14-7-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ”
(లేదా...)
“భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
సుమతిసద్గుణసంపన్న సుదతియౌచునాథునంతటదైవంబుననుచుదలచెకులటపొందునుగూర్చంగకోరెనతడుపతినిసేవించుపతిబొందుబాధలెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వర్తనసాధ్వియౌవనితపార్వతియుండెగవల్లకాటిలోనర్తనమాడిశివుడునాతినిగంగనుదాల్చెనెత్తిపైకర్తగయుండిసృష్టికినికల్లగనుండుగబ్రహ్మరూపమేభర్తకుసేవజేసిననుభార్యకుదక్కునుకస్టనష్టముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణభంగం. "నర్తనమాడి శంకరుడు నాతిని..." అందామా?
చూసుకోలేదుపొరపాటైనదిక్షమించగలరు
కర్తగయుండివాణికిని
తే॥ స్రష్ట కూర్చిన వింతను దుష్టఁడైనపతిని సేవించు సతి పొందు బాధలెన్నొధర్మమార్గము వీడక ధాత్రియందుఁబరఁగు పతిభక్తి పూరిత పరమ సాధ్విఉ॥ పూర్తిగ మద్యపానమునఁ బోడిమిఁ గాంచుచుఁ దాను బాధ్యతాస్ఫూర్తిని వీడి వర్తిలుచుఁ బోరుచు నిత్యము సాగునోగు సద్వర్తన శూన్యమై చనఁగ దారయె యింటినిఁ జక్కఁబెట్టుచున్భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును గష్టనష్టముల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తల్లి దండ్రుల నెదిరించి తనమనసుకునచ్చెననుచు పెండ్లాడిన నాథునకటయంటు వ్యాధియె సోకిన యదను నట్టి పతిని సేవించు సతిపొందు బాధ లెన్నొ.పొరుగు వారి కోడి నొకటి మ్రుచ్చులించివాసిగ మసాల దట్టించి వండి యట్టికుండ నిండార యున్నట్టి కూరు తెందెప తిని సేవించు సతిపొందు బాధలెన్నొ(తెందెప = అధికము)
మీ మొదటి పూరణ బాగున్నది. రెండవ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
ధూర్తగుణమ్మునే కలిగి తొయ్యలి యొక్కతె తాను మేటియౌ నర్తకి నంచు చెప్పుకుని నర్మఠు డంచు నెఱంగి వెంటనే భర్తను వీడివాసిగను భాగ్యమొసంగునటంచు నెంచి భూ భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తేటగీతిగరళగళుఁడు గజాసుర గర్భముఁ జనబ్రహ్మవిష్ణుల శరణనె పర్వత సుతయటుల భక్త పరాధీనుఁడయ్యెడు పశుపతిని సేవించు సతి పొందు బాధలెన్నొ!ఉత్పలమాలఆర్తిగ వేడెనంచొగి గజాసుర గర్భము సేర నీశుఁడున్నర్తకునొంద శాంకరి జనార్దను, బ్రహ్మల వేడె, ముక్తుఁడైవర్తిలి ద్వారపాలకుని పార్వతినందను ద్రుంచె తిక్కడౌభర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
🙏 ధన్యోస్మి గురుదేవా!🙏
వేంకట గిరికేగి యచట వేంకటేశస్వామినిగని తిరిగి వచ్చు సమయమందుదారి పొడుగున త్రాగెడు త్రాగుబోతుపతిని సేవించు సతి పొందు బాధలెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వేంకటేశ స్వామి' అన్నపుడు 'శ' గురువై గణభంగం.
