9, జులై 2024, మంగళవారం

సమస్య - 4816

10-7-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గోవు పాలను పులి గ్రోలె వనిని”

(లేదా...)

“గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

19 కామెంట్‌లు:

 1. ప్రజల ధనముమ్రింగిపాలకుండవనిని
  పెద్దతానునయ్యెపేరునందె
  నోరులేనివారునోరిమినుండగా
  గోవుపాలనుపులిగ్రోలెవనిని

  రిప్లయితొలగించండి
 2. అక్షయ్యంబగుహంసయైనడచెనిస్సారంపులోకంబులో
  సాక్షీభూతుడుశంకరుండునటనన్సందేహమేలాగనన్
  రక్షోనాథుడుకాలుడైవరలెగారాగంబులేకన్మదిన్
  గోక్షీరంబులఁగ్రోలెపెద్దపులియేఘోరావనిన్దృప్తిగా

  రిప్లయితొలగించండి
 3. వప్త కూడదన్న ప్రహ్లాదు డెప్పుడు
  విడువడయ్యె తనదు విష్ణు భక్తి
  భీతి లేక తాను విష్ణునామమనెడి
  గోవు పాలను పులి గ్రోలె వనిని.


  దాక్షిణ్యమ్మది లేని రాక్షసుని నందంతుండుగా బుట్టియున్
  రక్షఘ్నన్ గొలిచెన్ హిరణ్యకశిపున్ రాజ్యమ్ములో నావిశా
  లాక్షుండొక్కడె రక్షకుండనుచు ప్రహ్లాదుండనున్ గాంచగన్
  గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా.

  రిప్లయితొలగించండి
 4. ఆటవెలది
  దూడకొసఁగి వత్తు దుగ్ధమనుచుఁబల్కి
  తల్లి యావు మాట తప్పకుండ
  తినుమటంచు నిల్వ 'తీరైన పల్కులన్'
  గోవు 'పాలను' పులి గ్రోలె వనిని!

  శార్దూలవిక్రీడితము
  భక్షింపంగ సమీపమౌ పులికిఁ దా వాగ్దానమున్ జేసి తా
  నక్షీణంపు యశమ్మునన్ సుతకు సంధానించి యాహారమున్
  సాక్షుల్ సైతము విస్తుబోవఁ జని భక్ష్యమ్మౌదు నన్ 'బల్కులన్
  గోక్షీరమ్ములఁ' ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా!

  రిప్లయితొలగించండి
 5. ఆ॥ చలనచిత్ర మందు మలఁచి విచిత్రము
  లెన్నొ చూపఁ గలరు మిన్న గాను
  బ్రేక్షకాళి నవ్వు విరఁబూయఁ జూపిరో
  గోవు పాలను పులి గ్రోలె వనిని

  శా॥ వీక్షించంగను బ్రేక్షకాళికిని వైవిధ్యంబుఁ జిత్రమ్ముగన్
  సాక్షాత్కారముఁ జేయనెంచెదరటుల్ సాధ్యమ్ముఁ గాకున్నవే
  నీక్షోణిన్ ఘన చిత్రసీమయనఁగానే! మిత్రమా చూడుమా
  గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా

  రిప్లయితొలగించండి
 6. చిన్ననాట తల్లిచెల్లగ గతిలేక
  గోవు పాలను పులి గ్రోలె వనిని
  ఏది యుండిన మరి యేది లేకుండిన
  కడుపు నింపు కొనగ గాతి వలయు

  రిప్లయితొలగించండి
 7. పూర్వ కాలికమగు పొత్తముఁ సవరింప
  భావ్యమంచు తలచి కావ్యమందు
  పంతమూని తానె ప్రక్షిప్త మొనరింప
  గోవు పాలను పులి గ్రోలె వనిని

  నిక్షేపంబగు గ్రంథమెంచె నతడే నిర్ణీతకాలంబునన్
  బక్షాంతంబగు పున్నమే తగుననన్ బంతంబునేబూనుచున్
  బ్రక్షిప్తంబగు పద్య సృష్టి సలుపన్ బ్రాచీన గ్రంథంబులో
  గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా

  రిప్లయితొలగించండి
 8. అక్షీణమ్ముగ నా యతీంద్రు నివసమ్మందా వనంబందునన్
  సాక్షీభూతముగా ప్రశాంతతయె విస్తారమ్ముగా నెక్కొనన్
  భక్షింపంగ నిరాకరించు మెకమున్ వ్యాఘ్రమ్ము చిత్రమ్ముగా
  గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా

  రిప్లయితొలగించండి
 9. కథ ను జెప్పు నొకడు కల్లల బ ల్కు చు
  బాల లకు ను దెలి పె వన ము లోన
  సంచ రించు వేళ చకి త ముగను
  గోవు పాలను బులి గ్రోలె వనిని

