26, జులై 2024, శుక్రవారం

సమస్య - 4833

27-7-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్”
(లేదా...)
“ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

22 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      వినడను రావణు మీరక
      నినవంశజు బాణహతికి నేణిగ జిక్కన్
      తనరఁగ మారీచుడు; రా
      ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్

      మత్తేభవిక్రీడితము
      వినడన్ రావణు మీరకే హరిణమై వీడంగ ప్రాణమ్ములా
      యినవంశోత్తము సేతి బాణమునఁ గాంక్షింపంగ మారీచుడున్
      వెనువెంటన్బడి లేడి చిక్కదనుచున్ వేయన్ శరంబంత రా
      ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో

      తొలగించండి
  2. అనయమువిద్యార్థులునై
    మునివెంటనునడచిరంతమ్రోయుచుధనువున్
    తునియన్జేసిరిశత్రువు
    మునిఘాతమునమరణించెపొలతిండివనిన్

    రిప్లయితొలగించండి
  3. తనియన్జేయుచుగానమాధురిని, యత్యంతంబుభక్తుండునై
    వనిలోమౌనిగమాలదాసరియుతావంతన్గనెన్రక్కసున్
    అనయంబాతఁడుధారవోసెఫలమానందంబువిప్పారగా
    మునిఘాతమ్మునజచ్చెరాక్షసుడుసమ్మూఢమ్ముగాకానలో

    రిప్లయితొలగించండి
  4. మునియాగముఁ గాపాడఁగ
    వనముల కేతెంచె రామభద్రుఁడు సరవిన్
    ధనువును సంధించఁగ రా
    ముని ఘాతమున మరణించెఁ బొలదిండి వనిన్

    రిప్లయితొలగించండి
  5. ముని విశ్వామిత్రునితో
    జనె రాముడు లక్ష్మణుండు జన్నముగావన్
    గని రిపుపై వేయగ రా
    ముని ఘాతమున మరణించె పొలతిండి
    వనిన్.

    రిప్లయితొలగించండి

  6. *(శూర్పణఖ పంపిన ఖరుడనే రాక్షసుని చంపిన ఘట్టం, ఖరదూషణ త్రిశరుల పేరులు ప్రస్తావించిన ఖరుడను చంపాడనే భావం)*

    ఘనుడా యినకుల తిలకుని
    రణమున ఖరదూషణాది రక్కసులే ఢీ
    కొని భండన భీముడు రా
    ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్.


    జనకున్ మాటను నిల్పగా దలచి రాజ్యమ్మాతడే వీడుచున్
    వనవాసమ్మునకేగె లక్కుమనుడున్ బ్రాణేశయున్ దన్నటన్
    దునుమాడన్ ఖరదూషణుల్ త్రిశరులుద్యోగించు నవ్వేళ రా
    ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో.

    రిప్లయితొలగించండి
  7. ముని కోర్కెన్ తలదాల్చి రక్కసుల నున్మూలంబుగా ద్రుంచగన్
    ఘనుడౌ పంక్తిరథుండు కౌశికునితో కాపాడఁగా యాగమున్
    వనమున్బోవఁగ రామచంద్రుఁ బనిచెన్, బాణమ్ము సంధింప రా
    ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో

    రిప్లయితొలగించండి
  8. వనజాక్షి సీత నొలచగ
    ననువుగ మారీచు నంప నతడును వడిగన్
    సునయన రూపున జన రా
    ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్

    రిప్లయితొలగించండి
  9. కం॥ మనిజన యజ్ఞము భంగము
    నొనరించఁగఁ గౌశిక ముని యొనరుగ శ్రీరా
    ముని సాయముఁ గోరఁగ రా
    ముని ఘాతమున మరణించెఁ బొలతిం(దిం)డి వనిన్
    పొలతిండి పొలదిండి ఏది సబబైతే అది తీసుకొనమనుచు విన్నపమండి. ధన్యవాదములు

    మ॥ మునులట్టులను యజ్ఞ కార్యముల నిర్మూలమ్ముఁ గావించుచున్
    జనెడిన్ రాక్షస మూకలన్ దునుమ విశ్వామిత్రునిన్ రామునిన్
    గొని రమ్మంచును వేఁడనాతఁడ టులన్ గోరంగ నుత్కృష్ట రా
    ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో

    రిప్లయితొలగించండి

  10. కనువిందైన మృగమ్మది
    దనుజుండని యెరుగనట్టి తరుణియె కోరన్
    వెనుచరచుచు నా రఘురా
    ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్.


