21, జులై 2024, ఆదివారం

సమస్య - 4828

22-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే”
(లేదా...)
“దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

16 కామెంట్‌లు:

  1. దంష్ట్రలకాళీరూపము
    దంష్ట్రాన్వితుడైనయట్టిదైత్యునికసిగా
    దంష్ట్రలవాడినిద్రుంచెను
    దంష్ట్రాఘాతమునఁగూలెద్వేైమాతురుడే

    రిప్లయితొలగించండి
  2. కందం
    దంష్ట్రాన్వితుడగు గణపతి
    దంష్ట్రలజూపి తలిదండ్రి ద్వారముగాయన్
    దంష్ట్రఁ బరశువిడ రాముడు
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే!

    శార్దూలవిక్రీడితము
    దంష్ట్రాభూషణుఁడౌగణేశు నుమయున్ ద్య్రక్షుండు గాపుంచగన్
    దంష్ట్రల్ నూపుచు పర్శుపాణి నిలుపన్ ద్వారాన కోపంబునన్
    దంష్ట్రన్ మోదగ గండగొడ్డలివడిన్ దాత్కాలికమ్మాదరిన్
    దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్!

    రిప్లయితొలగించండి

  3. దంష్ట్రమ్ము లూడ బెరికిన
    దంష్ట్రాయుధుడా కలయము ద్రావితివేమో
    దంష్ట్రములన్ రాల్చెద నే
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే?


    దంష్ట్రమ్ముల్ గలవాడవే యిటుల వాదమ్మేలరా మూఢుడా
    దంష్ట్రాలుండవు నీకు బూటకపు గాథల్ చెప్పినన్
    గాంచగన్
    దంష్ట్రమ్మున్ సుముఖుండు తా విసిరె చిత్రాటీరు పైనన్ మరే
    దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్?

    రిప్లయితొలగించండి
  4. దంష్ట్రల్ దంతుల యాస్యమందు కడు నుత్కర్షంబుగా నొప్పనా
    దంష్ట్రల్ గల్గిన కుంజరాననుని యుత్థానమ్మునందున్ గటా
    దంష్ట్రన్ పర్శువుతోడ భార్గవుడు కాతాళమ్ముగా ద్రెంచగన్
    దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ దంష్ట్రపు తీక్ష్ణత తుచ్ఛము
    దంష్ట్రాశక్తిని గణపతిఁ దాఁచుట హసమే!
    దంష్ట్రము విరుగుఁగద యెచట
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతరుఁడే

    శా॥ దంష్ట్రాఘాతము తోడఁ గూల్చుటయు సాధ్యంబౌనె యెవ్వారికిన్
    దంష్ట్రాతీక్ష్ణత విఘ్ననాయకునకే దైవాఱఁగా నెట్టులన్
    దంష్ట్రాఘాతము తోడఁ గూలుటయు సంత్యంబందువో యెచ్చటన్
    దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుండాజిలో

    శ్రీమతి బులుసు అపర్ణగారు బిందుపూర్వక ష్ట్రాతో మరి రెండు పదాలు వాడినారండి. అవి నాకు తెలియదండి.

    రిప్లయితొలగించండి
  6. రాష్ట్రము నందలి నేతలు
    రాష్ట్రావతరణ దినమని లంబో దరునిన్
    నుష్ట్రముపై త్రిప్ప , నతని
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే

    రిప్లయితొలగించండి
  7. దంష్ట్రము తోలిఖియించెను
    దంష్ట్రాయుధము నిగిడించె దైత్యుని పైనన్
    దంష్ట్రమొకటియున్న నెచట
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే?

    దంష్ట్రాగ్రమ్మున పృథ్విఁ నిల్ప కిరమై తాఁబుట్టెగా విష్ణువే
    దంష్ట్రాదండము గూర్చి చెప్పనగునా దాడిన్ హిరణ్యాక్షుడే
    దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్; ద్వైమాతురుం డాజిలోన్
    దంష్ట్రంబే క్షయమై యనన్య సరళిన్ తానేకదంతుండయెన్

    రిప్లయితొలగించండి
  8. దంష్ట్రములు పద నగు మహా
    దంష్ట్రమ్మునకుఁ బరికింపఁ దద్దయుఁ గొఱకన్
    దంష్ట్రములచే నరుఁ డొకఁడు
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే
    [మహాదంష్ట్రము = పులి]


    దంష్ట్రమ్ముల్ దనరారుచుండ నిశి తాస్త్రవ్రాతభంగిన్ మహా
    దంష్ట్రాభం బయి భీమ సేనుఁ డనిలోఁ దద్దేహముం జీల్పఁగా
    దంష్ట్రాలిన్ వెసఁ గొర్కుచుం బగను బ్రద్దల్ గాఁగ దేహం బహో
    దంష్ట్రాఘాతము చేత నేల కొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్
    [ద్వైమాతురుఁడు = జరాసంధుఁడు]

    రిప్లయితొలగించండి
  9. దంష్ట్ర ము లన్ విరిగె నొకటి
    దంష్ట్ర ము తో బిలువ నే క దంతు డ యె నా
    దంష్ట్ర ము రక్షింప నెటు ల
    దంష్ట్రా ఘాతమున గూ లె ద్వై మాతు రు డే?

    రిప్లయితొలగించండి
  10. దంష్ట్రల్ దంతులకు సొబగు
    దంష్ట్రను భార్గవుఁడు ద్రెంచెఁదన పర్శువుతో
    దంష్ట్రనుఁగోల్పడె శాంకరి
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే

    రిప్లయితొలగించండి
  11. కం:దంష్ట్రల బలమున సవతులు
    దంష్ట్రములన్ జంతికలను దడదడ నమలన్
    దంష్ట్రల ధృతి లేక తినుచు
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే”
    (సవతి తల్లులకి దంతాలు గట్టిగా ఉండి జంతికలు తిన్నారు.కానీ కొడుక్కి దంతాలు బలం లేక తిన లేక కింద బడ్డాడు.ద్వైమాతురుడంటే వినాయకుడే కాదు.తల్లికి సవతి ఉంటే ఎవరైనా ద్వైమాతురులే.)

    రిప్లయితొలగించండి
  12. శా:దంష్ట్రల్ నూరుచు రాక్షసుండు తనతో ద్వంద్వాజి లో రెచ్చుచున్
    దంష్ట్రల్ ఖడ్గములై తెగంబడగ తా తాత్కాలికాస్వస్థతన్
    దంష్ట్రన్ క్లేశము దాచుకొంచు లఘునిద్రన్ బొందిన ట్లొప్పుచున్
    దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్”
    (రాక్షసుని తో గణపతికి ద్వంద్వయుద్ధం జరిగింది.రాక్షసుడు కాబట్టి కోరల తో కూడా యుద్ధం చేసాడు.ఆ సమయం లో గణపతి బాధ చెంది తాత్కాలికం గా నేల కొరిగాడు.)

    రిప్లయితొలగించండి
  13. దంష్ట్రలు గలిగిన గణపతి
    దంష్ట్రలతోనడ్డగించ దైత్యారి శివున్
    దంష్ట్రలనేఖండించగ
    దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే

    రిప్లయితొలగించండి
  14. దంష్ట్రాభూషితుఁడౌచు విఘ్నపతిఁదాద్వారంబు నందుండగా
    దంష్ట్రానాధుని తండ్రి శంభుఁడు తమిన్ దావేగ చేరంగఁ నా
    దంష్ట్రా కారుఁడ యడ్దగించగ వెసన్ దైత్యారి ఖండించగా
    దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్

    రిప్లయితొలగించండి
  15. దంష్ట్రల బలమును చూపుచు
    దంష్ట్రలతోనెల్లతిండి తల్లులు తినగా
    దంష్ట్రలు రానిగణపతియు
    దంష్ట్రాఘాతమున గూలె ద్వైమాతురుడై

    రిప్లయితొలగించండి