5-7-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”
(లేదా...)
“బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
కందంఅకటా! గరళము గొనుమనిప్రకటింపగ సతియె మేలు ప్రజలకటంచున్సుకరముగఁ గ్రోలె ననఁ ద్ర్యంబకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్! చంపకమాలసకల సురాసురుల్ సుధను సాగరమందున బొంద ద్రచ్చగన్వికలమునందగన్ జగము వెల్వడ క్ష్వేళము గౌరి యొప్పఁగన్సుకరమునన్ సదాశివుడె జుర్రెను లోకము లెల్లఁ గావఁ ద్ర్యంబకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
సకలముకాలమెంచుననిశాంతివహించుచుకన్నుమూయుచున్వికలముగానిమానసమువెంపరలాడకవిజ్ఞుడౌచునున్నకనకలాడుచున్జగతినాదనుభావనసేయకేమదిన్బకజపమాచరించుటయెప్రాప్తమొనర్చునుమోక్షమిద్ధరన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సకలము సర్వేశ్వరుఁడేవికలమొనర్చఁగనఘముల వేదనలనుతానొకడే దిక్కగును త్రియంబకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుకములజంపగవచ్చునుబకజపమొనరించి, ముక్తిబడయగవచ్చున్సకలముదైవాధీనమునికరముకాదనుతలపుననేరుపుతోడన్
నికరమునందు జనులతోతకరారు సలుపగ పెద్ద తగవున చిక్కన్చకితుడగుచు నేత యెదుటబకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
సకలము వీడియు నిత్యమ్మకలంకుని దేవ దేవు నారాదిస్తున్సుకరమ్ము గా జనము త్ర్యంబక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఆరాదిస్తున్' ?
సకలము దేవదేవుఁడగు శర్వుడు భక్త జనాళి రక్ష, తావికలమొనర్చు పాపముల వేదన దీర్చును వేఁడినంతనేసుకరము భక్తవర్యులకు సోమునిఁ గొల్చిన నార్తి దీరు ద్ర్యంబకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
కం॥ వికలముఁ గాని మదినిలిపిసకలము నీవని తలచుచు సద్భక్తిఁ గనన్బ్రకటితమగుఁ గాని యెటులబకజపము లొనర్చి ముక్తిఁ బడయఁగ వచ్చున్చం॥ వికలముఁ గాని మానసముఁ బ్రీతియు నమ్మిక భక్తి తోడుగాసకలము నీవటంచు భువి సజ్జనుఁడై పచరించఁ దక్కుఁ గాని కపటమాశ్రయించి చన నిత్యము ప్రాప్త మొసంగునే యెటుల్బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
శ్రీ కంది శంకరయ్య గారు తిద్దిన పిదప చం॥ 2వపాదము పచరించ పిదప అనవసరంగా ఉంచిన అరసున్న తొలిగించానండి
సకలము నెరిగిన వారలుఅకలంకమనస్కులగుచుననవరతంబున్ సుకరంబగువిధమున త్ర్యం*“బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”*సకలురడెందెమందుగనశాశ్వత స్థానమునందినట్టి త్ర్యం *“బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”*నికపసలేనిపూజలవియేలవిచారమెనర్చుచున్సదావికలతనొందకుండగనువేడుకతోడనుకొల్వుమీశునిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సుకములవి శాశ్వతములే?యకములకవి మూలమనుచు నందురు కదరా!యికనైనను తప్పక త్ర్యంబక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్. సకల గుణాభిరాముడగు సంతుకు నాయువు తీరుచుండగావికలిత మైన చిత్తమున వేదన తోడ మృకండు డిట్లనెన్ త్రికరణ శుద్ధిగా నిపుడు రేదొర భూషణు డైన యట్టి త్ర్యంబక జప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్.
సుకరము జీవన మెప్పుడుసకల భవిష్యములమరును సద్భక్తులకేవికసిత హృదయముతో త్ర్యంబకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
సుకరము గాదెజీవనము చూపగఁ లక్ష్యము భక్తిమార్గమేసకలము ప్రాప్తమౌను సుఖసౌఖ్యములందును సర్వవేళలన్ముకుళిత హస్తులై జనులు ముక్తిని కోరుచు భక్తితోడ త్ర్యంబకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
ధన్యవాదాలు గురూజీ 🙏
వికసిత చిత్తము గల్గియు సకలా ర్థ పు సాక్షి యైన సర్వే శ్వ రు న య్య క లంకుని మది లో త్ర్య o బక జపము లొనర్చి ముక్తి బడయగ వచ్చు న్
ప్రకటిత భక్తిం ద్రిపురాంతకార్పితస్వీయ బుద్ధి తనరగ సతమున్ వికల మనమ్మున ఫాలాంబక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్ సుకరము లౌను గార్యములు చొప్పడు నెల్ల లసన్మనో రథప్రకరము లంచితమ్ముగను ఫాలత లాక్షునిఁ గొల్వ భక్తినిన్ సకల నరోత్కరమ్మునకు సన్నుత ధర్మము చిత్త శుద్ధిఁ ద్ర్యం బక జప మాచరించుటయె ప్రాప్త మొనర్చును మోక్ష మిద్ధరన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
కం:ఒక పరి చెర లో బడినా,విక నాపుము పోరు బాట, యేదో ఆధ్యాత్మికత నటించుచు బుద్ధిగబకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”(జైల్ లో పడ్డావు కదా!ఇంకా పోరాటాలు దేనికి?కాస్త ఆధ్యాత్మికత చూపి ఏదో కొంగ జపం చేస్తే మంచితనం మీద జైల్ నుంచి ముక్తి దొరక వచ్చు.)
చం:సకలవిధాల వైద్యములు సాగుచు నున్నవి,తృప్తి జెంది నీవిక పరమాత్ము దల్చుకొనవే! త్యజియించు భయమ్ములన్,గణింపకు మిక దేహబాధలను, భక్తి వహించుచు శ్రద్ధతో త్రయంబకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”(త్రయంబక మంత్రం అనే ఒక మంత్రం ఉంది.అది మోక్షసాధన మంత్రం.ఆరోగ్యానికి కూడా దాన్ని పఠిస్తారు.)
సకలము నీవే యంచును నకలంకపు మనము తోడ ననవరతంబున్ముకుళిత వదనమున ద్ర్యం బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
ముకుళిత భావముంగలిగి మోదమునొందుచునెల్లవేళలన్ వికలపు చింత లేకమదిభీకర మౌశపధంబుఁజేసియేసకలముఁదానెయంచునిక సార్ర్థతకల్గిన మోము తోడఁద్ర్యం బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. సకలము నశ్వరమె యనుచువికలము చెందిన మనసున వేదనతోడన్త్రికరణ శుద్ధిగను త్రియంబక జపము లొనర్చి ముక్తిఁ బడయగవచ్చున్.
కందం
రిప్లయితొలగించండిఅకటా! గరళము గొనుమని
ప్రకటింపగ సతియె మేలు ప్రజలకటంచున్
సుకరముగఁ గ్రోలె ననఁ ద్ర్యం
బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్!
చంపకమాల
సకల సురాసురుల్ సుధను సాగరమందున బొంద ద్రచ్చగన్
వికలమునందగన్ జగము వెల్వడ క్ష్వేళము గౌరి యొప్పఁగన్
సుకరమునన్ సదాశివుడె జుర్రెను లోకము లెల్లఁ గావఁ ద్ర్యం
బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసకలముకాలమెంచుననిశాంతివహించుచుకన్నుమూయుచున్
రిప్లయితొలగించండివికలముగానిమానసమువెంపరలాడకవిజ్ఞుడౌచునున్
నకనకలాడుచున్జగతినాదనుభావనసేయకేమదిన్
బకజపమాచరించుటయెప్రాప్తమొనర్చునుమోక్షమిద్ధరన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసకలము సర్వేశ్వరుఁడే
రిప్లయితొలగించండివికలమొనర్చఁగనఘముల వేదనలనుతా
నొకడే దిక్కగును త్రియం
బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసుకములజంపగవచ్చును
రిప్లయితొలగించండిబకజపమొనరించి, ముక్తిబడయగవచ్చున్
సకలముదైవాధీనము
నికరముకాదనుతలపుననేరుపుతోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినికరమునందు జనులతో
రిప్లయితొలగించండితకరారు సలుపగ పెద్ద తగవున చిక్కన్
చకితుడగుచు నేత యెదుట
బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకలము వీడియు నిత్య
రిప్లయితొలగించండిమ్మకలంకుని దేవ దేవు నారాదిస్తున్
సుకరమ్ము గా జనము త్ర్యం
బక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆరాదిస్తున్' ?
సకలము దేవదేవుఁడగు శర్వుడు భక్త జనాళి రక్ష, తా
రిప్లయితొలగించండివికలమొనర్చు పాపముల వేదన దీర్చును వేఁడినంతనే
సుకరము భక్తవర్యులకు సోమునిఁ గొల్చిన నార్తి దీరు ద్ర్యం
బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం॥ వికలముఁ గాని మదినిలిపి
రిప్లయితొలగించండిసకలము నీవని తలచుచు సద్భక్తిఁ గనన్
బ్రకటితమగుఁ గాని యెటుల
బకజపము లొనర్చి ముక్తిఁ బడయఁగ వచ్చున్
చం॥ వికలముఁ గాని మానసముఁ బ్రీతియు నమ్మిక భక్తి తోడుగా
సకలము నీవటంచు భువి సజ్జనుఁడై పచరించఁ దక్కుఁ గా
ని కపటమాశ్రయించి చన నిత్యము ప్రాప్త మొసంగునే యెటుల్
బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశ్రీ కంది శంకరయ్య గారు తిద్దిన పిదప చం॥ 2వపాదము పచరించ పిదప అనవసరంగా ఉంచిన అరసున్న తొలిగించానండి
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసకలము నెరిగిన వారలు
రిప్లయితొలగించండిఅకలంకమనస్కులగుచుననవరతంబున్
సుకరంబగువిధమున త్ర్యం
*“బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”*
సకలురడెందెమందుగనశాశ్వత స్థానమునందినట్టి త్ర్యం
*“బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”*
నికపసలేనిపూజలవియేలవిచారమెనర్చుచున్సదా
వికలతనొందకుండగనువేడుకతోడనుకొల్వుమీశునిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసుకములవి శాశ్వతములే?
యకములకవి మూలమనుచు నందురు కదరా!
యికనైనను తప్పక త్ర్యం
బక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్.
సకల గుణాభిరాముడగు సంతుకు నాయువు తీరుచుండగా
వికలిత మైన చిత్తమున వేదన తోడ మృకండు డిట్లనెన్
త్రికరణ శుద్ధిగా నిపుడు రేదొర భూషణు డైన యట్టి త్ర్యం
బక జప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసుకరము జీవన మెప్పుడు
రిప్లయితొలగించండిసకల భవిష్యములమరును సద్భక్తులకే
వికసిత హృదయముతో త్ర్యం
బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
సుకరము గాదెజీవనము చూపగఁ లక్ష్యము భక్తిమార్గమే
తొలగించండిసకలము ప్రాప్తమౌను సుఖసౌఖ్యములందును సర్వవేళలన్
ముకుళిత హస్తులై జనులు ముక్తిని కోరుచు భక్తితోడ త్ర్యం
బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండివికసిత చిత్తము గల్గియు
రిప్లయితొలగించండిసకలా ర్థ పు సాక్షి యైన సర్వే శ్వ రు న
య్య క లంకుని మది లో త్ర్య o
బక జపము లొనర్చి ముక్తి బడయగ వచ్చు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రకటిత భక్తిం ద్రిపురాం
రిప్లయితొలగించండితకార్పితస్వీయ బుద్ధి తనరగ సతమున్
వికల మనమ్మున ఫాలాం
బక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
సుకరము లౌను గార్యములు చొప్పడు నెల్ల లసన్మనో రథ
ప్రకరము లంచితమ్ముగను ఫాలత లాక్షునిఁ గొల్వ భక్తినిన్
సకల నరోత్కరమ్మునకు సన్నుత ధర్మము చిత్త శుద్ధిఁ ద్ర్యం
బక జప మాచరించుటయె ప్రాప్త మొనర్చును మోక్ష మిద్ధరన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం:ఒక పరి చెర లో బడినా,
రిప్లయితొలగించండివిక నాపుము పోరు బాట,
యేదో ఆధ్యా
త్మికత నటించుచు బుద్ధిగ
బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”
(జైల్ లో పడ్డావు కదా!ఇంకా పోరాటాలు దేనికి?కాస్త ఆధ్యాత్మికత చూపి ఏదో కొంగ జపం చేస్తే మంచితనం మీద జైల్ నుంచి ముక్తి దొరక వచ్చు.)
చం:సకలవిధాల వైద్యములు సాగుచు నున్నవి,తృప్తి జెంది నీ
రిప్లయితొలగించండివిక పరమాత్ము దల్చుకొనవే! త్యజియించు భయమ్ములన్,గణిం
పకు మిక దేహబాధలను, భక్తి వహించుచు శ్రద్ధతో త్రయం
బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”
(త్రయంబక మంత్రం అనే ఒక మంత్రం ఉంది.అది మోక్షసాధన మంత్రం.ఆరోగ్యానికి కూడా దాన్ని పఠిస్తారు.)
సకలము నీవే యంచును
రిప్లయితొలగించండినకలంకపు మనము తోడ ననవరతంబున్
ముకుళిత వదనమున ద్ర్యం
బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్
ముకుళిత భావముంగలిగి మోదమునొందుచునెల్లవేళలన్
రిప్లయితొలగించండివికలపు చింత లేకమదిభీకర మౌశపధంబుఁజేసియే
సకలముఁదానెయంచునిక సార్ర్థతకల్గిన మోము తోడఁద్ర్యం
బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్
పిన్నక నాగేశ్వరరావు.
రిప్లయితొలగించండిహనుమకొండ.
సకలము నశ్వరమె యనుచు
వికలము చెందిన మనసున వేదనతోడన్
త్రికరణ శుద్ధిగను త్రియం
బక జపము లొనర్చి ముక్తిఁ బడయగవచ్చున్.