4-7-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్”
(లేదా...)
“సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్”
(రంప సాయికుమార్ గారి అష్టావధాన సమస్య)
కందంమేధనుమథించి నేర్చెనువేదన బాపెడు భిషక్కు వృత్తిని వడి రోగాదులడఁగ కాయముపైసూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్ఉత్పలమాలమేధను నాకుపంచరును మిన్నగ నేర్వగ నెంచభార్య తానాదరణంబునన్ పతియె యాలిని మెచ్చుచు ప్రోత్సహింప, రోగాదుల వేదనన్ నలుగ నార్తిని బాపగ శాస్త్ర పద్ధతిన్సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
మాధవుని గళము నందునపూదండను వేయదలచి ముద్దుల సుతుడేమోదుగపూలను తేగా సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్.మోదము తోడ తెచ్చితిని మోహన కృష్ణుని కంఠమందునన్ మోదుగు పూలదండనని పుత్రుడు చెప్పగ నాలకించుచున్ వాదన చేయకుండ మురిపమ్మున దారము తెచ్చి మాలగాసూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్.
పాదమునకు ముల్లు దిగగఖేదము నాపుకొన లేక కెరలుచు నుండన్ఆదేహజుని ములు పెరికెసూదులతోఁ గ్రుచ్చి ; చూపె సుతునకుఁ బ్రేమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."రోదించెడి... రోగము ద్రుంచన్" అనండి.
బాధను బొందుచు నిత్యమురోధించెడి కొడుకు కొరకు రోగము దృంచెన్శోధించి నేర్చి,మందులసూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
కం॥ వేదనఁ బెంచంగ జ్వరమురోదన విడక పసి వాఁడు రోయుచుఁ జనఁగన్వేదనఁ బాపఁగ నౌషధసూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్ఉ॥ వేదనఁ బెంచఁగన్ జ్వరము వీడకఁ బుత్రునిఁ జూడజాలకన్రోదన వైద్యురాలటుల రుగ్మత తగ్గఁగఁ బుత్ర రక్షకైవేదనఁ బాపి స్వస్థతను వేగిరమిచ్చెడి మందునింపుచున్సూదుల తోడఁ గ్రుచ్చిసతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ఔషధ సూదులు... దుష్టసమాసం. 'చూడ జాలక' అన్నది కళ.
ధన్యవాదములండి. సవరించుకుంటానండి.🙏🏾🙏🏾🙏🏾🙏🏾
వేదన పడుటను గాంచియు నాదర ముగ బాగు సేయు నాతు రముగసం పాదన నొసగియు వైద్యుని సూదులను గ్రుచ్చి చూపె సుతునకు ప్రేమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...సేయు నాత్రమ్మున సం..." అని ఉండాలనుకుంటాను.
మోదము గల్గెడు విధమునబోధన గావించ నెంచి బుద్ధి కుశలతన్ సూదంటురాయిపై పలుసూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్ఆచరణాత్మక బోధన పద్ధతిలో అయస్కాంతం గురించి బోధిస్తున్న తల్లి.
