15-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్”
(లేదా...)
“కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
పాతరవేయుచువిలువలుమాతయుపితయునుతలపడిమానకపుత్రున్చేతలనున్నతుడగుమనకోతులజతపాఠమొక్కకోఁతికిచెప్పెన్
కందంజాతిపిత కోతులేమనినీతినుడివెననఁగ గడుసు నేర్పె, చెడువినన్రోత యనఁ గనఁకనకనుచుకోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్ఉత్పలమాలజాతికి మూడుకోతులవి చాటిన నీతిని దెల్పుమంచనన్కూతలు గూయుచున్ గడుసు కూర్చెను క్రొత్తగ భాష్యమిట్టులన్రోత చెడున్ వినన్ వెడలురోయనఁ బల్కకు చూడకంచు నాకోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
సాతముబుద్ధితోడనటసంగమమందుచుమానసంబహోభ్రాతగనున్నజీవుగనిరాగములొల్కుచుచుట్టుముట్టుచున్జాతరజేయుచుండుగదచాతురమొప్పగలోకరీతులన్కోఁతులురెండుగూడియొకకోఁతికిపాఠముజెప్పుచుండెడిన్
నీ తాహతు నీ వెరుగవువాతాత్మజ దాటగలవు వార్ధిని నీవేసీతను కనుగొన గలవని కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్.చూతమటన్ వధానమది చోద్యముగా యుగళావధానమున్ చేతురటంచు నేగితిని, శిక్షకుడర్థము లేని ప్రశ్నలన్ భీతియె లేక వేయ కృతవిద్యులటన్ బదులిచ్చుటన్ గనన్ కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్.
కం॥ ఖాతరఁ జేయక నెగురుచుఁజేతుల పట్టునటు జారి చివ్వున పడఁగానాతురత కూడ దంచునుగోఁతుల జత పాఠమొక్క కోఁతికిఁ జెప్పెన్ ఉ॥ వేతన జీవి కష్టముల వేదనఁ బాపెడు బోధఁ జేసెడిన్వేతన జీవి వోలెనటు వెఱ్ఱిగ నిత్యము గంతులేసెడిన్గోఁతినిఁ గాంచి నొచ్చుకొని కూరిమి తోడను క్షేమకాంక్షతోఁగోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
కందం:కోతులు మువ్వురు గుణముననీతులు వల్లింత్రుగాని నియతినిఁ గనమేచేతలలో పాటించనికోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్ఉత్పలమాల:కోఁతులు మూడు మంచియొక కోఁతి వచింపదు, గాంచనొల్లకన్కోఁతియొకండు మంచియన కోరి బిగించును కంటి గంతలాకోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్నీతులు వ్యర్థమంచు విన నేరక చెవ్వుల మూయు కోఁతికిన్
ఈ మూడు కోతులు మంచిని అనవు, కనవు, వినవు 😊
మాత కెడ నేర్చె పాఠముభ్రాతలిరువురు , తమకెల్ల వచ్చుననుకొనన్పాత యితవరికి నేర్పగకోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
మధువన ధ్వంసము: కోఁతులు దారిమధ్యమున గొప్పవనంబును జూచి చేరి, ని ర్భీతిని గ్రోలుచున్ మధువు, పెద్ద ధరాజములెన్నొ కూల్చుచున్ గోఁతులు కొన్ని పాడుచును గొన్ని నటించుచునుండ నొక్కచో కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
నేతలు మానస మందునకోతులు చేతలు కనుగొన కూడని పనులేచేతలఁ జెప్పగ వలదనికోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్నేతలు! చేతనమ్ముఁ గన నిక్కము కోతులు నీతిబాహ్యులున్నీతులు చెప్పుచుండినను నిత్యము పౌరులు లక్ష్య పెట్టరేచేతలు వెల్లడింపకుము చెప్పినఁ జేయకనుండు మంచు నాకోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
కోతికి వారసు లగు చున్ బాత గుణ o బులు వదలక వర్తించు నె డ న్ జేత లు గాంచి యు న య్యె డ కోతుల జత పా ఠ మొక్క కోతికి జె ప్పె న్
ప్రీతిఁ బినదండ్రిఁ గొలు మని వే తెఱవుల నంగదునకు వెత వాలియు నిం కా తారా సతి గోముగఁ గోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్ భూతల మేల నర్హుఁడవు మూఱిన విక్రమ శక్తి యుక్తులం దే తఱినిన్ సమర్థుఁడవె యెన్నఁగఁ బౌరవ వంశ వర్య యం చాతత మా సుయోధనున కంగధవుండును మేనమామయుం గోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
కం:కోతిని రామా!జాతికి, కోతులె వాలియు, ననుజుడు కూడ కపియె,మీభ్రాతల బోల రఖిలు రనికోతుల జత పాఠ మొక్క కోతికి జెప్పెన్(వాలి సుగ్రీవుల వైరం చూసిన హనుమంతుడు రాముడి తో అన్నట్టు.అన్నదమ్ము లందరూ మీ అన్నదమ్ము ల్లాగా ఉండరనే పాఠం నేర్పాయి అని.)
