28, జులై 2024, ఆదివారం

సమస్య - 4835

29-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇనుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు”
(లేదా...)
“ఇనుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధానంలో నేనిచ్చిన సమస్య)

18 కామెంట్‌లు:

  1. నాలుగేండ్లునేలెనాయకుండాతఁడు
    ముదిమిమీదబడగమూలకొదిగె
    కోరియువకునతడుకూర్చెగాపెద్దగా
    ఇనుడురవికిపేరిడెనుదినేశుడనుచు
    ఇనుడు-అస్తమించుచున్నసూర్యుడు

    రిప్లయితొలగించండి
  2. పనిగొనిపాలకుండుగనుభారముమోసెప్రజాదరంబుతో
    తనువదివాడిపోవగనుధైర్యమువీడుచుదేశభక్తుడై
    అనయమువీరుశిష్యుగనియంసముపైపెనుభారముంచుచున్
    ఇనుడుదినాధినాథునకునిచ్చెసహస్రకరాభిధానమున్

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    వేడ్క సృష్టించి పరమాత్మ విశ్వమెల్ల
    సూర్యచంద్రులకు విధుల జూపుకతన
    విధుని రేరాజుగానెంచి పిలిచి, జగతి
    కినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁడనుచు

    చంపకమాల
    మునులు తపమ్మునన్ దెలిసి పొల్పుగ సృష్టిరహస్యముల్ దగన్
    వినుతి గడించి పేర్చిరట వేదములెల్లను, వారిభాష్యమై
    దనరఁగ చంద్రునిన్ నిశల ధారుణిఁ గావుమటంచు సృష్టికే
    యినుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్!

    (ఇనుఁడు = మగఁడు,భర్త)

    రిప్లయితొలగించండి
  4. భువన విజయము నందున బుధుల తోడ
    సాహితీ చర్చల జరుపు సమయమందు
    ప్రాగ్దిశనుదయించెడి వాడి వర్ణనమున
    నినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు.


    పెనకువ జేయు వేళ కర వీరకమున్ ధరియించు రాయలే
    ఘనులగు పండితుల్ పొగుడు కాయిత గాడని చెప్పె దూరద
    ర్శనుడొక డిట్టులన్ సభను సాహితి చర్చల పాళమందు నా
    యినుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్.

    (ఇనుడు= రాజు)

    రిప్లయితొలగించండి
  5. ఆకసమునందు తారకలబ్జుని గని
    యినుడు నీకు శ త్రువగుట నెరుగుదుమన,
    యిరులు దొలగించు కలువల హితుడు రాత్రి
    యినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు

    రిప్లయితొలగించండి
  6. తే॥ సూర్యుఁడే లేని దినమున శూన్యమగును
    భువియటంచుఁ గనిన రాజు సవినయముగ
    శుభకరుఁడు దినకరుఁడని సభయె పొగడ
    నినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁడనుచు

    చం॥ మనుఁగడ శూన్యమై చనద మాన్యుఁడు సూర్యుఁడు లేకఁ బోయినన్
    వినుఁడని రాజు తెల్పఁగను విజ్ఞతతో వివరించి యంబుజా
    ప్తుని ఘనతన్ జనాళియును మోదముఁ గాంచఁగ సంత సంబుతో
    నినుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్

    ఇనుఁడు రాజు అండి

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    పగలు రాత్రి యటంచును ప్రజల కొఱకు
    దినము విభజించి యాజగదీశ్వరుండు
    చల్లనౌ వెన్నెలలుఁగాయు శశియె రేయి
    కినుడు,రవికిఁబేరిడెను దినేశుఁడనుచు.

    రిప్లయితొలగించండి
  8. ఘనముగ పుట్టెనో యదితి గర్భమునందున తేజరిల్లగన్
    కనగ కనంగ సంతసము కశ్యప మానసమందుఁబుట్ట నం
    దననుని బాలసారె తఱి తండులమందున వ్రాసెగాదె వా
    యి నుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్!!

    వాయి నుడు = నోటి మాట
    కశ్యపుడు ఏ పేరునైతే తన నోటి మాటగా చుట్టాలకు తెలియజేసాడో, అదే పేరును బియ్యం మీద వ్రాసి నామకరణం చేశాడు.

