తే.గీ:శాస్త్రి కిద్దరు తనయులు చదువు,సంధ్య చక్కగా నేర్చి యొక్కడు శాస్త్రి మించు వేదవిదుఁడయ్యె, నొక్కఁడు విద్య విడచి” భోక్త గా కర్మలకు తిన బోవు చుండె. (బ్రాహ్మణులలో కొందరు వేదపండితు లౌతుంటారు.అంత చురుకుదనం లేని వాళ్లు విద్య పట్టు బడక ఏ ఆబ్దికాల లోనో భోక్తలు గా మాత్రమే వెడుతుంటారు.)
ఉ:పద్యము లెన్నొ వ్రాసి తన పాండితి జూపియు, శ్లోకకల్పనా విద్యను నేర్చి, సంస్కృత కవిత్వము వ్రాసియు,చాల దంచు నా విద్యను వీడి యొక్కరుడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్ విద్యల లోన నుత్తమము వేద విచారణ మంచు బ్రీతి తోన్.
(సమస్యని నాలుగవ పాదం గా పూరించ వచ్చు కానీ దానిలో "ఇద్ధరన్" అనేది పూరణ పదమే కానీ ప్రయోజనవంతం గా తోచ లేదు.కనుక "ఇద్ధరన్ విద్యలలోన నుత్తమము వేదవిచారణ"అంటూ పోడిగించాను.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిదైత్యుఁడు హిరణ్య కశిపుని దైవమనుచు
నతని గూర్చినదే 'విద్య' యనిన గురులు
చదువులందున మర్మాన శౌరి నెఱిగి
వేదవిదుఁడయ్యె నొక్కఁడు 'విద్య' విడిచి
ఉత్పలమాల
వేద్యుని దైత్యునిన్ దెలుపు విద్యయె విద్యగఁ జెప్పి యొజ్జలున్
సద్యశమంద నేర్వుమన శౌరి తపంబున బాలభక్తుఁడై
యధ్యయనంబునన్ జదువులందున మర్మమెఱింగి దుష్టమౌ
విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🌻ధన్యోస్మి గురుదేవా!🌻
తొలగించండిగురువు కడకేగి వేదముల్ కుదురుగాను
రిప్లయితొలగించండికష్టపడి నేర్చి యెల్లరు గౌరవింప
వేద విదుడయ్యె నొక్కడు, విద్య విడచి
యొకడు నిందల పాలాయె నోయి శిష్య.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభ్రాత లిరువురిని పఠించ బడికి పంప
రిప్లయితొలగించండివేదవిదుఁడయ్యె నొక్కఁడు ; విద్య విడిచి
వణిజుడయ్యె మరియొకడు పట్టణమున
సంఘ మునకెల్ల దోడ్పడ సాగిరటుల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసద్యశమందెపామరుడుతారకమంత్రముదారిజూపగా
రిప్లయితొలగించండివేద్యమునయ్యెపారమునువెఱ్ఱికి, యోగరహస్యమందెగా
పద్యముపంజరంబునటభాసమునయ్యెగరాముగాథయే
విద్యనువీజియొక్కరుడువేదవిశారదుడయ్యెనిద్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే॥ విద్య నేర్వఁగ స్తోమత విత్తమతఁడు
రిప్లయితొలగించండిపడయకున్న సజ్జనులను విడువడాయె
ప్రవచనముల సభల విన్న పాటవమున
వేదవిదుఁడయ్యె నొక్కఁడు విద్య విడిచి
ఉ॥ విద్యను బొంద నాతురత విత్తపు భాగ్యము శూన్యమై చనన్
హృద్యముగాను సజ్జనుల హెచ్చుగఁ గొల్చుచు వేదవాక్కులన్
సద్యము గ్రాహ్యమొందుచును సంస్మరణమ్మును జేసి తాల్చుచున్
విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిచదువులేకనువాల్మీకిజడుడుగాగ
రిప్లయితొలగించండిమౌనినారదుడిచ్చెగామంచివరము
తక్షణంబునవెఱ్ఱికిదారితెలిసె
వేదవిదుడయ్యెనొక్కడువిద్యవిడిచి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్వాభిమానమున్ నేర్పని చదువు లైన
పాఠశాల చదువులింక వలదటంచు
పాటవము గలిగిన ఘనాపాఠి జేరి
వేదవిదుఁడయ్యె నొక్కఁడు, విద్య విడిచి
వైద్యుడ గాను నేననుచు బాలుడు కచ్ఛిత నిర్ణయమ్ముతో
వేద్యులు చెప్పినన్ వినక విజ్ఞత జూపుచు మేటి యైన వే
దాధ్యయనమ్ము జేసిన బుధానుని జేరుచు నేటి మ్లేచ్ఛమౌ
విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికాళి కా దేవి వరమున కవిగ మారి
రిప్లయితొలగించండివేద విదు డయ్యె నొక్కడు విద్య విడిచి యాతడే వికట కవి గ నవని యందు
పేరు ప్రఖ్యా తి నొందె గా పేర్మి. మీర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిద్యలు నేర్వ వేద్యుఁడగు విజ్ఞుని సంశ్రయమందు ఛాత్రుడై
రిప్లయితొలగించండిసద్యశమొందె విద్యలను సర్వము నేరిచి, దీక్షతోడ తా