ఉ:"నీ తుల నీవె యంగద!యనింద్య విధమ్ముల రాయబారమున్నీతిగ జేసినా, వికను నేర్పు వహింపుము! యుద్ధమందు నీచేతలు చూపుమా! యని వచించుచు పావని,సూర్య సూనుడన్కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్”(హనుమంతుడు,సుగ్రీవుడు అనే రెండు కోతులు అంగదుని రాయబారాన్ని మెచ్చుకుంటూ యుద్ధం లో కూడా పాఠాలు నేర్పారు.)
డా బల్లూరి ఉమాదేవి నీతులు సతతము వినుచునుకోతులుపాటించెననుచుకువలయమందున్నేతయగు బాపు తెలిపెను*“కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్”*కోతులు మూడు తెల్పెకద కూరిమి తోడను నీతిగాథలన్రీతిగబాపుచెప్పగనురీతిగధారుణియందునెవ్విధిన్భీతియులేకజీవనమువేడుకతోడజనాళి యంచునా*కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్*
చేతనగుదాట సంద్రముఁ గాతరముంజెందకీవు కదులుమ యిపుఁడే చేతో మోదముఁగలుగగకోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
చేతము నందురామయని చెల్వగు నామముఁబల్కుచుండగాఁబూతమనంబుతో నటకు ముఖ్యులు రాముని కార్య సిద్ధికై నీతిగపంపలంకకును నేర్పున శక్తిని గూర్చి చెప్పనౌకోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
నీతిని చెప్పిన కడు చెడుచేతలు తా మారనట్టి చెంచెల కోతిన్మాత కడుకు పిలిపించియుకోతుల జత పా ఠ మొక్క కోతికి జె ప్పె న్రిప్లయి
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. నీతిని దప్పి చరించెడుకోతిని గని వృద్ధులైన కోతులు రెండున్రోత పనులు కూడదనుచుకోతుల జత పాఠ మొక్క కోతికిఁ జెప్పెన్.
పాతరవేయుచువిలువలు
రిప్లయితొలగించండిమాతయుపితయునుతలపడిమానకపుత్రున్
చేతలనున్నతుడగుమన
కోతులజతపాఠమొక్కకోఁతికిచెప్పెన్
కందం
రిప్లయితొలగించండిజాతిపిత కోతులేమని
నీతినుడివెననఁగ గడుసు నేర్పె, చెడువినన్
రోత యనఁ గనఁకనకనుచు
కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
ఉత్పలమాల
జాతికి మూడుకోతులవి చాటిన నీతిని దెల్పుమంచనన్
కూతలు గూయుచున్ గడుసు కూర్చెను క్రొత్తగ భాష్యమిట్టులన్
రోత చెడున్ వినన్ వెడలురోయనఁ బల్కకు చూడకంచు నా
కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
సాతముబుద్ధితోడనటసంగమమందుచుమానసంబహో
రిప్లయితొలగించండిభ్రాతగనున్నజీవుగనిరాగములొల్కుచుచుట్టుముట్టుచున్
జాతరజేయుచుండుగదచాతురమొప్పగలోకరీతులన్
కోఁతులురెండుగూడియొకకోఁతికిపాఠముజెప్పుచుండెడిన్
రిప్లయితొలగించండినీ తాహతు నీ వెరుగవు
వాతాత్మజ దాటగలవు వార్ధిని నీవే
సీతను కనుగొన గలవని
కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్.
చూతమటన్ వధానమది చోద్యముగా యుగళావధానమున్
చేతురటంచు నేగితిని, శిక్షకుడర్థము లేని ప్రశ్నలన్
భీతియె లేక వేయ కృతవిద్యులటన్ బదులిచ్చుటన్ గనన్
కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్.
