15, జులై 2024, సోమవారం

సమస్య - 4822

16-7-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అమ్మను సేవించువార లత్యంతఖలుల్”

(లేదా...)

“అమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

33 కామెంట్‌లు:

  1. కమ్మనిమాటలుచెప్పుచు
    సమ్మెటపోటులపనులనుసాగుచుతానే
    నమ్మకద్రోహమునుండుచు
    అమ్మనుసేవించువారలత్యంత ఖలుల్

    రిప్లయితొలగించండి

  2. నెమ్మిక విడి నిర్దయుడై
    యమ్మను వృద్ధాశ్రమమున కంపిన కమనుం
    డొమ్మిక గల గడనచెడియ
    యమ్మను సేవించువార లత్యంతఖలుల్.

    రిప్లయితొలగించండి
  3. అమ్మకు గౌరవ మీయక
    కమ్మని ప్రేమలను మాని కఠి నా త్ము o డై సమ్మతి గ జనియు నా దు
    ర్గ మ్మను సేవించు వార ల త్య o త ఖ లు ల్

    రిప్లయితొలగించండి
  4. కందం
    ఇమ్మహి పై సర్వులు సౌ
    ఖ్యమ్ముగ బ్రతుకంగ దుర్గ కర్చన శుభమౌ!
    యిమ్మనుచు దుష్ట శక్తుల
    నమ్మను సేవించువార లత్యంతఖలుల్!


    శార్దూలవిక్రీడితము
    అమ్మా! శాంభవి సర్వులున్ మనఁగ నీవాప్యాయతల్ పంచి సౌ
    ఖ్యమ్ముల్ సత్వరమే యొసంగుమనుచున్ గాంక్షింప పుణ్యంబగున్
    సొమ్ముల్ గోరుచు నన్యులన్ వెతలలో చూడంగ వెన్కాడకే
    యమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే!

    రిప్లయితొలగించండి
  5. ఇమ్ముగ పెంచిన మాతను
    నెమ్మిగ పూజించకుండ నేరపు బుద్ధిన్
    సొమ్ముల కొరకు కపటముగ
    నమ్మను సేవించువార లత్యంతఖలుల్

    రిప్లయితొలగించండి
  6. కం॥ అమ్మ ధరను దైవమనుచు
    నమ్మిన వాఁడను మనమున న్యాయమె సఖుఁడా
    యమ్మను దూషించ నిటుల
    నమ్మను సేవించు వారలత్యంత ఖలుల్

    (సమస్య స్త్రీ ఇచ్చి యుంటే 2వ పాదము చివర సఖియా అని పెట్టుకొనగలమండి)

    శా॥ అమ్మాయంచును బల్క మోదమగుఁ దానై సృష్టి సర్వేశుఁడే
    యమ్మన్ జేసెనొ దైవ మెల్లెడలఁ దానై యండఁ జాలండనిన్
    వమ్మేనో ధరనమ్మ ప్రేమ యిటులన్ బాపాత్ములై దూరగా
    నమ్మన్ భక్తిని సేవఁ జేయు జనులత్యంతాఘముల్ వొందరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం॥ అమ్మ ధరను దైవమనుచు
      నమ్మిన వాఁడను మనమున న్యాయమె సఖుఁడా
      యమ్మను దూషించ నిటుల
      నమ్మను సేవించు వారలత్యంత ఖలుల్

      (సమస్య స్త్రీ ఇచ్చి యుంటే 2వ పాదము చివర సఖియా అని పెట్టుకొనగలమండి)

      శా॥ అమ్మాయంచును బల్క మోదమగుఁ దానై సృష్టి సర్వేశుఁడే
      యమ్మన్ జేసెనొ దైవ మెల్లెడలఁ దానై యండఁ గానుండకే
      వమ్మేనో ధరనమ్మ ప్రేమ యిటులన్ బాపాత్ములై దూరగా
      నమ్మన్ భక్తిని సేవఁ జేయు జనులత్యంతాఘముల్ వొందరే

      శ్రీ కందిశంకరయ్య గారు సూచించిన సవరణల పిదప మార్చిన వృత్తము

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. అమ్మల దూఱుచు వీధుల
    గ్రుమ్మరు సోమరులతోడ కూళులవోలెన్
    దిమ్మరులై తిరుగుచు పె
    ద్దమ్మను సేవించువార లత్యంతఖలుల్

    (పెద్దమ్మ = జ్యేష్ఠాదేవి)

    రిప్లయితొలగించండి

  8. *(భరతుడు తల్లి కైకతో పలికిన మాటలుగా...)*

    అమ్మా! నీవిటులేలజేసితివి నాయన్నన్ వనంబంపగా
    సమ్మాదమ్మది నిన్నుజేరెగద నిన్ సంహారమున్ జేయ దో
    షమ్మేమాత్రము జేరదాయె నపకృష్టమ్మైన నీవంటి దౌ
    యమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యం తాఘముల్ వొందరే.?