నధ్యయనంబొనర్చు సమయమ్మున ఘాతము గూర్చునట్టిదౌ
విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅద్యతనీయ విశ్వభర నాస్తికవాదవిమర్దనార్తితోన్,
రిప్లయితొలగించండివేద్యుల చెంత నాత్మగత వేదననన్ వివరించి, పొంది శ్రీ
మద్యతిరాజ దీవనలు , మాయ "మెకాలె" విధించినట్టిదౌ
విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిముక్తి నార్జింప వేదమె యుక్తమనుచు
రిప్లయితొలగించండిసభ్యుడై గురుకులమున నభ్యసించి
వేద విదుఁడయ్యె నొక్కఁడు; విద్య విడిచి
తిరుగు పామరులఁ బిలిచి తీర్చి దిద్దె
విద్యయె సంస్కరించి తగు విజ్ఞత నేర్పును భూతలంబునన్
వేద్యము వేదవిద్యయని ప్రేరణనీయని వెల్ల వ్యర్థమే
హృద్యము కానివిద్యలని గృహ్యము కావని వ్యర్థమైనదౌ
విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపద్యము పాడరాక కడు పాటుల
రిప్లయితొలగించండినొందియు చిట్ట చివరకున్
సాధ్యము గాదు నాకనచు చయ్యన
జేరెను సేద్య వృత్తిలో
విద్యను వీడి యొక్కరుడు, వేదవి
శారదుడయ్యె నిద్ధరన్
పద్యపు విద్య నేర్చొకడు పండిత
శ్రేష్ఠులు గౌరవింపగా
వేదవేదాంగములునేర్చి మోదమలర
రిప్లయితొలగించండివేదవిదుఁడయ్యె నొక్కఁడు, విద్య విడిచి
దుష్టసంగాతమునజేరి భ్రష్టుడయ్యె
పెద్దలను లెక్క చేయక వేఱొకండు
హరి కటాక్ష మున్న నసాధ్య మరయఁ గలమె
రిప్లయితొలగించండిగాన గంధర్వుఁ డయ్యె నొకండు వింత
నాట్య కోవిదుఁ డయ్యె ఘనముగ నొకఁడు
వేద విదుఁ డయ్యె నొక్కఁడు విద్య విడిచి
విద్య లనంగ బ్రహ్మమును వేద్యము నింపుగ నేర్పు నట్టివౌ
చోద్యము నేఁడు గాన మిలఁ జొప్పడ లౌకిక విద్య లెందుఁ దా
నాద్యుఁడు శంకరాఖ్య ముని యబ్జజ సన్నిభుఁ డద్భుతమ్ముగా
విద్యను వీడి యొక్కరుఁడు వేద విశారదుఁ డయ్యె నిద్ధరన్
తే.గీ:శాస్త్రి కిద్దరు తనయులు చదువు,సంధ్య
రిప్లయితొలగించండిచక్కగా నేర్చి యొక్కడు శాస్త్రి మించు
వేదవిదుఁడయ్యె, నొక్కఁడు విద్య విడచి”
భోక్త గా కర్మలకు తిన బోవు చుండె.
(బ్రాహ్మణులలో కొందరు వేదపండితు లౌతుంటారు.అంత చురుకుదనం లేని వాళ్లు విద్య పట్టు బడక ఏ ఆబ్దికాల లోనో భోక్తలు గా మాత్రమే వెడుతుంటారు.)
ఉ:పద్యము లెన్నొ వ్రాసి తన పాండితి జూపియు, శ్లోకకల్పనా
రిప్లయితొలగించండివిద్యను నేర్చి, సంస్కృత కవిత్వము వ్రాసియు,చాల దంచు నా
విద్యను వీడి యొక్కరుడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్
విద్యల లోన నుత్తమము వేద విచారణ మంచు బ్రీతి తోన్.
(సమస్యని నాలుగవ పాదం గా పూరించ వచ్చు కానీ దానిలో "ఇద్ధరన్" అనేది పూరణ పదమే కానీ ప్రయోజనవంతం గా తోచ లేదు.కనుక "ఇద్ధరన్ విద్యలలోన నుత్తమము వేదవిచారణ"అంటూ పోడిగించాను.)
రిప్లయితొలగించండిశాస్ర్ర విఙ్ఞాన మంతయుఁ జక్క నేర్చి
రిప్లయితొలగించండివేదవిదుఁడయ్యె నొక్కఁడు, విద్య విడిచి
పిచ్చి వానిగఁదిరుగుచు వీధి వీధి
భ్రష్టుఁడయ్యెను బదిమంది భంగ పఱుప
విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్
రిప్లయితొలగించండివిద్యనువీడువాడగును భిక్షకు మాదిరి యాలయంబునన్ ?
మద్యముఁద్రాగువానివలె మాటలు దూఱుట భావ్యమే ? కనన్
విద్యను నేర్వగావలెను విద్యయె మూలధనంబు జీవికిన్
సద్గురువుల దరి చదివి చక్కగాను
రిప్లయితొలగించండి*“వేదవిదుఁడయ్యె నొక్కఁడు, విద్య విడిచి”*
దుష్టులసహవాసముచేతదూరమయ్యె
సంప్రదాయములకు మరి సంస్కృతికిని
అధ్యయనంబుచేసెదనటంచునుపట్నముచేరినేర్చెస
ద్విద్యలనెల్లయున్నచట వేగమె పండితుడౌచువేదముల్
హృద్యముగాపఠించుచునుహెచ్చు ప్రశంసలనంది దుష్ట మౌ
*“విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
వేద శాస్త్రముల్ నేరిచి విబుధుల కడ
వేదవిదుడయ్యె నొక్కడు; విద్య విడిచి
రాజకీయము నందున రాటు దేలి
యయ్యె నొక్కడు చిన్న నాయకునిగాను.