  రిప్లయితొలగించండి
 10. చెంగు చెంగున వెసఁ జిత్రగతుల గెంతి
  చిఱుత పిల్ల యొకటి చెంత కరిగి
  పండుకొంచు నొసఁగఁ, బాఱంగ భీతిల్లి
  గోవు, పాలను బులి గ్రోలె వనిని


  ఆక్షేపింపఁ దరంబె సన్మునుల మాహాత్మ్యమ్ములన్ సుంతయున్
  నిక్షేపమ్ములు మానవాళి కవి సంధిల్లంగ సుశ్రేయముల్
  సుక్షేమమ్ముగఁ గణ్వు నాశ్రమమునం జోద్యమ్ముగా నాడుచున్
  గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవి న్దృప్తిగా

  రిప్లయితొలగించండి
 11. ఆవనమున మౌని యాశ్రమంబందున
  శాంతి పరిఢవిల్లె సకల జంతు
  జాలమందు చెలిమి జాలువారుచునుండ
  గోవు పాలను పులి గ్రోలె వనిని

  రిప్లయితొలగించండి
 12. ఆ.వె:వింత లప్పుడపుడు పృథ్వి పై ఘటియించు
  గోవు పాలను పులి గ్రోలె, వనిని
  దారి తప్పి యొక్క యూరిలో నావుతో
  సఖ్య మౌట ,పులియు చంటి దౌట
  (ఈ మధ్య ఒక ఊరిలో ఇది నిజంగానే జరిగింది.పత్రికలలో ఈ వార్తల వచ్చింది.)

  రిప్లయితొలగించండి
 13. అక్షీణోన్నత బాహువిక్రముడు వీరానీకసంస్తుత్యుడున్
  రక్షఃసంఘవిమర్దనుం డకట! ప్రారబ్దంబనన్ వర్తిలెన్
  దీక్షన్ శాంతిని బూని భీము డటవీదేశంబునన్ గాంచనన్
  గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా

  రిప్లయితొలగించండి
 14. శా:దాక్షిణ్యమ్మును జూపు బిడ్డ యెడ ,స్వాస్థ్యమ్మిచ్చు సాజమ్ముగా
  నీ క్షీరమ్ములె ,పోత పాల నిడుటే నీ యందమున్ నిల్పు భం
  గో? క్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా
  తా క్షుద్బాధకు తల్లి వద్ద కన లేదా నిన్న చిత్రమ్మునన్.
  (పోత పాల కంటే తల్లి పాలే మంచివి.నిన్న సినిమాలో కూడా పులి తల్లి పాలు తాగుతున్నట్టు ఉన్నది.చూడ లేదా?)

  రిప్లయితొలగించండి
 15. గోవువంటివనిత భావనపులివోలె
  కంటిచూపుచేతవెంటబడియు
  మధురమైనమమత మాధుర్యమందించ?
  గోవుపాలనుపులిగ్రోలెవనిన

  రిప్లయితొలగించండి
 16. మనుజులందు మృగ్య మైన ట్టి మమతలు
  కానవచ్చుచుండెకానలందు
  నాశ్రమములయందుననురాగమునుచూప
  *“గోవు పాలను పులి గ్రోలె వనిని”*

  కుక్షిన్దాచుచునీసుకొందరిలలోకూర్మిన్ ప్రదర్శించుచున్
  యాక్షేపించుచెనెల్లరన్తిరుగుచున్ హానిన్తలంచన్మదిన్
  కక్షల్ వీడుచు క్రూరమౌ మృగములున్ కానన్ చరించున్సుమా
  *“గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా”*

  రిప్లయితొలగించండి
 17. పుణ్యకార్యములకుఁబూజకుఁదెత్తురు
  గోవు పాలను, పులి గ్రోలె వనిని
  లేడిఁగాంచి చంపి వేడిరుధిరమును
  సహజ సిద్ధమిదియ జంతువులకు

  రిప్లయితొలగించండి
 18. గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా
  కుక్షింనింపను మార్గ మీయదె సుమాకొంగ్రొత్త కాదేయిదీ
  యక్షయ్యంబగు గాన యందున బలోహారంబు గోమాతలే
  సాక్షీభూతము పాలుఁద్రాగుట గదా చాంద్రాయణీ!శాంకరీ!

  రిప్లయితొలగించండి

 19. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  అడవి లోని మునుల యాశ్రమములయందు
  క్రూర,సాధు మృగము కూర్మి మెలగు
  తల్లియే గతించ పిల్ల యొక్కటచట
  గోవు పాలను పులి గ్రోలె వనిని.

  రిప్లయితొలగించండి