    రిప్లయితొలగించండి
  9. ఉదయపు సమయాన కొమరుడుద్భవించ
    జీవితమున వెలుగు నింపు సెకవెలుగని
    తనకు పుట్టిన వానికి తగినదనుచు
    యినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు

    [ఇనుఁడు = భర్త; రవి = జీవుడు]

    వినయముతోడ సత్కవుల ప్రేమనుపొందెను కృష్ణరాయలే
    ఘనతర పండితోత్తముల కాతడు నిల్చెను వెన్నుదన్నుగా
    మునుకొని సాహితీ సభను ముచ్చట లాడెడు వేళలోన నా
    యినుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్

    [ఇనుఁడు = రాజు]

    రిప్లయితొలగించండి
  10. పగటివేలుపు పద్మినీవల్లభుండు
    కాలచక్రుడు నుదరథి కలువగొంగ
    యనుచు, పండితాకాశమునందు మెరయు
    నినుఁడు, రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు

    రిప్లయితొలగించండి
  11. వంశ పావనుండు మనువు వఱల నెడఁదఁ
    దద్ద గౌరవమ్ము తనదు తండ్రి వలన
    దినము లలరు చుండ వెలుఁగుల నిలఁ బుడమి
    యినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు
    [ఇనుఁడు = రాజు]


    కనులకు విం దొసంగ నిసి కాంతుఁడు చంద్రుఁడు చల్ల చల్లగా
    ననయము శీత లాంశునిగ నందఱి మన్నన లందె ధాత్రిలోఁ
    బెనుపున మానవోత్కరము వే కిరణమ్ముల వెల్గు చుండఁగా
    నినుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రక రాభిధానమున్

    రిప్లయితొలగించండి
  12. భానుకున్నట్టి పర్యాయ పదము లెన్ని
    యనుచు ప్రశ్నింప బాలుండనెనియె నిటుల
    నినుడు రవికి పేరిడెను దినే శుడనుచు
    నొసగె ను జవాబు న య్యె డ ను త్సు కత తొ

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:సతతమును సూర్యు జపియించు నతని నామ
    మినుఁడు, రవికిఁ బేరిడెను, దినేశుఁ డనుచు”
    నొక సుతునకు బేరిడె నిట్టు లున్న సుతుల
    కెల్ల సూర్యనామములనే యెన్నుకొనియె.
    (అతని పేరే ఇనుడు.రవికి పేరిడెను అంటే రవికి ఆ పేరు ఆయన పెట్టాడు.ఇంకో కొడుక్కి దినేష్ అని పేరు పెట్టాడు.)

    రిప్లయితొలగించండి
  14. చం:చనె నినశర్మ ముచ్చటగ సల్ప వధానము ప్రాశ్నికుం డొసం
    గిన యొక వర్ణనన్ గొని తెగించి వచించె దినాధినాథుడన్
    ఘనమగు శబ్దమే యతికి కాగ సమస్య రయాన మార్పుకై
    ఇనుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్”
    (ఇన శర్మ అవధానం లో దినాధినాధుడు అనే పదం వెయ్యబోతే యతి భంగ మైంది.దినాధినాథుడికి సహస్రకరుడు అనే బిరుదుని ఇచ్చి అవధానం లో ఒడ్డున పడ్డాడు.)

    రిప్లయితొలగించండి
  15. అనయముపంచుచున్ వెలుగు నందరి కీజగమందు మర్వ కన్
    గనగనె వింతగానచటకంజము లెల్లయు హర్షమొందుచున్
    మనమదిపొంగగాధరణిమానుగమెచ్చుచుసంతసమ్ముతో
    *“ఇనుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్ర కరాభిధానమున్”*


    వేవెలుగుల దొరగ తాను వెలుగు పంచ
    మురిసి పోవుచు ప్రేమతో పుడమి తల్లి
    “ఇనుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు”*
    సూర్యభగవానున కఖిల సురలు మెచ్చ

    రిప్లయితొలగించండి
  16. సూర్య చంద్రుల విధులను జూపు కతన
    కాల గమనము సూచించె కాలుఁడంత
    నామ జపమును జేసెను నాక విభుఁడె
    యినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు”

    రిప్లయితొలగించండి
  17. దినమణి యంబుజాప్తుఁడగు తిగ్మకరున్ ప్రణుతించు సత్కవీం
    ద్రుని కవనంబునందు పలురూపుల వర్ణనఁజేసె నందు సూ
    ర్యుని జలతస్కరుండనుచు నుష్ణునిగా కవిరిక్కదారిలో
    నినుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్

    రిప్లయితొలగించండి