16, జులై 2024, మంగళవారం

సమస్య - 4823

17-7-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్”

(లేదా...)

“జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్”

(జులై 17 నా పుట్టినరోజు. 74 నిండి 75లో అడుగుపెడుతున్నాను)

46 కామెంట్‌లు:

  1. పుట్టినరోజుశుభాకాంక్షలుగురువుగారు

    రిప్లయితొలగించండి
  2. పుట్టినరోజు శుభాకాంక్షలు సర్
    god bless you

    రిప్లయితొలగించండి
  3. 🙏 గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏

    రిప్లయితొలగించండి
  4. గురుదేవులకు జన్మదినోత్సవ శుభాకాంక్షలతో.....


    వారిలో ఆత్మ యిలా ప్రవచిస్తున్నదని ఊహిస్తూ...

    కందం
    మృన్మయ దేహిని గురువుగ
    మున్ముందుగ శంకరుండ! పూనఁగ శివుఁడున్
    జన్మలన గురు పరంపర
    జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్!


    శార్దూలవిక్రీడితము
    విన్మా! యాదిగురుండు శంకరుఁడు విశ్వేశుండు పూనన్ భువిన్
    సన్మార్గాన గురుల్ పరంపరఁగ సత్సంస్కారముల్ సూపఁగన్
    జన్మమ్ముల్ మనదైన సంస్కృతిమనన్ సాగింపు సోపానమై
    జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్

    రిప్లయితొలగించండి
  5. గురుదేవులకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🎉🎉🎉

    రిప్లయితొలగించండి
  6. జన్మించి గిట్టగ మరల
    జన్మించు ననుచు తెలిపెను శాస్త్రము లన్నీ
    చిన్మయుని పనుపున నిపుడు
    జన్మించితిఁ , జచ్చి మరల జన్మించితిటుల్

    రిప్లయితొలగించండి
  7. అన్నా! మాయనుగనుమా
    సున్నా
    గుబ్రదుకుసూడసోద్యముగాదే
    వెన్నుండింతయుజేసెగ
    జన్మించితిఁజచ్చిమరవజన్మించితిటుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తన్మయమైయుంటినిగద
      మన్మనమందిరకుహరముమాయనుగ్రమ్మన్
      మృణ్మయమౌబుద్ధివలన
      జన్మించితిజచ్చిమరలజన్మించితిటుల్

      తొలగించండి
    2. మొదటి పూరణలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
  8. జన్మదిన శుభాకాంక్షల తో ---
    జన్మింతురుగురువులు గా
    జన్మను సార్తకమొ నర్ప శంకరు ని వలెన్
    చిన్మయ రూపు డ నగు చున్
    జన్మించితి :: జఛ్చి మరల జన్మించితి టుల్

    రిప్లయితొలగించండి
  9. కం॥ సన్మతి దుర్మతి గణనను
    సన్మానించు విభుఁడిలను సర్వజనాళినిన్
    జన్మము మరుజన్మములను
    జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్

    శా॥ జన్మన్ బొందఁగఁ బుణ్య కార్యములిలన్ సంతృప్తితోఁ జేయఁగన్
    సన్మానించు విభుండు సజ్జనుల నిస్తారంబుతోఁ గాంచఁగన్
    జన్మన్ బొంది జనుల్ జరించు పగిదిన్ జన్మావృతమ్మౌనిలన్
    జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీజన్మమ్మునుం బొందితిన్

    శ్రీ కంది శంకరయ్య గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ కవిత్వ సేవ కొనసాగించు స్వస్థత మీకు భగవంతుడు కలుగజేయనీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      ధన్యవాదాలు.

      తొలగించండి

  10. చిన్మయ రూపుండాతడు
    సన్మార్గమొసంగు శివుడు సామియె , నేనా
    జన్మమున దక్ష సుతయై
    జన్మించితిఁ జచ్చి , మరల జన్మించితిటుల్.


    కన్మోడ్పున్ విడి యీశ్వరున్ బతిగ నేకాంక్షించు టేలంచనన్
    జన్మమ్మందితి దక్షపుత్రికగ భస్మాంగుండు కేదారుడున్
    సన్మార్గమ్మునొసంగు శంకరుడె నాసంధ్యాంచు డై యొప్పగా
    జన్మన్ బొందితిఁ జచ్చితిన్, మరల నీ జన్మమ్మునుం బొందితిన్.

