27, జులై 2024, శనివారం

సమస్య - 4834

28-7-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్మభవుని సతి యపర్ణ యంద్రు”
(లేదా...)
“పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

31 కామెంట్‌లు:

  1. వాక్కుపరిమళింప భావము తోడుగా
    వాణియౌనుగాదెవందితముగ
    నేటికవులుమెచ్చనిండైన పాండితి
    పద్మభవునిసతియపర్ణయండ్రు

    రిప్లయితొలగించండి
  2. పలుకులచెలి యైన వాణియే వేలుపు
    పద్మభవుని సతి ; యపర్ణ యంద్రు
    మూడు కనుల వాని ముద్ధుల భార్యను
    అరయు మయ్య యెవరి యాలు యెవరొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భార్యను అరయు..' అని విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
  3. పద్మహారముభావజాలమువారిజాక్షికపర్ణకున్
    పద్మసౌరభమెంచిజూడగపద్యపాదములందునన్
    పద్మమందముగంగశోభిలభవ్యమౌపదగుంభనన్
    పద్మసంభవుధర్మపత్నియపర్ణయందురుపండితుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పద్మమందముగంగ' ?

      తొలగించండి
    2. పద్మముల అందముతోగంగాప్రవాహముశోభిల్లగా
      అను అర్థము తో వ్రాసితిని

      తొలగించండి
    3. పద్మములవంటిపదములగుంభనతో

      తొలగించండి

  4. బదులు తెలుపుమమ్మ ప్రశ్నింతు నేనిప్డు
    చదువులమ్మ యెవరి సతియొ చెప్పు
    మీశ్వరునకు పత్ని నేమందు రన తెల్పె
    పద్మభవుని సతి , యపర్ణ యంద్రు.


    పద్మనాభుడు డెందమందున పద్మనే తను నిల్పగా
    పద్మలాంఛని బ్రహ్మకన్యక భారతాంబయె కాదుటే
    పద్మసంభవు ధర్మపత్ని , యపర్ణ యందురు పండితుల్ ,
    పద్మజా విను, ఫాలనేత్రుని భార్యయంచును పల్కిరే.

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    ఉదయమందులేచి మొదట కరమ్ముల
    పేర్మిఁ గన శుభమని వేడ్కనంద్రు
    మునులు, నగ్ర, మధ్య, మూలములవె లక్ష్మి,
    పద్మభవుని సతి, యపర్ణ యంద్రు

    మత్తకోకిల
    ఈద్మ ప్రాసను గూర్చినారయ! యెట్లుపూరణ జేతునో?
    పద్మమన్ కరమెంచి ప్రొద్దున భక్తిభావనఁ గాంచుమా!
    పద్మ! యగ్రము, మధ్య, మూలము భాగ్యమౌచును, లక్ష్మియున్
    పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్

    రిప్లయితొలగించండి
  6. ఆ.వె.॥
    చదువుల జవరాలు శారద కాదొకో
    పద్మభవుని సతి, యపర్ణ యంద్రు
    పరమ శివుని పత్ని గిరిజను, పద్మజ
    పద్మనాభుని సతి వరములిచ్చు

    మత్తకోకిల:
    పద్మనాభుఁడు శంకరుండును పద్మగర్భుడు దైవముల్
    పద్మనాభునిపత్ని యబ్ధిజ, పద్మలాంఛన వాణియే
    పద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్
    సద్మమే మసనమ్ము జేసిన సాంబమూర్తికి పత్నియే

    రిప్లయితొలగించండి
  7. ఆ॥ వాణి విద్యల నిజ రాణి వీణాపాణి
    పద్మభవుని సతి, యపర్ణ యంద్రు
    పరమ శివుని యర్ధ భాగిని శర్వాణి
    పద్మనాభుకగు యవరజ యంచు

    మత్త॥ పద్మ పుష్ప దళాయతాక్షి సువర్ణ రంజిత దేవియౌ
    పద్మలాంఛన సప్త పుస్తక పాణి పల్కుల రాణియే
    పద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్
    పద్మనాభుని చెల్లె లన్ననె ఫాలనేత్రుఁడు నొప్పఁగా

    రిప్లయితొలగించండి
  8. పలుకుముద్దరాలు పలుకు తొయ్యలియన
    పద్మభవుని సతి; యపర్ణ యంద్రు
    పరమశివుని భార్య పర్వత పుత్రిని
    పద్మనాభుని సతి పద్మవాస

