27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4895

28-9-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కూసెఁ గావు కావుమనుచుఁ గోకిలమ్మ”

(లేదా...)

“కోకిల కావు కావు మని కూసె రసజ్ఞులు మోదమందఁగన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

10 కామెంట్‌లు:

  1. వారి ప్రతినిధిగ జనులు పదవినొసగి
    చట్టములను రచించెడి సభకుబంప
    బూతుమాటలు పలుకుట బొడగనంగ
    కూసెఁ గావు కావుమనుచుఁ గోకిలమ్మ

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    గాన'కోకిల' బిరుదమై కలికి మెరసె
    చెలఁగి భక్తి వైరాగ్యంపు చిత్రమందు
    శౌరి వేడుచు నార్తి సుస్వరములొల్కఁ
    గూసెఁ 'గావు' 'కావు'మనుచుఁ గోకిలమ్మ!

    ఉత్పలమాల
    వేకువ సుప్రభాతములు వెన్నెలరేయి వియోగ గీతముల్
    దాక మనంబులన్ బలుక ధన్యతఁ బిల్చగ గాన'కోకిలై'
    చేకురె గాయనీ మణిగ, శ్రీహరి వేడుచు సుస్వరమ్ములన్
    'కోకిల', 'కావు' 'కావు' మని కూసె రసజ్ఞులు మోదమందఁగన్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. రక్షకులు లేక యొంటరి రమణి భీత
      చిత్త చిక్కి మార్గమున నిశీథ మందు
      నళిన నేత్ర యత్తఱిని సన్నని యెలుఁగునఁ
      గూసెఁ గావు కావు మనుచుఁ గోకిలమ్మ


      మా కుల మెల్ల వర్ధిలఁగ మానవ! నీ దయఁ జూపి నిత్యమున్
      వీఁక వహించి పాడఁగను వీనుల విందుగ మెత్తు రింపుగా
      లోకులు నాదు పాటలను రుచ్యము లౌ నిల రిత్త లెన్నఁడేఁ
      గోకిల కావు కావు మని కూసె రసజ్ఞులు మోద మందఁగన్

      [కావు = కాఁ జాలవు; కావు మని = కాపాడు మని]

      తొలగించండి
  4. తే॥ కాకినిఁ బొగడ గానము కడు మధురమ
    టంచు సర్వులు పికపు కంఠ మధురిమయు
    నచ్చకను గొంతు మార్చుచు మెచ్చ జనులు
    కూసెఁ గావు కావుమనుచుఁ గోకిలమ్మ

    ఉ॥ కాకిని మెచ్చు లోకమున గానము కమ్మన యంచు సర్వులున్
    గోకిల గాన మాధురియు కొంతయు నచ్చని వారలై సదా
    ప్రాకటనమ్ముఁ గాకి కన భవ్యము గానటు గొంతు మార్చుచున్
    గోకిల కావుకావు మని కూసె రసజ్ఞులు మోదమందఁగన్

    ఏఎండ కాగొడుగు అను రీతిలో నండి

    రిప్లయితొలగించండి
  5. గూడు జేరియు కాకము గ్రుడ్డు పెట్ట
    పొదిగె తెలియక కోకిల పుట్టి యపుడు
    కూసె కావు కావు మనుచు కోకిల మ్మ
    ఖంగు దినియును వెరచె నా కాకి గాంచి

    రిప్లయితొలగించండి
  6. కోకను బట్టి లాగు తఱి కోమలి వేడెడి ఘట్టమద్దియే
    శోకము తోడ పాడుమని సూత్రముఁ జెప్పగ పాటకత్తెకున్
    గోకులనాథ!దేవ!హరి! కుయ్యని రాగము తోడ లీలగా
    కోకిల కావు కావు మని కూసె రసజ్ఞులు మోదమందఁగన్!!

    రిప్లయితొలగించండి
  7. వెడలిపోవఁగ నామని పిదపవచ్చె
    నుష్ణతాపము వ్యాపింప నుర్వియందు
    మండువేసవి దాహమ్ము మెండు గాఁగ
    కూసెఁ 'గావు కావు' మనుచుఁ గోకిలమ్మ

    రిప్లయితొలగించండి
  8. కోకిల మావి కొమ్మపయి కూజితముం బొనరించె నామనిన్
    వ్యాకులమొంద నెల్లరును వచ్చెను వేసవి భూతలంబునన్
    వ్రేఁకపు నుష్ణతాపమతి వేదన గూర్చఁగ దాహమోపకన్
    కోకిల 'కావు కావు' మని కూసె రసజ్ఞులు మోదమందఁగన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీమతి సరోజినీ నాయుడు రచించిన The Bird Sanctuary ఆధారంగా.....

    ప్రియ సరోజినీ నాయుడు పిలువబడును
    భరత కోకిలగా మన భారతమున
    పక్షితతి రక్షణముఁగోరు ప్రార్థనమున
    కూసెఁ 'గావు కావు'మనుచుఁ గోకిలమ్మ

    కోకిల పాడుచుండు గద కోమల గీతము లింపుగూర్చగా
    కోకిలఁ బోలునట్టి కవి కోకిల సల్పిన ప్రార్థనంబునన్
    వాకము లెల్ల రుచ్యములు భద్రత నిమ్మని వేడుచున్ భరత్
    కోకిల 'కావు కావు' మని కూసె రసజ్ఞులు మోదమందఁగన్

    [కావు కావు = రక్షింపుము రక్షింపుము]

    రిప్లయితొలగించండి