22, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4890

23-9-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మదగజయానకును రవిక మాత్రము చాలున్”

(లేదా...)

“మదగజయానకున్ రవిక మాత్రము చాలును జీర యేటికిన్”

(ప్రసిద్ధమైన పాత సమస్య)

15 కామెంట్‌లు:

  1. చదరంగపు బొమ్మలలో
    మదగజయానకును రవిక మాత్రము చాలున్,
    అదనముగ పెద్దదుండగ
    కదనమునందు విజయముకు కారణమగునే

    రిప్లయితొలగించండి
  2. భర్త తన సతీమణితో:

    కందం
    సుదతీమణి నీ సఖికిన్
    ముదమున వస్త్రాల నిడితె మొన్ననె పెండ్లిన్
    గద! నేడు గౌరవింపఁగ
    మదగజయానకును రవిక మాత్రము చాలున్!

    చంపకమాల
    ముదమున నింట పెండ్లియన మొన్ననె నీ సఖికిచ్చి వస్త్రముల్
    సదమల రీతి గౌరవము సల్పితె తప్పదు కాన నొప్పెడున్
    పిదపగ చూచిపోదమను బేరిట వచ్చిన నేడు కాన్కగన్
    మదగజయానకున్ రవిక మాత్రము చాలును జీర యేటికిన్?

    రిప్లయితొలగించండి
  3. ముదితకు చీర పైన నొక పువ్వుల రైక కొరంత యేర్పడెన్
    పదఁపడి వస్త్రశాలఁజన భర్త మనంబునదల్చె నివ్విధిన్
    ముదముగ మంచి చేలములు మూల్గుచునుండఁగ బీరువాలలో
    మదగజయానకున్ రవిక మాత్రము చాలును జీర యేటికిన్

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. కం॥ సదమల భావ తరంగము
      మదిని నిలుపుచు నభిలాష మసలఁగ వేడ్కల్
      ముదముగ వెన్నునికి సలుప
      మదగజయాననకు రవిక మాత్రము చాలున్

      చం॥ సదమల భావమొప్పఁగను సారసలోచన నేడి పించఁగన్
      బదములఁ బాడుచున్ జనుచుఁ బాటలగంధిది కొంటె చేష్టలన్
      ముదముగఁ జీరె దాఁచఁగను మోహన రూపుఁడు గోప బాలుఁడే
      మదగజయానకున్ రవిక మాత్రము చాలును జీర యేటికిన్

      పొరపాటున కందము 2వ పాదములో యతి దోషమైనందున మార్చినానండి. కన్నడ భాషలో యైతే ఈబాధ లేదండి

      తొలగించండి
  5. ముదముగ పువ్వుల రైకను
    మదవతిగొన వస్త్రశాల మగనితొ జనగన్
    పదఁపడి పతి వణిజునడిగె
    మదగజయానకును రవిక మాత్రము చాలున్

    రిప్లయితొలగించండి
  6. అదనపు వ్రయమే వలదిక
    తదనుగుణమ్ముగ కరదము తలచినచాలున్
    ముదితల పేరంటమునకు
    మదగజయానకును రవిక మాత్రము చాలున్

    ముదితల పేరటంబునకు ముచ్చట గొల్పెడు కాన్క లీయగా
    హృదయము నూలుకొల్పె మరి రిక్థము లేదని క్రుంగుచుండ జ
    న్మదుడుపదేశమిచ్చెనట మంగళ కార్యము నందు పంచగా
    మదగజ యానకున్ రవిక మాత్రము చాలును జీర యేటికిన్

    రిప్లయితొలగించండి
  7. సుదతికి గల దొక చీరయు
    వెదకియు సరి పోవు నట్టి విలు వైన ది యున్
    ముద మొ సగు మం చి రంగుల
    మద గజ యానకు ను రవిక మాత్రము చాలున్

    రిప్లయితొలగించండి
  8. కం:పది మార్లు చీర లిడితిమి,
    వదలక మీ చెల్లి వచ్చు ప్రతి పండుగకున్
    గద!వ్యయము పెరిగె నీ పరి
    మదగజయానకును రవిక మాత్రము చాలున్”
    (ఆడబడుచుకి ప్రతి సారీ చీర పెట్టటం కష్టం కనుక ఈ సారి జాకెట్ ముక్క తో సరిపెడదా మని ఒక భార్య భర్తతో అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  9. కదియఁ జలి కాల మిత్తఱి
    ముద మూనుచు సంచరింప భూజము లందున్
    వదలఁ జలి వెతలు కోఁతికి
    మదగజయానకును ఱవిక మాత్రము చాలున్


    పదపడి చీర లీయఁ దగుఁ బన్నుగ దక్షిణ లిచ్చి వేడ్కతో
    ముదము వహింతు రెల్ల పువుఁ బోడులు భూరి మహోత్సవమ్ములన్
    సుదతుల కెల్ల నొక్కొకటి చొప్పున దాన మొసంగ నిత్తఱిన్
    మదగజయానకున్ ఱవిక మాత్రము చాలును జీర యేటికిన్

    రిప్లయితొలగించండి
  10. చం:"వదలదు పాత చీరయును, భాగ్యము బండెడు,నేటి చీర నే
    వదల" నటంచు నా రజకభామిని యిట్లు దలంచె నీర్ష్యతో
    "మదగజయానకున్ రవిక మాత్రము చాలును, జీర యేటికిన్
    వదలక పట్టినన్ చిరిగి వ్రక్కలు కొట్టుక పోయె నందు లే!"

    (పాత చీర కూడా ఇవ్వని భాగ్యవంతురాలి మీద చాకలికి కోపం వచ్చి ఒక చీర కాజెయ్యటానికి ఇలా ఆలోచించింది.చీర యేట్లో కొట్టుకు పోయిందంటే సరిపోతుంది.పైగా అది చిరిగి కూడా పోయింది.కనుక దొరికినా లాభం లేదు అంటే సరి.)

    రిప్లయితొలగించండి
  11. మదనుని సామ్రాజ్యంబున
    సుదతుల వేషంబులరయ చోద్యంబయ్యెన్
    మదమున బొంగుచు మెలగీ
    మదగజయానకును రవిక మాత్రము చాలున్

    రిప్లయితొలగించండి
  12. సదనమునందున చీరలు
    ‌. సుదతికి కోకొల్లలుండ చూచన వెల్లన్
    మదికోరుటదేల వినుము
    మదగజయానకును రవిక మాత్రము చాలున్


    పదిలముగానుమూటలుగభద్రముచేయుచుదాచిపెట్టెలో
    సదనమునందుజూచుచునుసంతసమొందుచు క్రొత్త చీరలన్
    అదనముగానుకోరుకొనునాశయు వీడినమేలగున్ గదా
    *“మదగజయానకున్ రవిక మాత్రము చాలును జీర యేటికిన్”

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సుదతికి తీసిన చీరలు
    సదనమునన్ వందలుండె సంతసమె గదా
    అదనముగ చీరలేలను
    మదగజయానకును రవిక మాత్రము చాలున్.

    రిప్లయితొలగించండి