🙏
కార్తిక మాసమందు శుభకారక పూజల నెన్ని చేసినన్ ధార్తవరక్షమాగుణ, నితాంతకృపామతి, సాధ్వియైన, దుర్వర్తను, డాత్మవంచకుడు పందయు శీలవిశంకితుండునౌ భర్తకు, సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
భర్తలకు సేవనిడ పతివ్రత లనబడురోగి యైనట్టి పతిసేవలో తరించనెంచి మిగుల బాధలనుభవించె సుమతిపతిని సేవించు సతి పొందు బాధలెన్నొవర్తనమేకదా మహిని పత్నికి కీర్తిని తెచ్చిపెట్టగాభర్తయె ధూర్తుడైన సతి బాధల చిక్కుట శక్యమేకదాభర్త సమర్థుడైన సతి బాధల పాలిట చిక్కకుండునాభర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
ధన్యవాదాలు గురూజీ 🙏
పతిని దైవమ్ము గా నెంచు పరమ సాధ్వి యంతు లేనట్టి రోగాన నల మ టించు నతని బాగుకై శ్రమియించు నామె గనినపతిని సేవించు సతి పొందు బాధ లెన్నొ
వ్యసనపరుఁడును జూదరి పరసతులను వాంఛ జేసెడి చెనటియౌ భర్త పొందునరకతుల్యము సతులకు నరయ నట్టి పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ
ధూర్తుఁడు జూదగాఁడు కడు దుర్నయచిత్తుఁడు త్రాగుబోతునౌభర్తకు సేవచేయుటన బాముకు పాలను బోసినట్లు దుర్వర్తనుడైన పెన్మిటియె భారము భూమికి దుర్వినీతుఁడౌభర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
ఎన్ని పొగడఁ దగు గుణము లున్న నేమి లొంగి వ్యసనములకుఁ గడు క్రుంగి పనుల మాని సంచరించెడు ధనహీనుఁ డైన పతిని సేవించు సతి పొందు బాధ లెన్నొ ఓర్తి విదర్భ రాజ సుత యుంచె మదిం బతి నిశ్చయమ్ముగా నార్తి నిజేశు సేవల ధరాత్మజ నిల్చె సతమ్ము త్రేతలో వర్తిలె భర్తృ సేవలను బన్నుగ ద్రోవది ద్వాపరమ్మునన్ భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్ట నష్టముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే.గీ:ఇల్లు పట్టదు,కవితల నల్లుచుండు,నెపుడు పలుకరించ సమస్య నేదొ పట్టి"ఆగు" మనుచుండు,పిల్లల నాలి గననిపతిని సేవించు సతి పొందు బాధలెన్నొ(మన లాగా కవిత్వాన్ని,సమస్యాపూరణలు వగైరా చేసే వాళ్ల తో భార్యలు పడే బాథ.)
ఉ:భర్తగ సాయ మీయడుగ వంటను ,పిల్లల బస్సు వచ్చు నంచార్తిగ తొందరన్ బడగ నచ్చట సాయము లేదు ,దేవతామూర్తి వలెన్ నిలంబడును,మోమును ద్రిప్పడు,జాలి లేని యీభర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
(3)ఉ:భర్తకు నీదు సేవలను, భక్తిని మెచ్చితి,జీవకోటికిన్హర్తగ నాదు ధర్మమిది, యడ్డుగ నిల్వకు సత్యవంతునిన్ భర్తగ నేల బొందితివి? భర్తయె శాశ్వత మంచు నమ్మి యాభర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్(అని యమధర్మరాజు సావిత్రి తో అన్నట్టు.)