    రిప్లయితొలగించండి
  11. జన్మములన్నిఁట మానవ
    జన్మంబుత్కృష్టమనుచు సజ్జనునిగనే
    సన్మానమొంద నరునిగ
    జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్

    రిప్లయితొలగించండి
  12. సన్మానంబులనొంది సద్గురువుగా శ్లాఘమ్మునుంబొందిరీ
    జన్మంబందున శిష్యులెల్లరకు విజ్ఞానంబు వేలార్చుచున్
    జన్మంబొందగ మీదు ఛాత్రునిగ నేజన్మంబులోనైన నేన్
    జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్

    రిప్లయితొలగించండి
  13. జన్మాలనంతమనగా
    జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్
    సన్మార్గమున చరించితి
    సన్మానార్హత నొసగిరి సత్కవులిలలో

    జన్మే లభ్యము దీర్ఘనిద్ర పిదపన్ జన్మాలనంతంబులే
    సన్మార్గంబును త్రొక్కియుంటి నెపుడున్ సత్కావ్య సాంగత్యమే
    జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్
    సన్మానార్హత కల్గియుంటివనుచున్ సద్భక్తి చూపింతురే

    రిప్లయితొలగించండి
  14. జన్మమ్ము లనిత్యమ్ములు
    జన్మ పరంపర లనిశము సాగుచు నుండున్
    విన్మా నీవును ధర, నే
    జన్మించితిఁ జచ్చి మరల, జన్మించి తిటుల్


    కన్మా పుట్టుక లింకఁ జావులఁట యెక్కాలమ్మునన్ జీవికిం
    దన్మూలమ్మునఁ గల్గుచుండు నిలలో దామోదరుం డింపుగా
    నున్మీలింపఁగఁ జేయఁ కేళిగతిఁ దా నుత్సాహియై నిత్యమున్
    జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్

    పూజ్యులు శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      "జేయఁ గేళిగతి" టైపాటు.

      తొలగించండి
  15. కం:జన్మించితి ద్విజకులమున,
    జన్మాంతర పుణ్య మేదొ జంధ్యము నిచ్చెన్
    జన్మ మిది క్రొత్త దయ్యెను
    జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్”
    (ద్విజుడు అంటే రెండు జన్మ లెత్తిన వాడు .యజ్ఞోపవీతం తో రెండవ జన్మ అవుతుంది కనుక.)

    రిప్లయితొలగించండి
  16. శా:జన్మన్ బొందితి నొక్క యింట,నటు పై జన్మించి రీ తమ్ములున్,
    సన్మైత్రిన్ వహియించి తండ్రి యొక వంశమ్మున్ భువిన్ నిల్ప ,కీ
    ర్తిన్ మా వంశము బొంద దత్తతగ వీరిన్ జేరగా బంపె నే
    జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్”
    (దత్తత జరిగినప్పుడు కూడా ఒక జన్మ అంతరించి మరొక జన్మ పొందినట్లే.వంశం మారి పోతుంది.గత జన్మలో మరణించినట్లు,మరొక చోట జన్మించినట్టు మంత్రం కూడా చెపుతా రట.)

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి జన్మదినశుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  18. మున్ముందుగముదమారగ
    జన్మించితినంబగాను జగతిని పిదపన్
    విన్మా భీష్మున్ జంపగ
    జన్మించితి జచ్చి మరల జన్మించితిటుల్


    జన్మంబెత్తితి బోయవాడిగనటన్ సాగించ దుష్కృత్యముల్
    సన్మార్గంబును చూపగా నచటకున్ సన్మౌను లేతెంచగన్
    ఉన్మాదమ్ముననిందచేయుచునునేనూరూరకేతిట్టుచున్
    *“జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరలనీజన్మమ్మునుం బొందితిన్”*

    రిప్లయితొలగించండి
  19. జన్మము మరణము లయ్యవి
    చిన్మయునింబరిధియనుచు చెప్పగ వలయున్
    దన్మయుఁడగుచును గురువనె
    జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్

    రిప్లయితొలగించండి
  20. జన్మన్బొందితివింతయౌరచనతేజంబునేనొందితిన్
    సన్మార్గంబునసత్యసంథతనునిస్సంగుండనైయుండకన్
    పెన్మత్సంగనియంతరంగమునపెంపేదనేనైతిగా
    జన్మన్బొందితిజచ్చితిన్మరలనీన్మమ్మునున్బొందితిన్

    రిప్లయితొలగించండి
  21. జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్
    జన్మన్ బొందుట చావునొందుటనగాసామాన్యమేజీవికిన్
    కన్మా శంకర సావధానమున మీకాంక్షాను కూలంబుగా
    జన్మన్ బొందుము తప్పకుండగ నికన్ శాస్త్రాలు బోధింపగన్

    రిప్లయితొలగించండి
  22. జన్మించితిఁ... = జన్మించితిని
    జన్మించి తిటుల్ = జన్మించితివి యిటుల్
    ఈ యర్థ భేదము గమనార్హము.

    రిప్లయితొలగించండి