కం॥ ఖాతరఁ జేయక నెగురుచుఁ
రిప్లయితొలగించండిజేతుల పట్టునటు జారి చివ్వున పడఁగా
నాతురత కూడ దంచును
గోఁతుల జత పాఠమొక్క కోఁతికిఁ జెప్పెన్
ఉ॥ వేతన జీవి కష్టముల వేదనఁ బాపెడు బోధఁ జేసెడిన్
వేతన జీవి వోలెనటు వెఱ్ఱిగ నిత్యము గంతులేసెడిన్
గోఁతినిఁ గాంచి నొచ్చుకొని కూరిమి తోడను క్షేమకాంక్షతోఁ
గోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
కందం:
రిప్లయితొలగించండికోతులు మువ్వురు గుణమున
నీతులు వల్లింత్రుగాని నియతినిఁ గనమే
చేతలలో పాటించని
కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
ఉత్పలమాల:
కోఁతులు మూడు మంచియొక కోఁతి వచింపదు, గాంచనొల్లకన్
కోఁతియొకండు మంచియన కోరి బిగించును కంటి గంతలా
కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
నీతులు వ్యర్థమంచు విన నేరక చెవ్వుల మూయు కోఁతికిన్
ఈ మూడు కోతులు మంచిని అనవు, కనవు, వినవు 😊
తొలగించండిమాత కెడ నేర్చె పాఠము
రిప్లయితొలగించండిభ్రాతలిరువురు , తమకెల్ల వచ్చుననుకొనన్
పాత యితవరికి నేర్పగ
కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
రిప్లయితొలగించండిమధువన ధ్వంసము:
కోఁతులు దారిమధ్యమున గొప్పవనంబును జూచి చేరి, ని
ర్భీతిని గ్రోలుచున్ మధువు, పెద్ద ధరాజములెన్నొ కూల్చుచున్
గోఁతులు కొన్ని పాడుచును గొన్ని నటించుచునుండ నొక్కచో
కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
నేతలు మానస మందున
రిప్లయితొలగించండికోతులు చేతలు కనుగొన కూడని పనులే
చేతలఁ జెప్పగ వలదని
కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
నేతలు! చేతనమ్ముఁ గన నిక్కము కోతులు నీతిబాహ్యులున్
నీతులు చెప్పుచుండినను నిత్యము పౌరులు లక్ష్య పెట్టరే
చేతలు వెల్లడింపకుము చెప్పినఁ జేయకనుండు మంచు నా
కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
కోతికి వారసు లగు చున్
రిప్లయితొలగించండిబాత గుణ o బులు వదలక వర్తించు నె డ న్
జేత లు గాంచి యు న య్యె డ
కోతుల జత పా ఠ మొక్క కోతికి జె ప్పె న్
ప్రీతిఁ బినదండ్రిఁ గొలు మని
రిప్లయితొలగించండివే తెఱవుల నంగదునకు వెత వాలియు నిం
కా తారా సతి గోముగఁ
గోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
భూతల మేల నర్హుఁడవు మూఱిన విక్రమ శక్తి యుక్తులం
దే తఱినిన్ సమర్థుఁడవె యెన్నఁగఁ బౌరవ వంశ వర్య యం
చాతత మా సుయోధనున కంగధవుండును మేనమామయుం
గోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
కం:కోతిని రామా!జాతికి,
రిప్లయితొలగించండికోతులె వాలియు, ననుజుడు కూడ కపియె,మీ
భ్రాతల బోల రఖిలు రని
కోతుల జత పాఠ మొక్క కోతికి జెప్పెన్
(వాలి సుగ్రీవుల వైరం చూసిన హనుమంతుడు రాముడి తో అన్నట్టు.అన్నదమ్ము లందరూ మీ అన్నదమ్ము ల్లాగా ఉండరనే పాఠం నేర్పాయి అని.)
ఉ:"నీ తుల నీవె యంగద!యనింద్య విధమ్ముల రాయబారమున్
రిప్లయితొలగించండినీతిగ జేసినా, వికను నేర్పు వహింపుము! యుద్ధమందు నీ
చేతలు చూపుమా! యని వచించుచు పావని,సూర్య సూనుడన్
కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్”
(హనుమంతుడు,సుగ్రీవుడు అనే రెండు కోతులు అంగదుని రాయబారాన్ని మెచ్చుకుంటూ యుద్ధం లో కూడా పాఠాలు నేర్పారు.)
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండినీతులు సతతము వినుచును
కోతులుపాటించెననుచుకువలయమందున్
నేతయగు బాపు తెలిపెను
*“కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్”*
కోతులు మూడు తెల్పెకద కూరిమి తోడను నీతిగాథలన్
రీతిగబాపుచెప్పగనురీతిగధారుణియందునెవ్విధిన్
భీతియులేకజీవనమువేడుకతోడజనాళి యంచునా
*కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్*
చేతనగుదాట సంద్రముఁ
రిప్లయితొలగించండిగాతరముంజెందకీవు కదులుమ యిపుఁడే
చేతో మోదముఁగలుగగ
కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్
చేతము నందురామయని చెల్వగు నామముఁబల్కుచుండగాఁ
రిప్లయితొలగించండిబూతమనంబుతో నటకు ముఖ్యులు రాముని కార్య సిద్ధికై
నీతిగపంపలంకకును నేర్పున శక్తిని గూర్చి చెప్పనౌ
కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్
నీతిని చెప్పిన కడు చెడు
రిప్లయితొలగించండిచేతలు తా మారనట్టి చెంచెల కోతిన్
మాత కడుకు పిలిపించియు
కోతుల జత పా ఠ మొక్క కోతికి జె ప్పె న్
రిప్లయి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
నీతిని దప్పి చరించెడు
కోతిని గని వృద్ధులైన కోతులు రెండున్
రోత పనులు కూడదనుచు
కోతుల జత పాఠ మొక్క కోతికిఁ జెప్పెన్.