    పద్మనేత్రులు ముగ్గురమ్మలు పట్టుగొమ్మలు చూడగా
    పద్మనాభుని భార్య పద్మిని, పద్మ లాంఛని వాణియే
    పద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్
    పద్మ బంధము లేని హంసుడు ఫాలనేత్రుని భార్యనే

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:బులు సపర్ణ పద్యములు, నవధానమ్ము
    బులకరింప జేయ బుధుల తనువు
    లామె మెచ్చి శారదాంబ తో బోల్చుచు
    పద్మభవుని సతి యపర్ణ యంద్రు”

    రిప్లయితొలగించండి
  10. మ.కో:పద్మరాగనిభమ్ము లౌ ఘన పద్యముల్ వెలయించె నే
    పద్మపంక్తిని శారదమ్మను భక్తి మీరగ గొల్చెనో
    "విద్మహే" యని యీ యపర్ణ ! కవిత్వ మందున బోల్చుచున్
    పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్”
    (పద్మరాగములు=రత్నములు.)

    రిప్లయితొలగించండి
  11. మ.కో:పద్మసంభవవంశజాతుని భార్య యై కడు భక్తి తో
    పద్మముల్ సమకూర్చి పూజకు వచ్చుచుండ నపర్ణ యా
    పద్మనేత్రిని గాంచి మెచ్చుచు వారి జంటను ప్రేమతో
    పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్”
    (పద్మసంభవవంశజాతుడు=ఒక బ్రాహ్మణుడు.ఇక్కడ అపర్ణ బులుసు అపర్ణ గారు కావచ్చు.కాక పోవచ్చు.ఎవరో అపర్ణ.)

    రిప్లయితొలగించండి
  12. క్రమాలాంకారం లో ---
    వాణి యెవరి సతి యొ వచియింపు మో స ఖా?
    శివుని పతిగ గోరి చేసె తపము
    పర్ణ భక్ష ణంబు పరి హరించి రె వ్వ రో?
    పద్మ భవుని సతి :: యపర్ణ యంద్రు

    రిప్లయితొలగించండి
  13. పద్మభవుని సతి యపర్ణ యంద్రునా బలుకుట
    భావ్య మగునె యార్య! వావివరుసఁ
    జూడ కుండఁబలుక చుట్టును బాపము
    పలుక వలయు నెపుడు పద్ధతిగను

    రిప్లయితొలగించండి
  14. ఆకులేని తినక యడవిలో నాచరిం
    పఁ దప మా యుమయె యపర్ణ యయ్యె
    దేవి తమ్ములమ్ము సేవింప కున్నచోఁ
    బద్మభవుని సతి యపర్ణ యంద్రు


    ఛద్మ మించుక లేదు కావఁగ శక్య లెల్లర ధాత్రినిన్
    సద్మ రాజము లందు నిల్చి విశాలనేత్రలు నిత్యముం
    బద్మనాభుని ధర్మ పత్నియు వాణి యెట్టులొ యట్టులే
    పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అందజేయు విద్య హంసవాహిని రాణి
    పద్మ భవుని సతి; యపర్ణ యంద్రు
    పార్వతిని,శివ సతి, పర్వతుని సుతను;
    పద్మనాభుని ప్రియ పత్ని లక్ష్మి.

    రిప్లయితొలగించండి
  16. సకల విద్య లొసగు శారదాంబ యనగ
    పద్మభవుని సతి,యపర్ణ యంద్రు
    నాకులును గొనకయె నాచ రించి తపము
    వనము నందు పడసె పతిగ శివుని.

    పద్మనాభుని కోరి తాను వివాహ మాడెను లక్ష్మియే
    పద్మమొక్కకరమ్మునందునబట్టినట్టి సనాతనే
    పద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్
    పద్మజాక్షునిచెల్లెలన్ననుఫాలనేత్రునిపత్నినే

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అందజేయు విద్య హంసవాహిని వాణి
    పద్మ భవుని సతి; యపర్ణ యంద్రు
    పార్వతిని,శివ సతి, పర్వతుని సుతను;
    పద్మనాభుని ప్రియ పత్ని లక్ష్మి.

    రిప్లయితొలగించండి