20-7-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విద్య నేర్పువారు వెఱ్ఱివారు”
(లేదా...)
“విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
కూడు కొరకె యిలను కోటి విద్యలనుచు భుక్తి నొసగు విద్య మోదమంచు చదువు లందు జూడ సంస్కారమేలేని విద్య నేర్పువారు వెఱ్ఱివారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలదిచదివితినని చెప్పి చదువుల మర్మమ్ముతఱచి నిల్వ సుతుడు తండ్రి ముందుబాలభక్తుఁడైన ప్రహ్లాదునకు వేరువిద్య నేర్పువారు వెఱ్ఱివారు!ఉత్పలమాలహృద్యముగా ప్రజాళి మదికింపొనఁ గూర్చెడు భాషణమ్మునన్వేద్యుల పేర 'నెన్నికల విజ్ఞతఁ' గెల్చియు పీఠమెక్కియున్వద్యములొల్కుచున్ మిగుల స్వార్థమె చేతలఁజింద నీతులన్విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
పరముమరచినట్టిపండితుడేవిధిపాఠమెంచిజెప్పుప్రజలకెట్లులౌక్యమనెడిరంగురాచినబుడగయావిద్యనేర్పువారువెఱ్ఱివారు
సద్యశరాజితంబునగుసాధనతోడువికాసమందుచున్వేద్యమునైనబ్రహ్మయనవిజ్ఞతబోధనజేయకేగురుండద్యకనాంథకారముననల్పునివోలెనులౌకికంబునౌవిద్యలునేర్పువారలవివేకులుపామరులజ్ఞులీభువిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నీతి రహిత విద్య నిగుడుచుండెనునేడుప్రజలలోన హింస ప్రబలుచుండెవిమల మైన గొప్ప విలువలులేనట్టివిద్య నేర్పువారు వెఱ్ఱివారు
వేద్యుడునైన
ఆ॥ మూర్ఖుఁడతఁడు చదువు ముఖ్యమనెడు ధ్యాసవీడి పరఁగు వాఁడు చూడ నట్టివానిఁ బిలిచి చదువు వలదన వినకనువిద్య నేర్పు వారు వెఱ్ఱివారుఉ॥ విద్యలు నేర్వ యుత్సుకతఁ బ్రీతినిఁ గాంచక మొండి వైఖరిన్సద్యము చూపు వారలను సాధనఁ జేయఁగఁ బ్రోత్సహించఁగన్జోద్యము గాదె తెల్పగఁను సోమరి కూళులకున్ ముదమ్ముతోన్విద్యలు నేర్పు వార లవివేకులు పామరు లజ్ఞులీ భవిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
పావనంపు మదియు భావన లో మార్పు నీతి వర్త నమ్ము నీమ. ములను మంచి యా చ రణము మాన్యత లేనట్టి విద్య నేర్పు వారు వెఱ్ఱి వారు
ఆద్యులు త్యాగమూర్తులు మహాత్ముల జీవన శైలి తెల్పెడిన్ విద్యలు నేర్పుచుందురిల విజ్ఞులు, ధర్మపథమ్ము వీడుచున్ విద్యలు కూడు నివ్వగల విత్తము గూర్చెడి సాధనమ్మయే విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్.
