29, జులై 2024, సోమవారం

సమస్య - 4836

30-7-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్”

(లేదా...)

“మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

35 కామెంట్‌లు:

  1. సహనము గల్గిన వాడై
    తహతహ లాడంగ బోని తాపసి యగుచున్
    కుహనా వర్తుడు గాకన్
    మహిమలు జూపడట యోగి మన్నన కొఱ కున్

    రిప్లయితొలగించండి
  2. సహియించున్గదసాధుజీవనమువిశ్రాంతుండులౌక్యంబునన్
    విహరించున్గదవిశ్వమందుగనుచున్విష్ణున్సదానందుడై
    మహిమల్జూపడుయోగిమన్ననగనన్మాత్సర్యసంలగ్నుడై
    దహనంబౌగదవాంఛలేమదినితాదాత్మ్యంబుతాగోరుచున్

    రిప్లయితొలగించండి
  3. ఇహమదిగోరకపరుడై
    విహితంబగుకర్మయందువిజ్ఞతనుండున్
    కుహనాసిద్ధుడుగాకను
    మహిమలజూపడటయోగిమన్ననకొఱకున్

    రిప్లయితొలగించండి
  4. మహితాత్ముడైన యోగియు
    విహితముగా బల్కుచుండు వినయముతోడన్
    రహివీడి యనవసరముగ
    మహిమలు జూపడట యోగి
    మన్నన కొఱ కున్

    రిప్లయితొలగించండి
  5. అహితంబై చను పెక్కుచేష్టలను సన్న్యాసంబు పేరన్ మునున్
    మహి నిర్భీతిని జేసి రట్టగుట డంబంబెల్ల తాదోషిగా
    నహివంశాగ్రణి భంగినూర్చుచును న్యాయస్థానమున్ నిల్చుటన్
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై

    రిప్లయితొలగించండి
  6. ఇహమున జనావళియెదుట
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్
    కుహనా తపసుల మాదిరి,
    తహతహ లాడునట సతము ధన్యుల బేయన్

    రిప్లయితొలగించండి
  7. కందం
    ఇహము విరక్తిని బెంచఁగ
    విహితమన శతకఁపు నీతి వేమన చెప్పెన్
    రహిలేక దైహికముపై
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్!

    మత్తేభవిక్రీడితము
    ఇహమున్ నీచమటన్న భావనను యోగీశుండునై వేమనే
    విహితమ్మంచును సాహితీగరిమతో వేనోళ్ళు కీర్తింపగన్
    మహనీయమ్ముగఁ చెప్పి నీతిశతకమ్మందించె వైరాగ్యమై
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై

    రిప్లయితొలగించండి

  8. ఇహలోక సౌఖ్యములపై
    తహతహ విడనట్టి వాడు ధనమార్జింపన్
    కుహనా వేషము గట్టిన
    మహిమలఁ జూపఁడఁట యోగి , మన్నన కొఱకున్.



    ఇహలోకమ్మున భోగ భాగ్యములపై యిచ్ఛన్ విసర్జింపకన్
    సహనమ్మున్ నటియించెడిన్ గపటులే సద్బోధ నల్ చేసినన్
    కుహనా కప్పడి గారలీ యవనిలో కూళుండ్రకే లేని యౌ
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్, మాత్సర్యసంలగ్నుఁడై.

    రిప్లయితొలగించండి
  9. కం॥ ఇహమున జనులు సుఖమరయ
    మహిమలఁ జూపెద నటంచు మహిలో దోఁచన్
    బహు కపటులు పెరుఁగుటఁ గని
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్

    మ॥ ఇహమే ముఖ్యమటంచు మోసముల నెన్నెన్నో భువిన్ జేయుచున్
    మహిమల్ సూపెడు వంచకుల్ జనుల సమ్మానమ్మునే పొందఁగన్
    మహిమల్ సూపడు యోగి మన్ననఁ గనన్, మాత్సర్య సంలగ్నుఁడై
    మహిలో మోసముఁ జేయు కుత్సితము నేమాత్రమ్ము లేనందునే

    ఇది జరుగుతున్నదే కదండి. ఒకప్పుడు బెంగుళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ హెచ్ నరసింహయ్య గారు with eminent Scientists from Indian Institute of Science constituted a committee for scientific investigation of miracles. కాకాపోతే అది ముందు కెళ్ళకుండా అడ్డుకున్న మహాత్ములు ఎందరో!

