత్వరుల నానీచుండ్రు వంచింపగా
    కలతల్ దీర్చగ నెంచి వారికయి సంగ్రామమ్మునే జేయుచున్
    పలుసాయమ్ముల నందజేయనిక నాపార్టీ పతాకమ్ములౌ
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తం మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. కం॥ బలిమినిఁ గూర్చఁగఁ గవియటు
      విలసిత యవధానమందు విద్యుల్లతలై
      వెలిఁగెడి యుత్పల మాలలు
      కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ!

      మ॥ బలిమిన్ గూర్చఁగ నుత్పలమ్ములటు శ్రీవాణీ కటాక్షంబుతో
      వెలుఁగుల్ చిమ్మెడి పద్యధారలుగ సంప్రీతిన్ జనుల్ మెచ్చఁగన్
      విలసద్భావ రసాలఁ దృప్తి బడయన్ విద్వత్తు భాసిల్లఁగన్
      గలువల్ పూచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ!

      శ్రీకంది శంకరయ్య గారు మొదటి పాదములోని గణభంగము సూచించిన పిదప సవరించిన పద్యమండి. వారికి అనేక ధన్యవాదములతో
      మన్నించాలి గణదోషమైన పద్యము తొలగించానండి
      వారికి అనేక ధన్యవాదములతో

      తొలగించండి
  7. గలువల్ మ॥ చివరిపాదములో మొదటి పదము చిన్న టైపాటండి

    రిప్లయితొలగించండి
  8. అలరాముడే గెలిచి కో
    మలితో పుష్పకవిమాన మధిరోహించెన్
    పులకించిన సీత కనుల
    కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ

    ఖలుడౌ రావణునిన్ జయించి మరి వక్కాణించె శ్రీరాముడే
    విలపింపన్ దగదంచు సీత సిలుగుల్ విచ్చిల్లగా తెల్పుచున్
    బులకించెంగద సీత పుష్పకములో భూపుత్రి నేత్రాలలో
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ

    రిప్లయితొలగించండి
  9. పిలువకనె వచ్చె యింటికి
    వలపును చూపుచు , నిజముగ పగవాడయినన్
    యిలలో నిదియొక వింతయె
    కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ

    రిప్లయితొలగించండి
  10. పిలువన్ బశ్చిమదేశవాసులు కడుం బ్రీతిన్ వధానిద్వయిన్
    దెలిమేఘంబుల మధ్యబోవు యదనున్ ధీశాలి యొక్కండనెన్
    జలజాతాక్షి విమానయోషఁ గని సాజంబౌ గతిన్ నేస్తుతోఁ
    గలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విమానయోష= ఎయిర్ హోస్టెస్ అనే అర్థంలో వాడినానండీ (పింగళి వారు అన్నట్టు ఎవరూ పుట్టించకుండ మాటలెలా పుడతాయి)

      తొలగించండి
  11. కందం:
    చెలికాని యాగమనమున
    చెలువపు పూఁబోణి మనసు చిందులు వేయన్
    కలల సరోవరమందున
    కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ

    మత్తేభము:
    చెలువంబంతయు గూర్చి బ్రహ్మ లలనన్ సృష్టించెనో యట్లనన్
    కలలో గాంచిన కోమలాంగి యిలలో కన్పట్టి కవ్వింపులన్
    చెలికానిన్ మురిపింప మానసమునన్ చెల్వొంద నాహ్లాదమే
    “కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ”

    రిప్లయితొలగించండి
  12. అలర మనము లెల్లరకును
    లలితమ్ములు గుంభనములు రమణీయముగా
    నొలుకఁగఁ దేనెలు పలుకుల
    కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ


    సలిలం బందు మునింగి సాగరమునన్ సద్భక్తితో వేద వే
    దులు మౌనీశ్వరు లెల్లఁ బూజ లిడఁ జంద్రుం డస్తమింపంగఁ ద
    మ్ములు, కన్పింపఁగ బాల భాస్కరుఁడు సంపూర్ణమ్ముగా, వాడఁగాఁ
    గలువల్, పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ

    [కన్పింపఁగ బాల భాస్కరుఁడు సంపూర్ణమ్ముగా వియత్తలంబునఁ ద
    మ్ములు పూఁచె]

    రిప్లయితొలగించండి
  13. కం:కలువల గని వర్ణింపగ
    తెలవారిన దంచు బడకు దిగులు కవితలన్
    బలుకుము !మా పెరటిన చెం
    గలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ”
    (చెన్ను+కలువ=చెంగలువ.ఇవి పగలు కూడా వికసించే ఉంటాయి.)

    రిప్లయితొలగించండి
  14. పలురకపు బాణసంచల
    వెలుగులతో వీధులన్ని విద్యుల్లతలన్
    దలపించెనచట యరయగ
    కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ”

    రిప్లయితొలగించండి
  15. డా బల్లూరి ఉమాదేవి

    చెలియున్తోడుగసాగశౌరియునుతాశీఘ్రంబుగాపోరుకున్
    ఎలమిన్జూచుచుసత్యభామయునువైవిధ్యమ్ము చూపించుచున్
    చెలువంబొప్పగచూచుచున్ మురహరున్ చేతన్ ధరించన్విలున్
    *కలువల్ పూఁచె వియత్తలంబున బవల్ గన్గొంటివే సత్కవీ”*

    లలనా మణియును కనగా
    కొలనున శశిబింబము గని కోరకమదియున్
    తలలూపుచుండ మిగిలిన
    *"కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ”*

    డా బల్లూరి ఉమాదేవి

    రిప్లయితొలగించండి
  16. వెలసెన్ పూలు సరస్సులోన గనగా వేవేలు
    చోద్యంబుగా
    తలపన్ నాకు మనోహరమ్మును గడున్
    దాదాత్మ్యముంగల్గె నీ
    పలుపల్రీతుల పూవులందునను సంభ్రంబొ
    ప్పగా నేడు చెం
    గలువల్ పూచె వియత్తలంబున బవల్
    గన్గొంటివే సత్కవీ.

    రిప్లయితొలగించండి
  17. 2)మ:తెలుపన్ జాలని పూర్వబంధ మెదొ యేతెంచెన్ విమానమ్మునన్
    గలిపెన్, నీ మథు శైలి భావయుతమై కమ్రమ్ము గా నొప్పు ను
    త్పలమాలల్ గరగించె నా హృదిని, నే భావింపగా చిత్రమౌ
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ”
    (ఇద్దరు కవులు విమానం లో కలిసి కవిత్వం చెప్పుకున్నారు.ఒక కవి చెప్పిన ఉత్పలమాలలని మరొక కవి మెచ్చుకున్నాడు.ఉత్పలం అంటే కలువ కదా!)

    రిప్లయితొలగించండి