త్రాగుడుకుబానిసగుచును తనువుచెడగచిల్లిగవ్వయు కూడను చేత లేకరుజలపుట్టగమారినరోషపడక*“పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ”*పూర్తిగ మత్తులో బడుచు మోహమువీడక త్రాగుచున్ సదాధూర్తుడు గాను కొట్టుచును దుష్టులతోడనుసఖ్యమొందుచున్నార్తినికూర్చుచున్ననునహమ్మును రాత్రియు నిద్రమానియాభర్తకుసేవజేసిననుభార్యకుదక్కునుకష్టనష్టముల్
వ్యర్తము త్రాగు బోతునకు వ్యర్థముభార్యను గొట్టు వానికిన్ధూర్తుల మైత్రిజేసి కడు దోషపు కార్యమొనర్చువానికిన్కీర్తన జేసినన్ వినని కీచక మానస దుష్ట బుద్ధియౌభర్తకు సేవజేసినను భార్యకు దక్కునుకష్టనష్టముల్
మానవత్వంబు లేకను మసలు కొనుచుమంచి మర్యాద లెఱుగని మనసు కలిగి తనను గొట్టుచుఁదిట్టెడు త్రాగు బోతు పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ”
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్భర్తయె దైవమంచునిల భామినులందరు బోధసేయగా భర్తను గించజేయుచును బాలకు లిట్లుగ మాటలాడుటన్ ధూర్తుని లక్షణంబుగను దోచెను నాకది తప్పుసైచుడీ
ఆర్తిని ముంచు భర్తకు నహర్నిశలన్దెగ త్రాగు వానికిన్ధూర్తుల మైత్రిజేసి కడు దోషపు కార్యమొనర్చువానికిన్కీర్తన జేసినన్ వినని కీచక మానస దుష్ట బుద్ధియౌభర్తకు సేవజేసినను భార్యకు దక్కునుకష్టనష్టముల్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. మద్యమును గ్రోల నలవాటు పడినవాడుఅప్పులన్ జేసి పేకాట నాడుచుండితన కుటుంబమున్ పట్టించుకొనక యున్నపతిని సేవించు సతి పొందు బాధలెన్నొ.
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. అప్పులన్ జేసి పేకాట నాడుచుండితన కుటుంబమున్ పట్టించుకొనని వాడుతప్పు దారిలో నడచెడు త్రాగుబోతుపతిని సేవించు సతి పొందు బాధలెన్నొ.
సుమతిసద్గుణసంపన్న సుదతియౌచు
రిప్లయితొలగించండినాథునంతటదైవంబుననుచుదలచె
కులటపొందునుగూర్చంగకోరెనతడు
పతినిసేవించుపతిబొందుబాధలెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివర్తనసాధ్వియౌవనితపార్వతియుండెగవల్లకాటిలో
రిప్లయితొలగించండినర్తనమాడిశివుడునాతినిగంగనుదాల్చెనెత్తిపై
కర్తగయుండిసృష్టికినికల్లగనుండుగబ్రహ్మరూపమే
భర్తకుసేవజేసిననుభార్యకుదక్కునుకస్టనష్టముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "నర్తనమాడి శంకరుడు నాతిని..." అందామా?
చూసుకోలేదుపొరపాటైనదిక్షమించగలరు
తొలగించండికర్తగయుండివాణికిని
రిప్లయితొలగించండితే॥ స్రష్ట కూర్చిన వింతను దుష్టఁడైన
రిప్లయితొలగించండిపతిని సేవించు సతి పొందు బాధలెన్నొ
ధర్మమార్గము వీడక ధాత్రియందుఁ
బరఁగు పతిభక్తి పూరిత పరమ సాధ్వి
ఉ॥ పూర్తిగ మద్యపానమునఁ బోడిమిఁ గాంచుచుఁ దాను బాధ్యతా
స్ఫూర్తిని వీడి వర్తిలుచుఁ బోరుచు నిత్యము సాగునోగు స
ద్వర్తన శూన్యమై చనఁగ దారయె యింటినిఁ జక్కఁబెట్టుచున్
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును గష్టనష్టముల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితల్లి దండ్రుల నెదిరించి తనమనసుకు
రిప్లయితొలగించండినచ్చెననుచు పెండ్లాడిన నాథునకట
యంటు వ్యాధియె సోకిన యదను నట్టి
పతిని సేవించు సతిపొందు బాధ లెన్నొ.