    రిప్లయితొలగించండి
  10. అహరహమున్ మోక్ష నిరతి
    నిహలోకంబును విడువగ నీప్సిత హతుడై
    మహదానందముతోడన్
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్

    మహనీయుల్ గదయోగి పుంగవులిలన్ మౌనవ్రతాపేక్షులై
    బహుదూరంబులకేగి శాంతియుతులై భాసిల్లరే కానలన్
    ఇహలోకంబున వాంఛలన్ విడువకే యేమార్చు వాడైనచో
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై

    రిప్లయితొలగించండి
  11. ఇహమును త్యజియించుటకై
    మహిలో యోగీశ్వరుండు మార్గమ్మరయున్
    మహిమాన్వితుడయ్యును తా
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్

    రిప్లయితొలగించండి
  12. మహిలోఁ జూపఁగ నించుక
    మహిమ కలిగినఁ గద! సంయమన మున్న గదా!
    యిహ ధన పరులే యెల్లరు
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్


    ఇహమం దెందఱొ యోగు లున్నను నిజం బెన్నంగ నవ్వారిలో
    సహనం బక్కట గాంచ వీ లగునె యీషన్మాత్ర మెప్పట్టునం
    గుహనా తాపసు లెల్ల రక్కజముగాఁ గుంఠీకృతజ్ఞానులే
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్య సంలగ్నుఁడై

    రిప్లయితొలగించండి
  13. కం:మహిమలనగ సాధకునకు
    నహమున్ దొలగించి జ్ఞాన మందించుటకే
    అహహాల కొరకు జేయడు
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్”

    రిప్లయితొలగించండి
  14. అహమే మాత్రము చూపక
    సహనము తోడను బదులిడుసతతంబిలలో
    నిహలోకపుసుఖములకై
    *"మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్”*


    సహనమ్మేతనయాయుధమ్ముగనుతా సత్కార్యముల్ సేసియీ
    యిహలోకంపుసుఖమ్ములన్ మనము నన్ యేమాత్రమున్ కోరకే
    యహమున్ చూపుచుగొప్పచెప్పుకొనకే నత్యంత సంరంభియై
    *“మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై”*


    రిప్లయితొలగించండి
  15. మ:అహమున్ బాపగ,సాధకాళి మదిలో నాస్తిక్యమున్ గూర్చనే
    మహిమల్ జూపును యోగి, సొమ్ము గొననో,మందుల్ ప్రశంసింపనో
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్, మాత్సర్యసంలగ్నుఁడై
    సహయోగీంద్రుల పైన స్పర్థ బడుచున్ సాగింప డే మాయలన్.
    (యోగి సాధకులకి నమ్మకం కలగటానికి మహిమలు చూపుతాడు కానీ,సొమ్ములకి,మూర్ఖుల మెప్పు కోసం, ఇతర యోగుల మీద పోటీకి మహిమలు చూపడు.)

    రిప్లయితొలగించండి
  16. ఇహమున్ వీడి పరంబు నొందుటకునై యీశున్ మదిన్ నిల్పుచున్
    మహిలో మాన్యులు యోగివర్యులు సతంబా పూనికన్ గొల్వఁగా
    మహిమల్ బొందుట సాజమేయయిన సామాన్యున్ వలెన్ యెన్నఁడా
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై

    రిప్లయితొలగించండి
  17. అహమన్నది లేకుండగఁ
    నహరహమును ధ్యానమందె యంకితమగుచున్
    మహికిన్ శుభముల నీయగ
    మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్

    రిప్లయితొలగించండి
  18. అహమున్ జెందక లోక రక్షణయెముఖ్యంబంచుఁదానెంచుటన్
    మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై
    యహమే హేతువు జీవరాహితికి భూతాంతరాళంబునన్
    కుహనా యోగులుగొందరుందురిలఁదాకూళంపు చిత్తంబుతోన్

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.

    అహమును వీడుచు సతతము
    సహనమ్మును జూపుచుండి జనముల
    యెడలన్
    ఇహలోక సుఖమ్ములకై
    మహిమలఁ జూపడట యోగి మన్ననకొఱకున్
    .

    రిప్లయితొలగించండి