5, జులై 2024, శుక్రవారం

సమస్య - 4812

6-7-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఒక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె”

(లేదా...)

“ఇద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

30 కామెంట్‌లు:

  1. అద్దమువంటిమానసమునందునజీవుడుహంసతోడుగా
    అద్దిరనొక్కటైపొడమనాడిరిపాడిరిచిద్విలాసులై
    తద్దయుపాఱెజీవుడునుదైవమునిల్చెగశాశ్వతంబుగా
    ఇద్దఱుచందమామలుదయింపగనొక్కడుగ్రంకెనొక్కడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "అద్దిర యొక్కటై... నిల్చును/నిల్వగ..." అనండి.

      తొలగించండి
  2. తేటగీతి
    తెలుగు రాష్ట్రాల రెండీంట వెలుగు లీన
    ముఖ్యమంత్రులుగఁ దగెడు పూజ్యులైనఁ
    దప్పవనగ రేయి పవలు నొప్పిదముగ
    నొక్క చంద్రుఁ డు వొడమె! వేఱొకఁడు గ్రుంకె!

    ఉత్పలమాల
    బ్రద్దలు పట్టుచున్ తెలుగు రాష్ట్రములేలెడు సిద్ధహస్తులై
    పెద్దలు చంద్రలిద్దరును పేరుగడించిరి పాటవమ్ములన్
    ఇద్దరి రేపవళ్లుఁ గలవెప్పుడనంగను కీర్తిఁగాంచ వా
    రిద్దరు చందమామలు! దయింపఁగ నొక్కఁడు! గ్రుంకె నొక్కఁడున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా! 🙏 తమరి సూచన మేరకు సవరించిన ఉత్పలమాల:

      ఉత్పలమాల
      బ్రద్దలు పట్టుచున్ తెలుగు రాష్ట్రములేలెడు సిద్ధహస్తులై
      పెద్దలు చంద్రులిద్దరును పేరుగడించిరి పాటవాలతో
      నిద్దరి రేపవళ్లుఁ గలవెప్పుడనంగను కీర్తిఁగాంచ వా
      రిద్దరు చందమామలు! దయింపఁగ నొక్కఁడు! గ్రుంకె నొక్కఁడున్!

      తొలగించండి
  3. యుద్ధభూమినిభీష్ముండుయోధుడయ్యె
    అర్జునుండునుగననయ్యెహంగుతోడ
    తలనువాల్చెగతాతయుధరణిపైని
    ఒక్కచంద్రుడువొడమెవేఱొకడుగ్రంకె

    రిప్లయితొలగించండి
  4. తే॥ శాస్త్ర విజ్ఞతనిరువురుఁ జంద్రు లిలను
    ఘనులు భౌతిక శాస్త్రపు గరిమఁ గనిరి
    తండ్రి పిమ్మట తనయుఁడు తళుకుచూపె
    నొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె

    ఉ॥ ముద్దుగ శాస్త్రవిజ్ఞతను మోదము నందిరి గొప్ప తజ్ఞులై
    తిద్దిరి శాస్త్ర శోధనలఁ దీరుగ మార్చుచుఁ బ్రాఁత సూత్రముల్
    సుద్దినిఁ దెల్ప తండ్రి చన శోభగ భాసిలె పుత్రరత్నమే
    యిద్దరు చందమామలుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్

    చిన్న వివరణ అండి: నీల్స్ భోర్ (Neil’s Bohr) ఆజె భోర్ (Aage Bohr) ఇద్దరు తండ్రీకొడుకులు భౌతిక శాస్త్రజ్ఞులు. ఇద్దరూ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారండి. తండ్రి 1922 కుమారుడు 1975. 1962లో నీల్స్ భోర్ మరణము తరువాత కుమారుని ప్రకాశము యినుమడించిందండి.

    రిప్లయితొలగించండి

  5. ఇరువురును ముఖ్య మంత్రులై యింపుగాను
    తెలుగు రాష్ట్రాల నొకనాడు తేజమలర
    నేల నేమిర యీనాటి కాలమహిమ
    ఒక్క చంద్రుఁ డు వొడమె వేఱొకఁడు గ్రుంకె.


    ఇద్ధర గొప్ప పేరుగల యిర్వురు నేతలు వ్యాపృతుండ్రుగా
    యుద్ధము బోలెడెన్నికల నొంటని వారిని ద్రుంచి గెల్చెడిన్
    బద్ధతి మెచ్చి పాల్గొనిన పాటవ మొప్పెడి నేతలే గదా
    ఇద్దఱు చందమామ , లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్.