సతము వెతల తోడ సాగెడు మానవజన్మ నెత్తి నట్టి జనుల యొక్కయనరులన్ని తీరునని దుష్టమౌ క్షుద్రవిద్య నేర్పువారు వెఱ్ఱివారు
విద్యలెల్లనేర్పి విజ్ఞానవంతులైమన్ననందుచుండమానుగానుమంచిచెడులనెల్ల మరచుచు క్షుద్రమౌ*"విద్య నేర్పువారు వెఱ్ఱివారు”*డా బల్లూరి ఉమాదేవి ఆద్యులు నేర్చివిద్యలను నక్షర రూపిణిదీవెనందుచున్పద్యపుకావ్యరాజముల పట్టుగ తామిల నేర్చినేర్పగావేద్యులమంచుచెప్పినవివేకముతోడను తాము క్షుద్రమౌ*“విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్”*
విద్య యొసగునెపుడు విజ్ఞాన సంపదఅభ్యసించువిద్య వ్యర్థమవదుమంచికూర్చనట్టి వంచన పెంచేటివిద్య నేర్పువారు వెఱ్ఱివారువిద్యలనేకముల్ తగిన విజ్ఞత కల్గును నేర్చుకొన్నచోసేద్యము చేయువా డయినఁ శీఘ్రమె విద్యను సేర్వగావలెన్వేద్యములైన విద్యలను వీడి నిరర్థకమైన హేయమౌవిద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వినయ సంపదయు వివేకము లొనఁగూర్చువిద్య నేటికయ్యె విపణి సరుకుధన సమార్జనమ్మె తమ ధ్యేయముగనెంచివిద్య నేర్పువారు వెఱ్ఱివారు
విద్యయొసంగు జ్ఞానమును విజ్ఞత మానవకోటికంచు నావిద్యయె లేనివాఁడు భువిఁ వింతమృగమ్మని నమ్మి యెల్లరున్సద్యశమొంద సద్గురువు సన్నిధి జేర ధనార్జనమ్ముకైవిద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
కోరి రాఁగ జనులు గురువుల నర్థింప మూరి యొసఁగ నొప్పు నేరి కైన మూర్ఖ జనులఁ జేరి బోధ నొసఁగ నెంచి విద్య నేర్పు వారు వెఱ్ఱివారు సేద్యము యంత్రచోదనము సిక్కును విద్యల నైపుణమ్మునన్ వేద్యమ యెల్లవారలకు విశ్వము నందు సునిశ్చయమ్ముగన్ విద్య లొసంగుఁ జిత్తుఁ గుడిఁ బెట్టును నేర్పిల నేరకున్నచో విద్యలు, నేర్పు వార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
మద్యము గ్రోలుచున్ దిరుగి మత్తున నిత్యము, దొడ్డిదారిలోసేద్యము చేయకుండగనె చేకుర పట్టము, పాఠశాల సౌహృద్యముతోడ పాఠముల నింపును గూర్చుట చేతగాక నేవిద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
తే.గీ:విద్య నేర్వగ నర్హులు వినయ యుతులు,సాధకులు మాత్రమే ప్రదర్శకుల కొరకునిర్గుణబ్రహ్మమని విద్య నేర్పు వారు వెర్రి వారు ,వీరి వలన విద్య చెడును.
ఉ:విద్యను నేర్చు శిష్యుడు వివేచన తోడుత ,బ్రహ్మనిష్ఠుడైవిద్యను నేర్వగా వలెను,వీనిని వీడి యశమ్ము బొందనేవిద్యను నేర్వ ,నా గురువు విత్తము చాలని నేర్ప, శిష్యుడున్,విద్యలు నేర్పువార, లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
విద్యను నేర్పువేళను వివేకము సూపక పాఠ్యభాగమున్గద్యముగా పఠించి తుదిఁ గల్గిన ప్రశ్నలఁ జెప్పివేగమున్ చోద్యముగాదు! యీ పగిది చూడ పరీక్షల లోన నెగ్గనై విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. శ్రద్ధ లేదు నాకు చదువు మీద యనుచుపాఠశాలను వదలి పారిపోవుబాలు నొకనికి బలవంతమున్ జేయుచువిద్య నేర్పు వారు వెఱ్ఱివారు.
రిప్లయితొలగించండికూడు కొరకె యిలను కోటి విద్యలనుచు
భుక్తి నొసగు విద్య మోదమంచు
చదువు లందు జూడ సంస్కారమేలేని
విద్య నేర్పువారు వెఱ్ఱివారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిచదివితినని చెప్పి చదువుల మర్మమ్ము
తఱచి నిల్వ సుతుడు తండ్రి ముందు
బాలభక్తుఁడైన ప్రహ్లాదునకు వేరు
విద్య నేర్పువారు వెఱ్ఱివారు!
