10, సెప్టెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4878

11-9-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్”
(లేదా...)
“మరలో నున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్”

15 కామెంట్‌లు:

  1. సురలకు నరులకు వేలుపు
    నిరతము వైకుంఠమందు నిశ్చలమతియై
    హరికిన్ సతి తానయి తా
    మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్

    రిప్లయితొలగించండి

  2. ధరణీపూరపు సుతయై
    హరిడెందమునందు నిలిచె యనఘయె తానై
    సిరులనొసగు జననియె తా
    మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్.


    హరిడెందమ్మదె వాసమయ్యెనని విఖ్యాతమ్మునే పొందెనా
    ధరణీపూరపు నాత్మసంభవయె నిత్యానంద సంధాయినీ
    దరహాసమ్మొలికించెడాననముతో దాక్షిణ్యమున్ గల్గి తా
    మరలో నున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    వరలక్ష్మీనారాయణి
    సిరులందించెడు జననిగ శ్రీపురమందున్
    మెరిసెడు గుడి బంగరు తా
    మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్

    మత్తేభవిక్రీడితము
    హరిదేవేరియె కొల్వుఁదీరెనన నార్యా! లక్ష్మినారాయణీ
    స్మరణన్ సంపదలందుమానవులకున్ సద్భక్తి సేవింప, శ్రీ
    పురమన్ క్షేత్రమునందు బంగరు గుడిన్ బొల్పారుచున్ బైడి తా
    మరలో నున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్!

    రిప్లయితొలగించండి
  4. పరిణేత యింటనుండగ
    సరసన కూర్చుండి చేయు సల్లాపమునన్
    గరిమగ గెలిచితినను బ
    మ్మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్

    రిప్లయితొలగించండి
  5. పురమున గంటిని శిల్పము
    చెరువున నలరెడు కలువల చెంగట నెలమిన్
    బరిగొను సుందర విరితా
    మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్

    పరిపూర్ణమ్మగు నేర్పుతోడ శిలనే పద్మంబుగా చెక్కగా
    సురలోకమ్మును వీడి వచ్చెననగా సొంపారు సౌందర్యమే
    పరమానందము కూర్చు చుండె నచటన్ బ్రత్యేకమౌరీతి తా
    మరలో నున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. అరయుచు నిత్య మకట నీ
    వు రాక యున్న నెద లోనఁ బొగులుచుఁ గన వే
    లర నీదు రాకకై యర
    మర లోనం గలదు నాతి మాన్యతఁ గనుచున్


    అరవిందాంబక! దుష్ట తర్జితను బద్ధాత్మీయ కేశైక వ
    స్త్ర రమానాథ! దయారసాంబునిధి! సంరక్షింప వీక్షింపవే
    నరకప్రాయపు దుష్ట కౌరవ సభన్ నారాయణా! పూజి తా
    మర లోనున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్

    రిప్లయితొలగించండి
  7. హరికిన్ పాదములొత్తుచున్ జగములన్ హర్షంబు పొంగారగా
    సిరులన్ బంచుచునెల్లవారలకు సంక్షేమంబు దా గూర్చుచున్
    నిరతంబున్ తన భక్తకోటి మొరలన్ నెమ్మిన్ విచారింప తా
    మరలో నున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్

    రిప్లయితొలగించండి
  8. కం:దొరలకు శృంగారముతో
    మురిపెమ్ముల నిచ్చి మోహమున దేల్చంగా
    సిరి బొందుచు నూరికి పడ
    మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్”
    (జమీందార్లకి ఆనందం న్నిచ్చే ఒక స్త్రీ పడమటి వీధిలో ఉంది.ఆమెకి మాన్యత ఏమిటి? అంటే ఆమె సామాన్యుల వేశ్య కాదు.రాజాల వేశ్య కనుక.)

    రిప్లయితొలగించండి
  9. మురిపము లొల్కెడు రీతిగ
    తిరమగు నను రాగ వతిగ దివ్యత్వ ము గన్
    నిరతము మనుచు ను దా నర
    మర లోన న్ గలదు నాతి మాన్యత గనుచున్

    రిప్లయితొలగించండి
  10. మ:హరికిన్ రుక్మిణి ప్రేమలేఖ నిడి, హృద్యమ్మైన సౌశీల్యమున్,
    వరరూపమ్మును దృప్తి జెందు నటులన్ వర్ణించుచున్ జెప్ప భూ
    సురు డా పల్కుల విన్న కృష్ణు డెదతో జూచెన్, భళీ కన్ను దా
    మరలో నున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్
    (రుక్మిణి గుణగణాలని విప్రుడు వర్ణించగా హృదయం తో చూసిన కృష్ణునికి నేత్రపద్మం లో ఒక దివ్యస్త్రీరూపం కనుపించింది.)

    రిప్లయితొలగించండి
  11. మిత్రులు సందేహము నివృత్తి చేసిన పిమ్మట ఉదయము వ్రాసిన పద్యములండి

    కం॥ ధరలో సిరులను గూర్చును
    సురలోకమ్మున నుతులను శోభిలి తనరున్
    నెరనమ్మినఁ బ్రోవఁగఁ దా
    మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్

    మ॥ సిరియై శ్రీకర పత్నియై ధరణిలో శ్రేయంపు సంధాతయై
    వరమై సద్గతి మార్గమై సుజనులన్ బాలించెడిన్ మూర్తియై
    సురపూజానుత భ్రాతియై విమల సంశోభాకృతిన్ దాను తా
    మరలోనున్నది నాతి యోర్తు దివిషన్నాన్యప్రభావమ్ముతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగున్నవండి పూరణములు. వృత్తములోఁ గూడఁ "దాను దా
      మరలో నున్నది. సరళాదేశము. దివిషన్మాన్య - ముద్రాదోషము.

      తొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    హరి డెందమునందు నిలిచి
    నిరతము పూజించువారి నెమ్మిని గనుచున్
    సిరులనొసగు లక్ష్మియె తా
    మరలోనన్ గలదు నాతి మాన్యతఁ గనుచున్.

    రిప్లయితొలగించండి