16, సెప్టెంబర్ 2024, సోమవారం

సమస్య - 4884

17-9-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో”
(లేదా...)
“నములన్ వద్దని చెప్పఁ గోపమున నిందావాక్యముల్ వల్కిరే”


15, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4883

16-9-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్”

(లేదా...)

“రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్”

14, సెప్టెంబర్ 2024, శనివారం

సమస్య - 4882

15-9-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ”
(లేదా...)
“పూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే”

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4881

14-9-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్”
(లేదా...)
“చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే”

12, సెప్టెంబర్ 2024, గురువారం

సమస్య - 4880

13-9-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె”
(లేదా...)
“త్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను సెల్లుఫోనహో”
(D.V. రామాచారి గారికి ధన్యవాదాలతో...)

11, సెప్టెంబర్ 2024, బుధవారం

సమస్య - 4879

12-9-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీరహితుఁడంచు వీనికిఁ జేసెద నతి”
(లేదా...)
“శ్రీరహితుండు వీఁడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్”

10, సెప్టెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4878

11-9-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్”
(లేదా...)
“మరలో నున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్”

9, సెప్టెంబర్ 2024, సోమవారం

సమస్య - 4877

10-9-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్”
(లేదా...)
“స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ”
(వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

8, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4876

9-9-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే”
(లేదా...)
“గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్”

7, సెప్టెంబర్ 2024, శనివారం

సమస్య - 4875

 8-9-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పొందు దక్కదు కోరిన మందునకును”

(లేదా...)

“పొందు లభింపదయ్యె సతి పొందును గోరిన మందబుద్ధికిన్”

6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4874

7-9-2024 (శనివారం)

కవిమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు!

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నాకు నచ్చనివాఁడు వినాయకుండు”

(లేదా...)

“నాకు వినాయకుండు గడు నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్”

5, సెప్టెంబర్ 2024, గురువారం

సమస్య - 4873

6-9-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అర్జును నిర్జించె శకుని యాహవమందున్”

(లేదా...)

“ఆహవమందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై”

4, సెప్టెంబర్ 2024, బుధవారం

సమస్య - 4872

5-9-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పద్యము శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్”

(ఛందోగోపనం)

(లేదా...)

“శైలీరమ్యత లేని పద్యమె మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్”

3, సెప్టెంబర్ 2024, మంగళవారం

దత్తపది - 210

4-9-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

కాక - తాత - పాప - మామ 

ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ

మహాభారతార్థంలో

తేటగీతి కాని చంపకమాల కాని వ్రాయండి.

2, సెప్టెంబర్ 2024, సోమవారం

సమస్య - 4871

3-9-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన”

(లేదా...)

“ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే”

1, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4870

2-9-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు”

(లేదా...)

“జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్”