23, సెప్టెంబర్ 2024, సోమవారం

సమస్య - 4891

24-9-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఓడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే”

(లేదా...)

“ఓడిన వైరిఁ గాంచి భయమొందెను గెల్చినవాఁడు వింతగన్”

25 కామెంట్‌లు:

  1. నాడు మనిన యెన్నికలో
    ఓడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే,
    వాడిక తనపై మెండుగ
    చాడీలను నుడువుచుండు జగతిన యనుచున్

    రిప్లయితొలగించండి
  2. కం॥ ఆడుచు మాయా జూదము
    నోడించఁగఁ బాండుసుతుఁడ నూగు దహరుఁడే
    చూడఁగఁ బ్రతినలు సేయఁగ
    నోడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే

    ఉ॥ ఆడుచు జూదమా పగటు నంతగ మోసముఁ జేయఁ గుట్రతో
    నోటమి పొంద ధర్మజుఁడు నోరిమిఁ గాంచక భీముఁడుగ్రుఁడై
    చూడఁగఁ బంతమున్ బడసి సూడుగొనానల జేయఁ గింకతో
    నోడిన వైరిఁ గాంచి భయమొందెను గెల్చిన వాఁడ వింతగన్

    దహరుడు అనుజుడు పగటు ద్వేషము విధము సూడుగొను ఈసడించు (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  3. వాడొక దుండగుఁ డెప్పుఁడు
    వీడక సహజాత నేడిపించగ వానిన్
    గాఢముగా మార్కొని తా
    నోడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే

    రిప్లయితొలగించండి
  4. వాడొక దుండగీఁడు ప్రతివారలతో తగువాడునూరకే
    కూడని మాటలాడి కడు కొందలమొందఁగజేయ సోదరిన్
    హేడజమొంది మార్కొనఁగ హేఠమునొందుచు మూర్ఛ వోవఁగా
    నోడిన వైరిఁ గాంచి భయమొందెను గెల్చినవాఁడు వింతగన్

    రిప్లయితొలగించండి

  5. గాడుపు చూలిని కట్టినఁ
    వీడెను బంధములని భయ విహ్వలుడాయెన్
    నాడచట మేఘనాధుడు
    ఓడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే

    గాడుపు చూలిచిక్కెనని గట్టిగ నమ్మిన మేఘనాధుడే
    వీడిన బంధముల్గని కపీంద్రుడు మిక్కిలి గొప్పవానిగా
    రూడిగ గుర్తెరింగె మదిలోని విచారము నిర్వచించగా
    నోడిన వైరిఁ గాంచి భయమొందెను గెల్చినవాఁడు వింతగన్

    రిప్లయితొలగించండి
  6. కూడెను సుందరాంగులను కోసెను కోతలు హెచ్చి యుత్తరుం
    డాడెను చెమ్మ చెక్కలను హాయిగ వామన గుంటలందునన్
    చేడియలన్ జయించి కురు సేనను మార్కొన, చిత్రసేనుచే
    నోడిన వైరిఁ గాంచి భయమొందెను గెల్చినవాఁడు వింతగన్!!

    రిప్లయితొలగించండి
  7. చూడ మటుమాయ మైనన్
    వాఁడి ములికులెల్ల నంత వర తూణములన్
    వేడబపుఁ గిరాతుని ముం
    దోడిన పగతునిఁ గని భయ మొందె విజయుఁడే


    ఓడిన నొక్క చోట విసు గొందక గెల్త్రు మఱొక్క చోట నం
    చోడ కెడందఁ బొందఁ గలఁ డొప్పుగ నెప్పుడు గొప్ప వాది నా
    నాఁడు మఱొక్క యున్నతపు న్యాయ మహాలయ మేఁగు నంచు వాఁ
    డోడిన, వైరిఁ గాంచి భయ మొందెను గెల్చినవాఁడు వింతగన్

    రిప్లయితొలగించండి
  8. కం:ఓడించితి మెన్నిక లో,
    తేడా స్వల్పమ్మె వీడు ద్రిమ్మరుచున్ మ
    మ్మోడించ బోవునో యని
    యోడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే”
    ( గెలిచినా మెజారిటీ తక్కువ ఐతే గెలిచిన వాడికి కొంత భయం ఉంటుంది.)

    రిప్లయితొలగించండి
  9. ఉ:ఓడిరి జూద మం దనుచు నూరట జెందక ,భావి నేదియో
    మూడు నటంచు దా సుతుల మూఢత నెంచుచు,ప్రేమ తోడ మా
    టాడి యొసంగె రాజ్యము నహా! ధృతరాష్ట్రుడు పాండవాళికే
    ఓడిన వైరిఁ గాంచి భయమొందెను గెల్చినవాఁడు వింతగన్”


    రిప్లయితొలగించండి
  10. తోడుగ నుండెడు మిత్రుం
    డా డుచు చదరంగ మందు నా తం డోడన్
    వాడిని గాంచియు న య్యె డ
    నోడిన పగతుని గని భయ మొందె విజయు డే

    రిప్లయితొలగించండి
  11. ఓడిన వాడే శత్రువు
    వాడే యెపుఁడెదురుచూచుఁ బనిపట్టుటకున్
    వీడడునెప్పటికి ననుచు
    నోడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే”

    రిప్లయితొలగించండి
  12. వాడొక మూర్ఖుడే యరయ భావనఁజేయడు మానసంబునన్
    వీడడు వాడు తప్పకను వేదన జేయును భావినంచుఁ దా
    నోడిన వైరిఁ గాంచి భయమొందెను గెల్చినవాఁడు వింతగన్
    వీడును వాడు బంధువులు వేఱుగ జూడక యుంట మంచియౌ

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆడుచు నుండగ నిరువురు
    వాడిగ దెబ్బ తగల నొక ప్రత్యర్ధునికిన్
    ఓడగ రుధిరము నచ్చట
    నోడిన పగతుని గని భయమొందె విజయుడే.

    రిప్లయితొలగించండి
  14. ఆడుచు తిరిగెడు వేళల
    పోడిమి తగ్గగ సఖుడట బోర్లా పడగన్
    దాడిని చేసిన వాడా
    *“ఓడిన పగతునిఁ గని భయమొందె విజయుఁడే

    రిప్లయితొలగించండి