21, సెప్టెంబర్ 2024, శనివారం

సమస్య - 4889

22-9-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కల్పన యటంచు భారతగాథ నంద్రు”

(లేదా...)

“కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారతగాథ చిత్రమే”

19 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      కలికి శశిరేఖ నభిమన్యుఁ గలుపు కతన
      వరుడులక్ష్మణాఖ్యుడు భంగపడినఘటన
      నా ఘటోత్కచు డలరించ నద్భుతముగ
      కల్పన యటంచు భారతగాథ నంద్రు

      ఉత్పలమాల
      గిల్పము తోడ నా శశిని గేలను మోసి ఘటోత్కచుండహో!
      మల్పును ద్రిప్పి గాథ యభిమణ్యుని జేర్చియు లక్ష్మణాఖ్యునిన్
      నిల్పుచు భంగపాటుఁగన! నేయఁగ 'మాయబజారు' పేరిటన్
      కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారతగాథ! చిత్రమే!

      (మాయబజారు చిత్రములో కల్పించిన మాట 'గిల్పము' తల్పమను భావనతో)

      తొలగించండి
  2. తే.గీ:సహజకవచకుండలములన్ జన్మ మేమి?
    కుండ లో మనుజుడు జన్మ గొనుట యేమి?
    ముఖ్యకథతో చమత్కార ములను గూర్చు
    “కల్పన యటంచు భారతగాథ నంద్రు”*
    (భారత రామాయణాలు ప్రత్యక్షరసత్యాలు కావు.కొన్ని అసహజ మైన కల్పన లుంటాయి.)

    రిప్లయితొలగించండి
  3. ఉ:శిల్పము గొప్పదై,శ్రుతులు జెప్పిన ధర్మము బ్రోది జేసి యే
    యల్పుని కైన, విజ్ఞునకు నైన రుచించెడు రీతి దెల్పుచున్
    పొల్పు వహింప జేసి కథ ముచ్చట గొల్పగ జేయు నందమౌ
    కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారతగాథ చిత్రమే

    రిప్లయితొలగించండి
  4. తన మనుమల నడుమగల తగవునెంచి
    యందు యవతారమూర్తియౌ యహిరిపువును
    సూత్రధారిగ కూర్చిన చోద్యమైన
    కల్పన యటంచు భారతగాథ నంద్రు

    రిప్లయితొలగించండి
  5. తే॥ కల్పన యటంచు భారత గాథనంద్రు
    హేతువాదులు, తెలుపు విహితము నరసి
    శాస్త్రమెపుడు శోధనఁగని సత్యమొకటె
    నమ్మఁ దగు మాదు పలుకుల నమ్ముమంచు


    ఉ॥ సల్పుచు శోధనల్ ఘనులు శాస్త్రము నస్త్రము గాను మల్చుచున్
    మెల్పును బొంది మోదముగ మిక్కిలి శ్రద్ధగఁ గాంచి నిక్కమున్
    దెల్పఁగ హేతువాదమునఁ దెల్లముగాఁనటు తోఁచె నిట్టులన్
    గల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారత గాథ చిత్రమే!

    రిప్లయితొలగించండి
  6. పంచమమ్మగువేదమే భారతమన
    అల్ప బుద్ధి గలిగినట్టి యధమ జనులు
    *“కల్పన యటంచు భారతగాథ నంద్రు”*
    నదియు వారల మూర్ఖత్వమౌను గాదె



    రిప్లయితొలగించండి
  7. హేయమనుచునువాదింత్రు హెచ్చుగాను
    ప్రాచ్యదేశాలుచాలను భవ్యకథను
    కాదుననుచుజరుగలేదు ఖచ్చితముగ
    కల్పనయటంచుభారత గాథనంద్రు

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి:
    అల్పమగు వారి గ్రంథములందుఁ జూడ
    నొక్క నాధారముండదు వాక్కు తప్ప
    ఋజువులెన్నియున్నను గాని నిజము కాదు
    కల్పన యటంచు భారతగాథ నంద్రు!

    రిప్లయితొలగించండి
  9. వేల్పుల వేషగాడితడు వీనికినిచ్చిన కర్ణపాత్రనే,
    యల్పము గాడె ప్రేక్షకచయంబునకంచు దలంచి సత్యమున్
    దెల్పక కర్ణు గారవము తీవ్రముఁ జేయుచుఁ జూపినంతటన్
    కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారతగాథ చిత్రమే!!

    రిప్లయితొలగించండి
  10. వ్యాసముని విరచిత యితిహాసమంద్రు
    బాదరాయణ పంచమ వేదమంద్రు
    కల్పకముఁ బోలు కావ్యమనల్ప శిల్ప
    కల్పన యటంచు భారతగాథ నంద్రు

    కల్పితగాథయా? సుకవి కాంచి వెలార్చినదౌ చరిత్రమా?
    కల్పకమే! మహీతలము గర్వమునొందెడు కావ్యరాజమే!
    శిల్పమనల్పమై తనరు చిత్రము పోల్చగలేని కావ్య సం
    కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారతగాథ! చిత్రమే!

    [చిత్రము = మనోహరము]

    రిప్లయితొలగించండి
  11. దైవ శక్తిని నమ్మెడు ధర్మ విదులు
    విశ్వ సింతురు పంచమ వేద మనుచు
    కల్పన యటంచు భారత గాధ నంద్రు
    మొండి వాదన జేసెడు మూర్ఖ జనులు

    రిప్లయితొలగించండి
  12. నిల్పగ ధర్మమీ యవని నిశ్చయ చిత్తముతోడ వ్యాసుఁడే
    పొల్పుగ వ్రాసి భారతము మోదము గూర్చఁగ దుర్విదగ్ధులౌ
    యల్పులు నాల్గువేదములయందలి సారముఁ నాకతాయిలై
    కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారతగాథ చిత్రమే

    రిప్లయితొలగించండి
  13. ధర్మసూక్ష్మములందలి మర్మములను
    పొల్పుగా జనపాళికిఁ దెల్పునట్టి
    వేదసారము, తొలగించు ఖేదములను
    కల్పన యటంచు భారతగాథ నంద్రు

    రిప్లయితొలగించండి
  14. అబ్బురమ్ములు మేదిని నమరు లుంట
    యింద్రుఁ డేడ కవ్వడి కఁట యెట్లు తండ్రి
    గాలి యముని నశ్వినులను గాంచు టెట్లు
    కల్పన యటంచు భారత గాథ నంద్రు


    అల్ప మనంగ రాని విధ మచ్యుతుఁ డింపుగ నాత్మలోన సం
    కల్పము నూనె భూభరము కయ్యము నందు నడంప భోగి రా
    ట్తల్ప విరాజమాన గిరిధారి నితాంత జగద్విరాట్బృహ
    త్కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారత గాథ చిత్రమే

    రిప్లయితొలగించండి
  15. వేదములలోన యైదవ వేదముగను
    ఋషిగణంబులే పలుచోట్ల విశద పఱచ
    కల్పన యటంచు భారతగాథ నంద్రు
    ననుట మూర్ఖత్వ మగుటయే యార్య! యదియ

    రిప్లయితొలగించండి
  16. కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారతగాథ చిత్రమే
    యల్పుల మాటలే యవియ యార్యుల మాటలు సాక్షి భూతముల్
    కల్పము లున్నరోజులును గావ్యపు జీవనమెప్పుడుండునే
    బల్పున మాట్లగాఁదలచి భావనఁజేయక నూరకుండుడీ

    రిప్లయితొలగించండి