వ్యాధులఁ దప్పించగ పరిశోధన స్థిరపరచినట్టి సూచన ఫలమేనీదని టీకా వేయగసూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్వేదనలేని జీవితము పిల్లల కిచ్చును వైద్యవిద్యయే వ్యాధుల బారినుండి తమ బాలుని కాచును వ్యాధులెన్నొ టీకా దరిచేరనీయదని గట్టిగ నమ్మిన వైద్యు రాలిగాసూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
ధన్యవాదాలు గురూజీ 🙏
కందం:మోదముతో విరజాజులుసాదరముగ నందమైన సంపెఁగ పూవుల్పూదండగ నొద్దికగాసూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్ఉత్పలమాల:సాదరమొప్ప పాపడికి స్నానమొనర్పఁగజేసి నూత్న వస్త్రాదులు గట్టి వానికొక చక్కని పూవుల మాలఁ గట్టగామోదముతోడ మల్లియలు ముచ్చట గొల్పెడు సన్నజాజులన్సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
గాదిలి సూనునకు బలము గాఁ దాఁకఁగ బల్ల యంచు గాయము గాఁగా నోదార్ప నెంచి బల్లను సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్ మేదినిఁ దల్లి ప్రేమ కిఁక మించిన దెయ్యది యెంచి చూడఁగా వేదన నాలకించి వెసఁ బెద్దగ నేడ్వఁగ సంభ్రమమ్మునం దా దరిఁ జేరి శీఘ్రముగఁ దల్లియె కూరిమి కంటి చూపు లన్ సూదుల తోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారుని పైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
కం:సూది గని బిడ్డ డేద్వగ,వేదన బడి వైద్యురాలు భీతిని బాపన్ "లేదమ్మా!లే"దనుచున్సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్”(మనం పిల్లల్ని ఓదార్చే టప్పుడు లేదమ్మా!లేదు అంటాం.బిడ్డకి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆమెకి బాధే కలిగింది కానీ అలా అన్నది.)
ఉ:"లేదొకొ బుద్ధి?నీ కొడుకు లెక్కకు మిక్కిలి యేడిపించెగానాదు సుపుత్రు!" నంచు నొక నాతి వచింపగ రౌద్రమూర్తియై"నీ దొక జన్మమే?పరమ నీచ" వటంచు నసభ్య వాక్కులన్సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్”
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. వేదన చెందగ కొమరుడుబాధలు తొలగించు నాక్యుపంక్చరు వైద్యంబే, దడ చెందవల దనుచుసూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్.
మోదముతోపూమాలను*“సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్”*మేదినియందొకమాతయునాదరమునజనులుచూచినచ్చెరువొందన్
కందం ఆదీక మైన నొప్పికి రోదన లందున్న పుత్ర రోగము మాన్పన్ ఆదట తోడను తండ్రియు సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
కందం
రిప్లయితొలగించండిమేధనుమథించి నేర్చెను
వేదన బాపెడు భిషక్కు వృత్తిని వడి రో
గాదులడఁగ కాయముపై
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
ఉత్పలమాల
మేధను నాకుపంచరును మిన్నగ నేర్వగ నెంచభార్య తా
నాదరణంబునన్ పతియె యాలిని మెచ్చుచు ప్రోత్సహింప, రో
గాదుల వేదనన్ నలుగ నార్తిని బాపగ శాస్త్ర పద్ధతిన్
సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిమాధవుని గళము నందున
పూదండను వేయదలచి ముద్దుల సుతుడే
మోదుగపూలను తేగా
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్.
మోదము తోడ తెచ్చితిని మోహన కృష్ణుని కంఠమందునన్
మోదుగు పూలదండనని పుత్రుడు చెప్పగ నాలకించుచున్
వాదన చేయకుండ మురిపమ్మున దారము తెచ్చి మాలగా
సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపాదమునకు ముల్లు దిగగ
రిప్లయితొలగించండిఖేదము నాపుకొన లేక కెరలుచు నుండన్
ఆదేహజుని ములు పెరికె
సూదులతోఁ గ్రుచ్చి ; చూపె సుతునకుఁ బ్రేమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రోదించెడి... రోగము ద్రుంచన్" అనండి.
బాధను బొందుచు నిత్యము
తొలగించండిరోధించెడి కొడుకు కొరకు రోగము దృంచెన్
శోధించి నేర్చి,మందుల
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
కం॥ వేదనఁ బెంచంగ జ్వరము
రిప్లయితొలగించండిరోదన విడక పసి వాఁడు రోయుచుఁ జనఁగన్
వేదనఁ బాపఁగ నౌషధ
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
ఉ॥ వేదనఁ బెంచఁగన్ జ్వరము వీడకఁ బుత్రునిఁ జూడజాలకన్
రోదన వైద్యురాలటుల రుగ్మత తగ్గఁగఁ బుత్ర రక్షకై
వేదనఁ బాపి స్వస్థతను వేగిరమిచ్చెడి మందునింపుచున్
సూదుల తోడఁ గ్రుచ్చిసతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఔషధ సూదులు... దుష్టసమాసం. 'చూడ జాలక' అన్నది కళ.