    కనువిందైన సువర్ణ వర్ణమృగమున్ గాంచంగనే ప్రీతితో
    వనితాశింపగ తెత్తునంచు కదిలెన్ బాణమ్ములున్ విల్లుతో
    ఘనుడా భండన భీముడెర్రి పయినన్ గాండమ్మునే వేయ రా
    ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో.

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. మునివర్యులయజ్ఞములన్
      వినాశమొనరింప జేయు విఖురుని పైనన్
      దన శరములు విడువగ రా
      ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్

      మునివర్యుల్ తలపెట్టు యజ్ఞములపై మూకుమ్మడిన్ దాడితో
      తనరారే నరవిష్వనుల్నడచగా తానేగె శ్రీరాముడే
      తన వాలారు విహంగముల్ విడుచుచూ తాఁజూపెగాశక్తి రా
      ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో

      తొలగించండి
  12. తిన నిత్యంబొక బండెడన్నమును దృప్తిన్ దున్నలన్ మానవున్
    దన యాచారముగాఁజరించు బలిదైత్యక్రూరవృత్తాంతమున్
    విని తానేగియె గాలిపట్టి సలుపన్ బీభత్సయుద్ధంబు భీ
    ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో

    రిప్లయితొలగించండి
  13. ముని వెంటన్ జని యాగము
    మునుకొని నిర్వి ఘ్న ముగను పూర్తి యొనర్ప న్
    ధనువును సంధించి న రా
    ముని ఘాత మున మరణించె బొలతిండి వనిన్

    రిప్లయితొలగించండి
  14. జనకాత్మజ నేమార్చగ
    దనుజుండేతెంచె వనికి తంగపు మృగమై
    అనఘుడు జితవారిధి రా
    ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్

    రిప్లయితొలగించండి
  15. తినఁ దా నెవ్విధిఁ రాఁ గల
    డని వెస వాతాపి జీర్ణ మనుచు విసరఁగా
    మినుకుల శస్త్ర మగస్త్యుఁడు
    ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్


    వనవాసాంతర కాల మందుఁ జరియింపం బాండవానేక మా
    ర్తిని భార్యా సహితమ్ము వారల నహో తీవ్రంబుగా మార్కొనన్
    ఘన దోర్దండు సహస్ర గంధ కరి సంకాశోగ్ర తేజస్వి భీ
    ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో

    రిప్లయితొలగించండి
  16. పనిగొని యాగము యొద్దకు
    తునకలుగాఁజేయనెంచి దురితముఁజేయన్
    కినుకను నొందిన యారా
    ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్.

    రిప్లయితొలగించండి
  17. వినుమా యీయది యాగనాశమును వేవేగంబచేయంగ.రా
    ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలోఁ
    బనిగానష్టముఁజేయువారలకు నావాణీశు శిక్షించుగా
    కనువిందౌపను లెన్నియైన నిడు నోకాంతా! సమీక్షించుమా

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పనిచెను మునితో రాముని
    వనమున యజ్ఞమ్ముఁ గాచు పనియున్నదనన్
    కనిపించగ దనుజుడు రా
    ముని ఘాతమున మరణించెఁ బొలతిండి
    వనిన్.

    రిప్లయితొలగించండి
  19. వనమున క్రతువునుకావగ
    మునిగాధేయుడుపిలువగమోదముతోడన్
    మునివెంటచనిన యారా
    మునిఘాతమున మరణించె బొలతిండి వనిన్

    రిప్లయితొలగించండి