18-7-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్”
(లేదా...)
“దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
చేవనుగ్రాహకుండుగనుచేరియుహంసవిశేషశ్రద్ధతోదేవునిజూపుమాయనుచుతీరుగప్రశ్ననరేంద్రుడేయగాభావితరంబునేగనుచుబాధ్యతజేసెగురుండుబోధనేదేవుడులేడటంచుకడుదీక్షనొనర్తురుతీర్థయాత్రలన్
కావగనచ్చునువాడనుభావననుండెడిప్రజలకుపంచునుప్రేమన్చేవనుజూపునుజడులకుదేవుడు, లేడనుజనులకుతీర్థాటనమున్
నీవృత మందున పలువురిజీవన నరళిని కనుగొను చిత్తము తోడన్ భావనలో తప్ప నెచటదేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్.నీవృతమందు సంస్కృతులనేకము వాటి నెరుంగ నెంచుచున్ పావనమైన క్షేత్రముల వాసిగ గాంచుటకై కదా జనుల్ కోవెల లోనకాదు మన గుండెన కాక మరెక్క డన్ గనన్ దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్.
కందంసేవింప మఠములందునదేవుళ్లసమానమంచుఁ దీరఁగ వెదుకన్జూవె! ద్రిమూర్తుల మించెడుదేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్ఉత్పలమాలసేవలు సేయఁగన్ జనులు సిందులు వైచి మఠమ్ములందునన్దైవసమానులన్ బగిది తన్మయమందుచు మ్రొక్క స్వాములన్గావక దోచువారలని, కాన త్రిమూర్తులమించి వారిలోదేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్!
కావుము మమ్ముల నను చును పావన మగు భక్తి గల్గి భజి యింతురు నా దేవుని నమ్ముచ దె ట్టు ల దేవుడు లేడ ను జను ల కె తీ ర్థా టన ముల్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ రావణుఁ డెప్పుడు రామునిభావన విడువక చరించు పగిదిని భువిలోదేవుని యునికిని నమ్మకదేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్ఉ॥ రావణుఁ డెల్ల వేళలను రాముని చింతన వీడెనా భువిన్భావన యందు రాక్షసులు వాలెము దల్చరె పద్మనాభునేయీ విధి నేఁడు కల్లరులు నీశ్వరుఁ డేడని ప్రశ్నవేయుచున్దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
కందం:భావనలో నాస్తికులుగదేవుఁడు లేడనుచుఁ బలికి దెప్పరములలోనావశ్యకమనిపించునుదేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్ఉత్పలమాల:భావన యందు నాస్తికులు వాదనఁ జేయుదురెల్ల వేళలన్దైవము లేడటంచు గడు ద్రాపులు మీరలటంచు భక్తులన్జీవితమందు దెప్పరము జేపడ నంకిలిఁబాపు కోర్కితోదేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
దేవళమున కేగుమనినదేవుని నమ్మననుచుండు దేహుల బ్రదిమిన్చావు దరి జేరి నంతనెదేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
జీవించి చూపి పావనజీవన మార్గము మనకిడె శ్రీరాముండేకావున రాముని మించినదేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్పావన మూర్తి దాశరథి భాసిలు భక్తుల గుండెలందునన్దేవుడు రాముడే యనుచు తెల్పుచు నుందురు నెల్లవేళలన్జీవన మార్గదర్శియగు శ్రీరఘురాముని కన్నమిన్నయౌదేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
కావలెఁ దార్కాణమ్ములు దేవుని యునికికి నటంచుఁ దెల్పుఁ డనంగన్ దేవుని మహిమం దెలుపఁగ దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్ వేవురు భక్తి రక్తులను విన్నపముల్ గడుఁ జేయుచుండి స్వీ యావన కార్య కాంక్షు లయి యంచిత రీతిని శుద్ద చిత్తులై యే విధిఁ గొల్చినం దమిని నించుక యేఁ గరుణా విహీనుఁడౌ దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
భావము నందున నమ్మినదేవుడు శ్రీరాము దప్ప దేవుండ్లెవరున్బ్రోవరని నమ్మి వేరేదేవుఁడు లేఁడను, జనులకె తీర్థాటనముల్
కం:దేవుని నమ్మిన వారలుదేవుని కై యేగ వలయు తీర్థమ్ముల, కాభావన విడ లోకము గన దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్?(భక్తి లేకండా ఊరికే లోకము చూసి రావటానికి తీర్థయాత్ర లెందుకు?)