    రిప్లయితొలగించండి
  6. ఈనడుమన నెన్నికలలో నిరువురు శశి
    పేరు గలిగిన నేతలు వేరు రాష్ట్ర
    ములకు ముఖ్య సచివులుగ పొటి చేయ
    నొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె

    రిప్లయితొలగించండి
  7. రెండు రాష్ట్రాల చంద్రుల రీతి జూడ
    నొక్క చంద్రుడు వొడమె వేరొక డు గ్రు o కె
    నన్న చందా న సాగెగా నెన్ని కలల
    గెలుపు లోటము ల విధము దెలుపు చుండె

    రిప్లయితొలగించండి
  8. సాటి కనరాని నాయక చంద్రులనగ
    కీర్తి నార్జించి రిరువురు; కేంద్రమందు
    కొలువు కూటమికి తగిన బలము గూర్చ
    నొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె

    ఖద్దరు కట్టినారు గతకాలము నందున నొక్క పక్షమున్
    ముద్దుగ తెల్గుదేశమను మూలము దాపున ముఖ్యులైరిగా!
    ఇద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె, నొక్కఁడున్
    సిద్ధము కొల్వుకూటమికి చింతలుబాపగ కేంద్రమందునన్

    రిప్లయితొలగించండి
  9. దిన నిశా చంద్రు లిరువురు దినదినమ్ము
    నిద్ధర వెలుఁగు చుందురు పద్ధతిగను
    నొకరి పిమ్మట నొక్కరు ప్రకటితముగ
    నొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె


    గ్రద్దన నుద్భవింప హరి కారణ జన్ముఁడు లోక రక్షకై
    పెద్దలు నస్త్ర శస్త్రముల వీర్య పరాక్రమ ధాటి వెల్కఁగాఁ
    దద్దయు రామచంద్రుఁడును దానవ చంద్రుఁడు రావణుండు నా
    నిద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'వెల్గఁగా' టైపాటు.

      తొలగించండి
  10. అద్దినమా ప్రసూతి నెలవందు జనించిరి పెక్కు కూనలున్
    కద్దగునెప్డు సుస్తిఁబడు కందులు మాయుటనొక్క తల్లికా
    యిద్దరు చందమామలుదయింపగ నొక్కడు గ్రుంకె నొక్కడున్
    బొద్దుగ పాలుగారు చిఱు మూటయెఁ దల్లియు నూరడిల్లగన్

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:అల్లుడా!ప్రసవించె నా యనుగు పుత్రి
    చంద్రులన్ బోలు కవలల, శాప మేమొ
    యిద్దరిన్ జూడ లేమిక యీ ధరణిని
    నొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె”

    రిప్లయితొలగించండి
  12. ఉ:ఒద్దిక తోడ రాష్ట్రముల కొక్కొక కీర్తిని దెచ్చు వార లై
    యిద్దర కిద్దరే యని వచించెడు రీతిగ వెల్గి యేలనో
    యిద్దర కిద్దరున్ గెలువ రెన్నిక యందు విచిత్ర మెంచగా
    నిద్దఱు చందమామ, లుదయింపఁగ నొక్కఁడు, గ్రుంకె నొక్కఁడున్”

    రిప్లయితొలగించండి
  13. నిండు పున్నమి నింగిలో నిగిడెను శశి
    రాడు రాడేల నారాజు రాత్రి గడచె
    నని ప్రతీక్షించు బ్రేయసి యబ్బురపడ
    నొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె

    ముద్దులుగారు బాలకుడు మొగ్గరమందున జిక్కె నక్కటా
    హద్దులు మీరు దౌష్ట్యమున నందరు మూకగజేరి యొక్కనిన్
    యుద్ధమునందు గూల్చగ సుయోధను నానతి, గానవచ్చె నా
    డిద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు, గ్రుంకె నొక్కఁడున్

    రిప్లయితొలగించండి
  14. నిద్దుర రాదు చందిరుడు నింగిని పొంపిరిపోవుచుండె నే
    డెద్ది కతమ్మొ నాదు సఖుఁ డేలఁగ రాడిటు, కమ్మవిల్తునిన్
    యుద్ధతి సైపజాలనని యుగ్మలి క్రందుచు గాంచె నంతలో
    నిద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు, గ్రుంకె నొక్కఁడున్

    రిప్లయితొలగించండి
  15. తూర్పు ది క్కున సూర్యుఁడు తొలుత రాగ
    పశ్ఛిమంబున చంద్రుఁడు మాయ మగుట
    యొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె
    పగలు రాత్రియు నేర్పడు పద్ధతిదియె

    రిప్లయితొలగించండి
  16. ముద్దులుమూటకట్టుకొను మోమున వెల్గెడు బాలచంద్రుడున్
    హద్దులు దాట గల్గియును నాఙ్ఞను గాదను రామచంద్రుఁడున్
    యుద్ధముఁజేసి తీవ్రముగ యోధుల ఁబ్రాణములంతరింపగా
    నిద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్”

    రిప్లయితొలగించండి
  17. విద్దెలనెన్నొనేర్చి యరివీరుల గెల్చిన క్రీడి యొక్కఁడున్
    ముద్దుల బాల్యమందె విలు బూనె నహా! యభిమన్యు డొక్కఁడున్
    తద్దయు ప్రీతి బాంధవులు తల్చిరి పాండుకులాబ్ధి కల్గినా
    రిద్దరు చందమామ లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఆకసమునందు వెల్గులు వ్యాప్తి చేయు
    వారు సూర్యచంద్రు లిలను వ్యవధి నిడక
    నుదయ మందున వెల్గు వాడొకడు,సంధ్య
    నొక్క చంద్రుడు వొడమె, వేరొకడుఁ గ్రుంకె.

    రిప్లయితొలగించండి