పొరుగు వారి కోడి నొకటి మ్రుచ్చులించి
వాసిగ మసాల దట్టించి వండి యట్టి
కుండ నిండార యున్నట్టి కూరు తెందె
ప తిని సేవించు సతిపొందు బాధలెన్నొ
(తెందెప = అధికము)
మీ మొదటి పూరణ బాగున్నది. రెండవ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధూర్తగుణమ్మునే కలిగి తొయ్యలి యొక్కతె తాను మేటియౌ
రిప్లయితొలగించండినర్తకి నంచు చెప్పుకుని నర్మఠు డంచు నెఱంగి వెంటనే
భర్తను వీడివాసిగను భాగ్యమొసంగునటంచు నెంచి భూ
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిగరళగళుఁడు గజాసుర గర్భముఁ జన
బ్రహ్మవిష్ణుల శరణనె పర్వత సుత
యటుల భక్త పరాధీనుఁడయ్యెడు పశు
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ!
ఉత్పలమాల
ఆర్తిగ వేడెనంచొగి గజాసుర గర్భము సేర నీశుఁడున్
నర్తకునొంద శాంకరి జనార్దను, బ్రహ్మల వేడె, ముక్తుఁడై
వర్తిలి ద్వారపాలకుని పార్వతినందను ద్రుంచె తిక్కడౌ
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏 ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివేంకట గిరికేగి యచట వేంకటేశ
రిప్లయితొలగించండిస్వామినిగని తిరిగి వచ్చు సమయమందు
దారి పొడుగున త్రాగెడు త్రాగుబోతు
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వేంకటేశ స్వామి' అన్నపుడు 'శ' గురువై గణభంగం.
🙏
తొలగించండికార్తిక మాసమందు శుభకారక పూజల నెన్ని చేసినన్
రిప్లయితొలగించండిధార్తవరక్షమాగుణ, నితాంతకృపామతి, సాధ్వియైన, దు
ర్వర్తను, డాత్మవంచకుడు పందయు శీలవిశంకితుండునౌ
భర్తకు, సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభర్తలకు సేవనిడ పతివ్రత లనబడు
రిప్లయితొలగించండిరోగి యైనట్టి పతిసేవలో తరించ
నెంచి మిగుల బాధలనుభవించె సుమతి
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ
వర్తనమేకదా మహిని పత్నికి కీర్తిని తెచ్చిపెట్టగా
భర్తయె ధూర్తుడైన సతి బాధల చిక్కుట శక్యమేకదా
భర్త సమర్థుడైన సతి బాధల పాలిట చిక్కకుండునా
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపతిని దైవమ్ము గా నెంచు పరమ సాధ్వి
రిప్లయితొలగించండియంతు లేనట్టి రోగాన నల మ టించు
నతని బాగుకై శ్రమియించు నామె గనిన
పతిని సేవించు సతి పొందు బాధ లెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివ్యసనపరుఁడును జూదరి పరసతులను
రిప్లయితొలగించండివాంఛ జేసెడి చెనటియౌ భర్త పొందు
నరకతుల్యము సతులకు నరయ నట్టి
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధూర్తుఁడు జూదగాఁడు కడు దుర్నయచిత్తుఁడు త్రాగుబోతునౌ
రిప్లయితొలగించండిభర్తకు సేవచేయుటన బాముకు పాలను బోసినట్లు దు
ర్వర్తనుడైన పెన్మిటియె భారము భూమికి దుర్వినీతుఁడౌ
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఎన్ని పొగడఁ దగు గుణము లున్న నేమి
రిప్లయితొలగించండిలొంగి వ్యసనములకుఁ గడు క్రుంగి పనుల
మాని సంచరించెడు ధనహీనుఁ డైన
పతిని సేవించు సతి పొందు బాధ లెన్నొ
ఓర్తి విదర్భ రాజ సుత యుంచె మదిం బతి నిశ్చయమ్ముగా
నార్తి నిజేశు సేవల ధరాత్మజ నిల్చె సతమ్ము త్రేతలో
వర్తిలె భర్తృ సేవలను బన్నుగ ద్రోవది ద్వాపరమ్మునన్
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్ట నష్టముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ:ఇల్లు పట్టదు,కవితల నల్లుచుండు,
రిప్లయితొలగించండినెపుడు పలుకరించ సమస్య నేదొ పట్టి
"ఆగు" మనుచుండు,పిల్లల నాలి గనని
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ
(మన లాగా కవిత్వాన్ని,సమస్యాపూరణలు వగైరా చేసే వాళ్ల తో భార్యలు పడే బాథ.)