ఉ:దేవుని నమ్మ నంచు , పలు తిట్టులు నన్నును తిట్టుచుండు, కానీ వరలక్ష్మి నోములన "నీ ముఖమంచు" ధనమ్ము నిచ్చు , నే దేవుని యాత్రకున్ బయలు దేరగ నా పతి నాదు దృప్తి కై"దేవుఁడు లేఁ"డటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్”(కొందరు భర్తలకి దైవవిశ్వాసం తక్కువే ఐనా,సంప్రదాయం పై గౌరవం లేకున్నా భార్యలు తృప్తి కోసం సహకరిస్తుంటారు.)
దేవుని దూషణ చేయుచు*“దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్”*కావలసివచ్చెవిధిగాజీవితమునదెబ్బతగుల చెప్పగవిబుధుల్ోవెలముంగిటన్నిలిచిగొప్పగవాదనచేయుచుందురేజీవులుకొందరీజగతిచేయుచుమొండిగవాదనమ్ములన్*“దేవుఁడు లేఁడటంచుఁ ,గడు దీక్ష నొనర్తురు తీర్థ యాత్రలన్”*భావమునందుభక్తినటభద్రముచేయుచు మ్రొక్కు దీర్చగన్
కోవెల లోన నర్చనల గోరిక లన్నియు తీర సాధ్యమా? కేవల మొక్క రాయియని కేశవు హేళనజేసి నిత్యమున్ సేవలు చేయు భార్యలలి జెంతకు జేర నటించు కూళులే దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్!
దేవుఁడు లేడను వారలె యవిరళమగు భక్తికలిగి యర్చింతురుగా కావలెననినిట్లందురుదేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
దేవుని స్థానముందెలిసి దేవుఁడు లేడని బల్కు చుండియున్ దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్ దేవునిఁబేరయాత్రలను దీవ్రతరంబు ఁజేయుటన్ దేవునిపైననమ్మకము దీటుగ నున్నటు భావమేకదా!
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. దేవుని కొలుచుట కన్ననుదేవళమున శిల్పకళను తిలకించెడు సద్భావనలో మనసు నిలిపిదేవుడు లేడను జనులకె తీర్థాటనముల్.
చేవనుగ్రాహకుండుగనుచేరియుహంసవిశేషశ్రద్ధతో
రిప్లయితొలగించండిదేవునిజూపుమాయనుచుతీరుగప్రశ్ననరేంద్రుడేయగా
భావితరంబునేగనుచుబాధ్యతజేసెగురుండుబోధనే
దేవుడులేడటంచుకడుదీక్షనొనర్తురుతీర్థయాత్రలన్
కావగనచ్చునువాడను
రిప్లయితొలగించండిభావననుండెడిప్రజలకుపంచునుప్రేమన్
చేవనుజూపునుజడులకు
దేవుడు, లేడనుజనులకుతీర్థాటనమున్
రిప్లయితొలగించండినీవృత మందున పలువురి
జీవన నరళిని కనుగొను చిత్తము తోడన్
భావనలో తప్ప నెచట
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్.
నీవృతమందు సంస్కృతులనేకము వాటి నెరుంగ నెంచుచున్
పావనమైన క్షేత్రముల వాసిగ గాంచుటకై కదా జనుల్
కోవెల లోనకాదు మన గుండెన కాక మరెక్క డన్ గనన్
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్.
కందం
రిప్లయితొలగించండిసేవింప మఠములందున
దేవుళ్లసమానమంచుఁ దీరఁగ వెదుకన్
జూవె! ద్రిమూర్తుల మించెడు
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
ఉత్పలమాల
సేవలు సేయఁగన్ జనులు సిందులు వైచి మఠమ్ములందునన్
దైవసమానులన్ బగిది తన్మయమందుచు మ్రొక్క స్వాములన్
గావక దోచువారలని, కాన త్రిమూర్తులమించి వారిలో
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్!