ఉత్పలమాల
హృద్యముగా ప్రజాళి మదికింపొనఁ గూర్చెడు భాషణమ్మునన్
వేద్యుల పేర 'నెన్నికల విజ్ఞతఁ' గెల్చియు పీఠమెక్కియున్
వద్యములొల్కుచున్ మిగుల స్వార్థమె చేతలఁజింద నీతులన్
విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిపరముమరచినట్టిపండితుడేవిధి
రిప్లయితొలగించండిపాఠమెంచిజెప్పుప్రజలకెట్లు
లౌక్యమనెడిరంగురాచినబుడగయా
విద్యనేర్పువారువెఱ్ఱివారు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసద్యశరాజితంబునగుసాధనతోడువికాసమందుచున్
రిప్లయితొలగించండివేద్యమునైనబ్రహ్మయనవిజ్ఞతబోధనజేయకేగురుం
డద్యకనాంథకారముననల్పునివోలెనులౌకికంబునౌ
విద్యలునేర్పువారలవివేకులుపామరులజ్ఞులీభువిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినీతి రహిత విద్య నిగుడుచుండెనునేడు
రిప్లయితొలగించండిప్రజలలోన హింస ప్రబలుచుండె
విమల మైన గొప్ప విలువలులేనట్టి
విద్య నేర్పువారు వెఱ్ఱివారు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేద్యుడునైన
రిప్లయితొలగించండిఆ॥ మూర్ఖుఁడతఁడు చదువు ముఖ్యమనెడు ధ్యాస
రిప్లయితొలగించండివీడి పరఁగు వాఁడు చూడ నట్టి
వానిఁ బిలిచి చదువు వలదన వినకను
విద్య నేర్పు వారు వెఱ్ఱివారు
ఉ॥ విద్యలు నేర్వ యుత్సుకతఁ బ్రీతినిఁ గాంచక మొండి వైఖరిన్
సద్యము చూపు వారలను సాధనఁ జేయఁగఁ బ్రోత్సహించఁగన్
జోద్యము గాదె తెల్పగఁను సోమరి కూళులకున్ ముదమ్ముతోన్
విద్యలు నేర్పు వార లవివేకులు పామరు లజ్ఞులీ భవిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిపావనంపు మదియు భావన లో మార్పు
రిప్లయితొలగించండినీతి వర్త నమ్ము నీమ. ములను
మంచి యా చ రణము మాన్యత లేనట్టి
విద్య నేర్పు వారు వెఱ్ఱి వారు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆద్యులు త్యాగమూర్తులు మహాత్ముల జీవన శైలి తెల్పెడిన్
విద్యలు నేర్పుచుందురిల విజ్ఞులు, ధర్మపథమ్ము వీడుచున్
విద్యలు కూడు నివ్వగల విత్తము గూర్చెడి సాధనమ్మయే
విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసతము వెతల తోడ సాగెడు మానవ
రిప్లయితొలగించండిజన్మ నెత్తి నట్టి జనుల యొక్క
యనరులన్ని తీరునని దుష్టమౌ క్షుద్ర
విద్య నేర్పువారు వెఱ్ఱివారు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిద్యలెల్లనేర్పి విజ్ఞానవంతులై
రిప్లయితొలగించండిమన్ననందుచుండమానుగాను
మంచిచెడులనెల్ల మరచుచు క్షుద్రమౌ
*"విద్య నేర్పువారు వెఱ్ఱివారు”*
డా బల్లూరి ఉమాదేవి
ఆద్యులు నేర్చివిద్యలను నక్షర రూపిణిదీవెనందుచున్
పద్యపుకావ్యరాజముల పట్టుగ తామిల నేర్చినేర్పగా
వేద్యులమంచుచెప్పినవివేకముతోడను తాము క్షుద్రమౌ
*“విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్”*