    రిప్లయితొలగించండి
  9. ముమ్మారుల్ చని గంగ మున్గినను బో, ముక్కంటి యీశానులన్
    నెమ్మోవిన్ స్తుతులన్ భజించినను బో, నిత్యంబు దేవాళికిన్-
    నెమ్మిన్ బెట్టక ముద్ద నొక్కటియు మున్నీటన్ బడన్ వీడియే
    యమ్మన్, భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే

    రిప్లయితొలగించండి
  10. తిమ్మిని బమ్మిని చేయుచు
    సమ్మోదాతిశయమనుచు సంపూర్ణముగా
    నమ్ముచు జంతుబలులతో
    నమ్మను సేవించువార లత్యంతఖలుల్

    సమ్మోదాతిశయమ్ము కల్గుననుచున్ సన్మార్గమేవీడుచున్
    తిమ్మిన్ బమ్మినిచేయుచుందు రకటా దేవాంతకుల్ భూమిపై
    కొమ్ముల్ వాడిగ నున్న జంతు బలులన్ ఘోరంబుగా సల్పి యా
    యమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే

    రిప్లయితొలగించండి
  11. నమ్మకు మూఢుని పగిది భృ
    శమ్ముగఁ జింతించి పూజ సలుపుమ నరుఁడా
    యిమ్మహిని క్షుద్ర పూజల
    నమ్మను సేవించు వార లత్యంత ఖలుల్


    సొమ్ముల్ కొన్నిటిఁ బుచ్చుకొంచు నకటా క్షుద్రాశ పొంగారఁగన్
    సమ్మోహమ్ము సెలంగ డెందముల దుస్సాంగత్య మేపారఁగన్
    సమ్మానింపక విగ్రహమ్ములను మాత్సర్యంపు దుర్బుద్ధితో
    నమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యం తాఘముల్ వొందరే

    [అమ్మన్ = అమ్మఁగా]

    రిప్లయితొలగించండి
  12. అమ్మన్ దండ్రిని లక్ష్యవెట్టక ననాయాసంబుగా నింటిలో
    సొమ్ముల్ దోచుకుపోయి వారలకు సంక్షోభంబు చేకూర్చి సౌ
    ఖ్యమ్మున్ బొందగఁజూచు దుర్మతుల సంగాతమ్మునన్ గూడి పె
    ద్దమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే

    రిప్లయితొలగించండి
  13. కం:అమ్మకు,నాన్నకు చెడ వై
    రమ్మును బెంచుచు జనకుని ప్రత్యర్థిగనే
    యమ్మను మార్చుచు,కుటిలత
    నమ్మను సేవించువార లత్యంతఖలుల్”
    (కొన్ని కుటుంబాలలో అమ్మకి,నాన్నకి ఏదో వైరం రాగానే కొడుకులు సఖ్యం చెయ్యక అమ్మ పార్టీ లో చేరి నాన్నకి ప్రత్యర్థి గా చేస్తారు.)

    రిప్లయితొలగించండి
  14. శా:అమ్మన్ భ్రాతకు శత్రువం చెరుగగా నత్యుగ్రుడై పల్కె దుః
    ఖమ్మున్ బొందిన శాంతుడౌ భరతుడే కైకమ్మ తో నిట్లు " నీ
    చమ్మౌ నీ ముఖదర్శనమ్మును,దురాశన్ బొందు నీ వంటిదౌ
    నమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే !"

    రిప్లయితొలగించండి
  15. అమ్మకు తిండిని పెట్టక
    పొమ్మంచును వెడలుగొట్టు మూర్ఖులు పృధ్విన్
    నెమ్మిని మల్లెల నాదు
    ర్గమ్మను సేవించువార లత్యంతఖలుల్”

    రిప్లయితొలగించండి
  16. అమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే
    యమ్మా!యేమిది వైపరీత్యమిలలో నాకార మీయంగ నో
    యమ్మా!యెంతటి కష్ట మొందితివిలన్ హర్షాతి రేకంబుతోఁ
    గొమ్మా వందన మిప్పుఁడిత్తును వెసన్ గోటాను గోట్లుం రతిన్

    రిప్లయితొలగించండి
  17. డా బల్లూరి ఉమాదేవి

    నమ్ముడు ధన్యులు ధరలో
    *“నమ్మను సేవించువార ల,త్యంతఖలుల్”*
    సొమ్ములుపైకముదోచుచు
    అమ్మను వృద్ధాశ్రమములకంపెడివారే.


    సొమ్ముల్ గోరకనెల్లవేళ జననిన్ చొక్కంపు రాగంబుతో
    నెమ్మిన్ జూపుచుసాగువారలెకదానీధారుణీలోపలన్
    .*“అమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే”*
    సమ్మోదమ్మునపెంచినట్టిజననిన్ సాధించు సంతానమే


    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఇమ్మహిని సదా ధన్యులు
    అమ్మను సేవించువార; లత్యంత ఖలుల్
    సొమ్ములు కాజేసి పిదప
    నమ్మకముగ మోసగించు నక్క వినయులే.

    రిప్లయితొలగించండి