కావుము మమ్ముల నను చును
రిప్లయితొలగించండిపావన మగు భక్తి గల్గి భజి యింతురు నా
దేవుని నమ్ముచ దె ట్టు ల
దేవుడు లేడ ను జను ల కె తీ ర్థా టన ముల్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ రావణుఁ డెప్పుడు రాముని
తొలగించండిభావన విడువక చరించు పగిదిని భువిలో
దేవుని యునికిని నమ్మక
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
ఉ॥ రావణుఁ డెల్ల వేళలను రాముని చింతన వీడెనా భువిన్
భావన యందు రాక్షసులు వాలెము దల్చరె పద్మనాభునే
యీ విధి నేఁడు కల్లరులు నీశ్వరుఁ డేడని ప్రశ్నవేయుచున్
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
కందం:
రిప్లయితొలగించండిభావనలో నాస్తికులుగ
దేవుఁడు లేడనుచుఁ బలికి దెప్పరములలో
నావశ్యకమనిపించును
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
ఉత్పలమాల:
భావన యందు నాస్తికులు వాదనఁ జేయుదురెల్ల వేళలన్
దైవము లేడటంచు గడు ద్రాపులు మీరలటంచు భక్తులన్
జీవితమందు దెప్పరము జేపడ నంకిలిఁబాపు కోర్కితో
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
దేవళమున కేగుమనిన
రిప్లయితొలగించండిదేవుని నమ్మననుచుండు దేహుల బ్రదిమిన్
చావు దరి జేరి నంతనె
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
జీవించి చూపి పావన
రిప్లయితొలగించండిజీవన మార్గము మనకిడె శ్రీరాముండే
కావున రాముని మించిన
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
పావన మూర్తి దాశరథి భాసిలు భక్తుల గుండెలందునన్
దేవుడు రాముడే యనుచు తెల్పుచు నుందురు నెల్లవేళలన్
జీవన మార్గదర్శియగు శ్రీరఘురాముని కన్నమిన్నయౌ
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
కావలెఁ దార్కాణమ్ములు
రిప్లయితొలగించండిదేవుని యునికికి నటంచుఁ దెల్పుఁ డనంగన్
దేవుని మహిమం దెలుపఁగ
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
వేవురు భక్తి రక్తులను విన్నపముల్ గడుఁ జేయుచుండి స్వీ
యావన కార్య కాంక్షు లయి యంచిత రీతిని శుద్ద చిత్తులై
యే విధిఁ గొల్చినం దమిని నించుక యేఁ గరుణా విహీనుఁడౌ
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
భావము నందున నమ్మిన
రిప్లయితొలగించండిదేవుడు శ్రీరాము దప్ప దేవుండ్లెవరున్
బ్రోవరని నమ్మి వేరే
దేవుఁడు లేఁడను, జనులకె తీర్థాటనముల్
కం:దేవుని నమ్మిన వారలు
రిప్లయితొలగించండిదేవుని కై యేగ వలయు తీర్థమ్ముల, కా
భావన విడ లోకము గన
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్?
(భక్తి లేకండా ఊరికే లోకము చూసి రావటానికి తీర్థయాత్ర లెందుకు?)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:దేవుని నమ్మ నంచు , పలు తిట్టులు నన్నును తిట్టుచుండు, కా
రిప్లయితొలగించండినీ వరలక్ష్మి నోములన "నీ ముఖమంచు" ధనమ్ము నిచ్చు , నే
దేవుని యాత్రకున్ బయలు దేరగ నా పతి నాదు దృప్తి కై
"దేవుఁడు లేఁ"డటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్”
(కొందరు భర్తలకి దైవవిశ్వాసం తక్కువే ఐనా,సంప్రదాయం పై గౌరవం లేకున్నా భార్యలు తృప్తి కోసం సహకరిస్తుంటారు.)
దేవుని దూషణ చేయుచు
రిప్లయితొలగించండి*“దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్”*
కావలసివచ్చెవిధిగా
జీవితమునదెబ్బతగుల చెప్పగవిబుధుల్
ోవెలముంగిటన్నిలిచిగొప్పగవాదనచేయుచుందురే
జీవులుకొందరీజగతిచేయుచుమొండిగవాదనమ్ములన్
*“దేవుఁడు లేఁడటంచుఁ ,గడు దీక్ష నొనర్తురు తీర్థ యాత్రలన్”*
భావమునందుభక్తినటభద్రముచేయుచు మ్రొక్కు దీర్చగన్
కోవెల లోన నర్చనల గోరిక లన్నియు తీర సాధ్యమా?
రిప్లయితొలగించండికేవల మొక్క రాయియని కేశవు హేళనజేసి నిత్యమున్
సేవలు చేయు భార్యలలి జెంతకు జేర నటించు కూళులే
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్!
దేవుఁడు లేడను వారలె
రిప్లయితొలగించండియవిరళమగు భక్తికలిగి యర్చింతురుగా
కావలెననినిట్లందురు
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్
దేవుని స్థానముందెలిసి దేవుఁడు లేడని బల్కు చుండియున్
రిప్లయితొలగించండిదేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
దేవునిఁబేరయాత్రలను దీవ్రతరంబు ఁజేయుటన్
దేవునిపైననమ్మకము దీటుగ నున్నటు భావమేకదా!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
దేవుని కొలుచుట కన్నను
దేవళమున శిల్పకళను తిలకించెడు స
ద్భావనలో మనసు నిలిపి
దేవుడు లేడను జనులకె తీర్థాటనముల్.