ఉ:భర్తగ సాయ మీయడుగ వంటను ,పిల్లల బస్సు వచ్చు నం
రిప్లయితొలగించండిచార్తిగ తొందరన్ బడగ నచ్చట సాయము లేదు ,దేవతా
మూర్తి వలెన్ నిలంబడును,మోమును ద్రిప్పడు,జాలి లేని యీ
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
(3)ఉ:భర్తకు నీదు సేవలను, భక్తిని మెచ్చితి,జీవకోటికిన్
రిప్లయితొలగించండిహర్తగ నాదు ధర్మమిది, యడ్డుగ నిల్వకు సత్యవంతునిన్
భర్తగ నేల బొందితివి? భర్తయె శాశ్వత మంచు నమ్మి యా
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
(అని యమధర్మరాజు సావిత్రి తో అన్నట్టు.)
త్రాగుడుకుబానిసగుచును తనువుచెడగ
రిప్లయితొలగించండిచిల్లిగవ్వయు కూడను చేత లేక
రుజలపుట్టగమారినరోషపడక
*“పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ”*
పూర్తిగ మత్తులో బడుచు మోహమువీడక త్రాగుచున్ సదా
ధూర్తుడు గాను కొట్టుచును దుష్టులతోడనుసఖ్యమొందుచున్
నార్తినికూర్చుచున్ననునహమ్మును రాత్రియు నిద్రమానియా
భర్తకుసేవజేసిననుభార్యకుదక్కునుకష్టనష్టముల్
వ్యర్తము త్రాగు బోతునకు వ్యర్థము
రిప్లయితొలగించండిభార్యను గొట్టు వానికిన్
ధూర్తుల మైత్రిజేసి కడు దోషపు కార్య
మొనర్చువానికిన్
కీర్తన జేసినన్ వినని కీచక మానస
దుష్ట బుద్ధియౌ
భర్తకు సేవజేసినను భార్యకు దక్కును
కష్టనష్టముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమానవత్వంబు లేకను మసలు కొనుచు
రిప్లయితొలగించండిమంచి మర్యాద లెఱుగని మనసు కలిగి
తనను గొట్టుచుఁదిట్టెడు త్రాగు బోతు
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ”
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్
రిప్లయితొలగించండిభర్తయె దైవమంచునిల భామినులందరు బోధసేయగా
భర్తను గించజేయుచును బాలకు లిట్లుగ మాటలాడుటన్
ధూర్తుని లక్షణంబుగను దోచెను నాకది తప్పుసైచుడీ
రిప్లయితొలగించండిఆర్తిని ముంచు భర్తకు నహర్నిశలన్
దెగ త్రాగు వానికిన్
ధూర్తుల మైత్రిజేసి కడు దోషపు కార్య
మొనర్చువానికిన్
కీర్తన జేసినన్ వినని కీచక మానస
దుష్ట బుద్ధియౌ
భర్తకు సేవజేసినను భార్యకు దక్కును
కష్టనష్టముల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
మద్యమును గ్రోల నలవాటు పడినవాడు
అప్పులన్ జేసి పేకాట నాడుచుండి
తన కుటుంబమున్ పట్టించుకొనక యున్న
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
అప్పులన్ జేసి పేకాట నాడుచుండి
తన కుటుంబమున్ పట్టించుకొనని వాడు
తప్పు దారిలో నడచెడు త్రాగుబోతు
పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ.