13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4881

14-9-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్”
(లేదా...)
“చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే”

27 కామెంట్‌లు:

  1. కందం
    నీలాకారుని మఱచిన
    బేలలు నది తానమాడ వేడ్క వివస్త్రల్
    లీలగ చేకొన వారల
    చేలంబుల, వానిఁ గాంచి సిగ్గిలి రతివల్

    శార్దూలవిక్రీడితము
    నీలాకారుడు లేనిచోటని వడిన్ నిండారు మోదంబునన్
    బేలల్ తానములన్ వివస్త్రలుగ గావించన్ దటాకంబునన్
    గాలాతీతుడు బాలకృష్ణుడచటన్ గైదాల్చఁగన్ వారివౌ
    చేలంబుల్! గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే!

    రిప్లయితొలగించండి

  2. నీలదొర కొలను జేరుచు
    నా లలనల నేడిపించె డాలోచనతో
    సాలము పై జేరి నడప
    చేలంబుల, వానిఁ గాంచి సిగ్గిలి రతివల్.


    లీలామానసమూర్తి లీలలనిలన్ లెక్కింపగా సాధ్యమే
    గోలల్ స్నానము నాడువేళ యటకున్ గోపాలు డేతెంచుచున్
    చైలమ్ముల్ హరియించి దాచినతరిన్ సాధ్వీమణుల్ వారివౌ
    చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే.

    రిప్లయితొలగించండి
  3. పాలున్ మీగడ మ్రుచ్చిలించెనట గోపాలుండు వ్రేపల్లెలో
    లీలామానుష విగ్రహుండు హరి తా లీలన్ ప్రదర్శించుచున్
    చేలంబుల్గొనిపోయి చెట్టుపయి నాసీనుండునై యుండగన్
    చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే

    రిప్లయితొలగించండి
  4. బాలము భరించ లేకనె
    వీలగు వాటికరయంగ బేహరి వానిన్
    వాలకమొందుచు వామన
    చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్

    రిప్లయితొలగించండి
  5. చేలంబులు లేని శుకుని
    వాలకము గనియును నోల వదలని వారల్
    బాలుని వెన్నడు వ్యాసుని
    చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్!
    (ఓల=జలక్రీడ)

    రిప్లయితొలగించండి
  6. కం॥ వేలంబందున చీరెలఁ
    జాలా వెచ్చించి ధనము స్పర్ధను బడుచున్
    వీలైనన్ని కొనుచునటు
    చేలంబుల వానిఁ గాంచి సిగ్గలిరతివల్

    శా॥ చాలా చీరెలఁ గోమలాంగులటులన్ సంప్రీతితోఁ బొందఁగన్
    మేలున్ గీడును గాంచఁ జాలకనటుల్ మెచ్చంగ నుద్యుక్తులై
    వేలంబందున మోదసంచితముతో విత్తమ్ము వెచ్చించఁగన్
    జేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే

    చీరలపైమక్కువ చూసి వాడు లోపల నవ్వుకున్నాడేమో ననియండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ కవితా ప్రసాద్ గారు సూచించిన గణదోషము సూచించిన పిదప తిద్దిన కందపద్యము

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. చేలంబులు ధరియింపని
    లీలామూర్తియగు శుకుని లెక్కింపక తా
    మాలక్షించిరి వ్యాసుని
    చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్

    చేలంబుల్ విడనాడి స్నానమొనరించేదేవ కాంతల్గనెన్
    జేలంబుల్ ధరియింపకే మసలుచున్ జీవించు పుణ్యాత్మునిన్
    లీలామానసమూర్తియౌ శుకమునిన్ లెక్కింపకే వ్యాసునిన్
    జేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే

    రిప్లయితొలగించండి
  8. చేలంబుల్ గడు నేయువారలము మాచేనేత మాహత్మ్యమౌ
    యాలోకించగ జూడలేవు మరి పాపాత్ముల నేత్రాలనన్!
    మాలోకంబగు రాజతండు తొడిగెన్ మత్తెక్కగన్! దేవతా
    చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే!!

    రిప్లయితొలగించండి
  9. లీలన్ గోకులమున గో
    పాలుఁడు గోపికల మేని వసనములను దా
    హేలగ మ్రుచ్చిలినంతన్
    చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్

    రిప్లయితొలగించండి
  10. కాలఘనశ్యాముఁ గనఁ గు
    చేలుం డురుదెంచిన సరసీరుహ నేత్రల్
    బాలార్క నిభుని నలిఁగిన
    చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్


    కాలాతీతముఁ గాంచ నట్టి నరునిం గందర్ప సంకాశునిన్
    బాలా దర్శన మాత్ర సంజనిత సంభ్రాంతత్రపాస్యాబ్జునిం
    లోలోద్వేగ నిమిత్త సంజనిత కల్లోలచ్యు తాచ్ఛాదముల్
    చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పో నెంచిరే

    రిప్లయితొలగించండి
  11. లీలగ కృష్ణుడు దొంగగ
    చేలము లన్ గొనియు దాను జెట్టున నుండన్
    బేలగ నాతని నయ్యె డ
    చేలo బుల వాని గాంచి సిగ్గి లి రతి వల్

    రిప్లయితొలగించండి
  12. చేలము లొడ్డున బెట్టఁగ
    బాలుఁడుదాకృష్ణుఁడపుడు బాహాటముగా
    లీలనుజేయఁగ నపుడా
    చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్

    రిప్లయితొలగించండి
  13. లీలామానుష విగ్రహుండగు హరిన్ లీలాయమానంబుగా
    మూలాగ్రంబున జూసిభామలు రహిన్ మోహంబు లీడేరఁదా
    చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పోనెంచిరే
    బాలుండయ్యును వారు సిగ్గిల కనన్ బాధాకరంబేసుమా

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    చేలములు విడిచి యందరు
    బేలలు స్నానమ్ముచేయు వేళను గని గో
    పాలుడు దొంగిలిడగ నా
    చేలంబుల, వాని గాంచి సిగ్గిలి రతివల్.

    రిప్లయితొలగించండి