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివిద్య యొసగునెపుడు విజ్ఞాన సంపద
రిప్లయితొలగించండిఅభ్యసించువిద్య వ్యర్థమవదు
మంచికూర్చనట్టి వంచన పెంచేటి
విద్య నేర్పువారు వెఱ్ఱివారు
విద్యలనేకముల్ తగిన విజ్ఞత కల్గును నేర్చుకొన్నచో
సేద్యము చేయువా డయినఁ శీఘ్రమె విద్యను సేర్వగావలెన్
వేద్యములైన విద్యలను వీడి నిరర్థకమైన హేయమౌ
విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివినయ సంపదయు వివేకము లొనఁగూర్చు
రిప్లయితొలగించండివిద్య నేటికయ్యె విపణి సరుకు
ధన సమార్జనమ్మె తమ ధ్యేయముగనెంచి
విద్య నేర్పువారు వెఱ్ఱివారు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిద్యయొసంగు జ్ఞానమును విజ్ఞత మానవకోటికంచు నా
రిప్లయితొలగించండివిద్యయె లేనివాఁడు భువిఁ వింతమృగమ్మని నమ్మి యెల్లరున్
సద్యశమొంద సద్గురువు సన్నిధి జేర ధనార్జనమ్ముకై
విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికోరి రాఁగ జనులు గురువుల నర్థింప
రిప్లయితొలగించండిమూరి యొసఁగ నొప్పు నేరి కైన
మూర్ఖ జనులఁ జేరి బోధ నొసఁగ నెంచి
విద్య నేర్పు వారు వెఱ్ఱివారు
సేద్యము యంత్రచోదనము సిక్కును విద్యల నైపుణమ్మునన్
వేద్యమ యెల్లవారలకు విశ్వము నందు సునిశ్చయమ్ముగన్
విద్య లొసంగుఁ జిత్తుఁ గుడిఁ బెట్టును నేర్పిల నేరకున్నచో
విద్యలు, నేర్పు వార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమద్యము గ్రోలుచున్ దిరుగి మత్తున నిత్యము, దొడ్డిదారిలో
రిప్లయితొలగించండిసేద్యము చేయకుండగనె చేకుర పట్టము, పాఠశాల సౌ
హృద్యముతోడ పాఠముల నింపును గూర్చుట చేతగాక నే
విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:విద్య నేర్వగ నర్హులు వినయ యుతులు,
రిప్లయితొలగించండిసాధకులు మాత్రమే ప్రదర్శకుల కొరకు
నిర్గుణబ్రహ్మమని విద్య నేర్పు వారు
వెర్రి వారు ,వీరి వలన విద్య చెడును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:విద్యను నేర్చు శిష్యుడు వివేచన తోడుత ,బ్రహ్మనిష్ఠుడై
రిప్లయితొలగించండివిద్యను నేర్వగా వలెను,వీనిని వీడి యశమ్ము బొందనే
విద్యను నేర్వ ,నా గురువు విత్తము చాలని నేర్ప, శిష్యుడున్,
విద్యలు నేర్పువార, లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిద్యను నేర్పువేళను వివేకము సూపక పాఠ్యభాగమున్
రిప్లయితొలగించండిగద్యముగా పఠించి తుదిఁ గల్గిన ప్రశ్నలఁ జెప్పివేగమున్
చోద్యముగాదు! యీ పగిది చూడ పరీక్షల లోన నెగ్గనై
విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
శ్రద్ధ లేదు నాకు చదువు మీద యనుచు
పాఠశాలను వదలి పారిపోవు
బాలు నొకనికి బలవంతమున్ జేయుచు
విద్య నేర్పు వారు వెఱ్ఱివారు.