22, జులై 2024, సోమవారం

సమస్య - 4829

23-7-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున”
(లేదా...)
“పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

22 కామెంట్‌లు:

  1. వల్లకానిదిసత్యకోపముపారిజాతమునీయగన్
    గొల్లవాడునుమోసపుచ్చెనుగోలతానుగనుండగన్
    ఉల్లమందునప్రేమయుంచెనునోర్వజాలదువైరమున్
    పల్లవాధరిప్రల్లదంబదిభర్తకెంతయుహర్షమౌ

    రిప్లయితొలగించండి
  2. వటుడుశంభునినిందించె వదరుబోతు
    గిరిజహర్షింపజాలకకినుకనందె
    సున్నితంబుగదిట్టెనే తోయజాక్షి
    పతిమురిసెపల్లవాధరిప్రల్లదమును

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    తల్లి తనయుని జంపుట ప్రల్లదమగు!
    దుష్టుడంచును లోకమ్ము దోషమెంచ
    నరకుని జననియై సత్య పొరిగొనంగ
    పతి మురిసె బల్లవాధరి ప్రల్లదమున

    మత్తకోకిల
    ప్రల్లదమ్మగుఁ దల్లి పుత్రుని ప్రాణమున్ గొన నెంచగా!
    నెల్లలోకము దుష్టుడంచును నేకుచుండగ నిందలన్
    తల్లిసత్యయె చంపపోరున దానవున్ నరకాసురున్
    పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ!

    రిప్లయితొలగించండి
  4. తే॥ సతిని ప్రేమించు కృష్ణుడు సతతము నటు
    కోపగించినఁ దనునొచ్చు కొనక సత్య
    మురిపెమును దీర్చెడి కతన పోఁడిమిఁ గనిఁ
    బతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున

    మత్త॥ ఇల్లు నాలును బట్ట కుండగ నెల్ల వేళలఁ గాంతుఁడే
    చల్లగాఁ దను తప్పుకొంచును జాల భారము వేయఁగాఁ
    దల్లి వోలెను భార్య బుద్ధినిఁ దల్లడిల్లుచు నేర్పఁగన్
    బల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ అండి. మా ఉద్యోగ కాలములో చాలా మందికి జరిగినదేనండి. పిల్లలకు 12-13 సం॥ వయసులో అస్సాము లేక త్రిపురకు బదలీ ఔతుంది. సామాన్యంగా పిల్లల చదువులు పాడుకాకుండా సంసారము నున్న చోటునే వదలి భర్తవెళుతుండాడు. త్రైమాసిక సెలవులకు వచ్చినప్పుడు భార్య ఎంత కష్టపడిందో చెపుతుంటే భర్త గమ్మున వింటుంటాడండి. దీనికి పద్య రూపమిచ్చే ప్రయత్నమండి.

      మత్త॥ ఇల్లునాలును సంతు నెంచక నెల్ల వారల వీడెనో
      యిల్లు పిల్లల రక్ష భార్యకు నిచ్చి దూరము కాంతుఁడే
      యిల్లుఁ జేరఁగఁ గష్టనష్టము లెన్నొ తెల్పుచుఁ బల్కునా
      పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ

      తీను లేనప్పుడు అంత చక్కగా నడిపింనందుకు సంతోషము బాధ రెండూ సామాన్యమేనండి

      తొలగించండి
    2. తాను పొరపాటున తీను యైనది. మన్నించాలి

      తొలగించండి

  5. పారిజాతమ్ము నాసతి పాలు జేసి
    నన్ దటమటించితి వనుచు నారి సత్య
    భామ కినుకను పలికిన పలుకుల విని
    పతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున.


    కల్లరీడు మహీజుతోడను కయ్యమాడెడి వేళ మూ
    ర్ఛిల్లినంతట నిబ్బరమ్మున రేరిహాణుని గూల్చగా
    విల్లు బట్టుచు పోరుసల్పిన వీరనారిని గాంచుచున్
    పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ.

    రిప్లయితొలగించండి
  6. అత్తవారింటికి వెడలె నాలుతోడ
    పండుకొనుటకు మెత్తని పరుపు పరచ
    పతి మురిసెఁ , బల్లవాధరి ప్రల్లదమున
    పెనగులాడక దాపుకు పిలిచెనతడు

    రిప్లయితొలగించండి
  7. ఉల్లమందున నిల్చిన యుజ్జ్వలాంగి
    మెల్లమెల్లగ వీణియ మీటినటుల
    వదరు చుండగ రట్టడి పల్కులెల్ల
    పతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున

    ఉల్లమందున నిల్లుకట్టిన యుజ్జ్వలాంగి విఘర్షణే
    పల్లవంబులు మెక్కి కూసిన పంచమాస్యపు గానమౌ
    పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ
    కల్లలాడక వెల్లడించెను కల్లు త్రాగిన మత్తులో

    రిప్లయితొలగించండి
  8. వల్లమాలిన ప్రేమ నీపయి భామరో యను వెన్నునిన్
    కల్లమాటలు కట్టిపెట్టని కల్కి రోషము దూఁకొనన్
    ప్రల్లదంబులు బల్కిమెల్లగ పాదతాడనఁజేసెనే
    పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ

    రిప్లయితొలగించండి
  9. పారిజాతము సవతికి పతియొసంగ
    నలుక బూనిన ప్రియసఖి ననునయింప
    పాద తాడన మొనరించి పతిని దూరె
    పతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున

    రిప్లయితొలగించండి
  10. పడుచు దనమున దం పతుల్ వలపు గలిగి
    మిగుల న న్యో న్య ముగనుండ మేది నందు
    పతి మురిసె పల్ల వా ధ రి ప్రల్ల దమున
    న నె డు ప్రశ్న యె యుద యింప దవని ని గద

    రిప్లయితొలగించండి
  11. పలికిన పలుకు పలుకక వారిజాక్షి
    యధర మత్తఱిఁ గంపమ్ము నందఁ గరము
    సతియె ప్రణయ కోపమ్మునఁ జలుప నింద
    పతి మురిసెఁ బల్లవాధర ప్రల్లదమున


    వల్లవీజన లోలుఁ డిద్ధర వాసుదేవ వరాఖ్యుఁడే
    మెల్ల మెల్లగ వీణ నూదుచు మించి యంతట మాయమై
    చల్ల చల్లగ జాఱఁ దిట్టెడి శాపయుక్త విశేషమౌ
    పల్లవాధర ప్రల్లదం బది భర్త కెంతయొ హర్షమౌ

    రిప్లయితొలగించండి
  12. యవ్వనమున ప్రణయకలహమున వారు
    మాటలేవి పల్కిన దోచు మక్కువగను
    సరస సల్లాప సమయాన సమ్ముదమున
    పతి మురిసె పల్ల వా ధ రి ప్రల్ల దమున

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:తల్లి గద్దరి తనమును తాను సైచె
    పిరికి తనమున,తన కొక పెండ్లి కాగ
    భార్య తల్లి పై నెగబడి వాగుచుండ
    పతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున

    రిప్లయితొలగించండి
  14. మ.కో:మెల్లగా వచియించు సౌమ్యుడు మిత్తి కీయగ సొమ్ములన్,
    చెల్ల గట్టక త్రిప్పుచుండగ చేతగాని తనమ్ముతో
    తెల్లబోవగ, భార్య యందరి దిట్టి సొమ్ముల గుంజగా
    పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ”

    రిప్లయితొలగించండి
  15. వల్లమాలిన ప్రేమతోపనిపాటలెల్లయుచేయుచున్
    మెల్లగాదరిచేరి భర్తయు మెచ్చగా మది పొంగగా
    అల్లరిప్పుడుచేయబోకనిహద్దుహద్దనినవ్వుచున్
    పల్లవాధరి ప్రల్లదంబదిభర్తకెంతయుహర్షమౌ




    సతిపతులట సరసమాడు సమయ మందు
    చిలిపిమాటలతోడనుచేర దరికి
    ముద్దుగ కసిరికొట్టెడు ముదితను గని
    పతిమురిసె పల్లవాధరి ప్రల్లదనము


    రిప్లయితొలగించండి
  16. గాలి చల్లగ వీయగ నాలు మగలు
    నొకరి కొక్కరు మూతుల నొడిసి కొనగఁ
    బతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున
    దేలియాడిరి దినమంత యలల పగిది

    రిప్లయితొలగించండి
  17. అల్ల మోహను లాస్య లిర్వురు నేక శయ్యను జేరుచున్
    ప్రల్లదంబుగ నొక్క రొక్కరు భవ్య జీవిత మందనౌ
    నుల్ల మందున సంతసంబులు పల్లవించగ నా
    పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ

    రిప్లయితొలగించండి
  18. ఎల్లవేళల వెంటనుండెడి నింతికివ్వక పుష్పమున్
    పుల్లలెట్టెడు నారదుండిడ మోదమొప్పగ భైష్మికిన్
    మెల్లగా తనకిచ్చినావుగమేటినాటకమేలనన్
    *పల్లవాధరి ప్రల్లదంబదిభర్తకెంతయుహర్షమౌ*

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రణము నందున విల్లును రయమున గొని
    వీర పత్నిగ సత్యయె వీరమమున
    తల్లి యైనను నరకుని తాను ద్రుంచ
    పతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున.

    రిప్లయితొలగించండి