ధన్యవాదములండి. సవరించుకుంటానండి.
తొలగించండి🙏🏾🙏🏾🙏🏾🙏🏾
వేదన పడుటను గాంచియు
రిప్లయితొలగించండినాదర ముగ బాగు సేయు నాతు రముగసం
పాదన నొసగియు వైద్యుని
సూదులను గ్రుచ్చి చూపె సుతునకు ప్రేమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...సేయు నాత్రమ్మున సం..." అని ఉండాలనుకుంటాను.
మోదము గల్గెడు విధమున
రిప్లయితొలగించండిబోధన గావించ నెంచి బుద్ధి కుశలతన్
సూదంటురాయిపై పలు
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
ఆచరణాత్మక బోధన పద్ధతిలో అయస్కాంతం గురించి బోధిస్తున్న తల్లి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివ్యాధులఁ దప్పించగ పరి
రిప్లయితొలగించండిశోధన స్థిరపరచినట్టి సూచన ఫలమే
నీదని టీకా వేయగ
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
వేదనలేని జీవితము పిల్లల కిచ్చును వైద్యవిద్యయే
వ్యాధుల బారినుండి తమ బాలుని కాచును వ్యాధులెన్నొ టీ
కా దరిచేరనీయదని గట్టిగ నమ్మిన వైద్యు రాలిగా
సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండికందం:
రిప్లయితొలగించండిమోదముతో విరజాజులు
సాదరముగ నందమైన సంపెఁగ పూవుల్
పూదండగ నొద్దికగా
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
ఉత్పలమాల:
సాదరమొప్ప పాపడికి స్నానమొనర్పఁగజేసి నూత్న వ
స్త్రాదులు గట్టి వానికొక చక్కని పూవుల మాలఁ గట్టగా
మోదముతోడ మల్లియలు ముచ్చట గొల్పెడు సన్నజాజులన్
సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిగాదిలి సూనునకు బలము
రిప్లయితొలగించండిగాఁ దాఁకఁగ బల్ల యంచు గాయము గాఁగా
నోదార్ప నెంచి బల్లను
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్
మేదినిఁ దల్లి ప్రేమ కిఁక మించిన దెయ్యది యెంచి చూడఁగా
వేదన నాలకించి వెసఁ బెద్దగ నేడ్వఁగ సంభ్రమమ్మునం
దా దరిఁ జేరి శీఘ్రముగఁ దల్లియె కూరిమి కంటి చూపు లన్
సూదుల తోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారుని పైనఁ బ్రేమనున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం:సూది గని బిడ్డ డేద్వగ,
రిప్లయితొలగించండివేదన బడి వైద్యురాలు భీతిని బాపన్
"లేదమ్మా!లే"దనుచున్
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్”
(మనం పిల్లల్ని ఓదార్చే టప్పుడు లేదమ్మా!లేదు అంటాం.బిడ్డకి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆమెకి బాధే కలిగింది కానీ అలా అన్నది.)
ఉ:"లేదొకొ బుద్ధి?నీ కొడుకు లెక్కకు మిక్కిలి యేడిపించెగా
రిప్లయితొలగించండినాదు సుపుత్రు!" నంచు నొక నాతి వచింపగ రౌద్రమూర్తియై
"నీ దొక జన్మమే?పరమ నీచ" వటంచు నసభ్య వాక్కులన్
సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
వేదన చెందగ కొమరుడు
బాధలు తొలగించు నాక్యుపంక్చరు వైద్యం
బే, దడ చెందవల దనుచు
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్.
మోదముతోపూమాలను
రిప్లయితొలగించండి*“సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్”*
మేదినియందొకమాతయు
నాదరమునజనులుచూచినచ్చెరువొందన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిఆదీక మైన నొప్పికి
రోదన లందున్న పుత్ర రోగము మాన్పన్
ఆదట తోడను తండ్రియు
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్