28, సెప్టెంబర్ 2024, శనివారం

సమస్య - 4896

29-9-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తమ్ములఁ గని యీసుఁ జెందె దాశరథి వెసన్”

(లేదా...)

“తమ్ములఁ జూచుచున్ దశరథప్రథమాత్మజుఁ డీసుఁ జెందెరా”

9 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      అమ్మతనంబు మఱువ కై
      కమ్మను జంపుదనువేళ, నడవికరుగుటన్
      వమ్మొనర భరతు డాపఁగఁ
      దమ్ములఁ గని యీసుఁ జెందె దాశరథి వెసన్

      తొలగించండి
    2. ఉత్పలమాల
      అమ్మ తనంబునే మఱచి యాపుచు పట్టము కానకంప కై
      కమ్మను చంపివైతునని యాగ్రహమొందిన వేళ, మాటనే
      వమ్మొనరించుమన్ భరత వాక్యమునొప్పక సాగువేళలన్
      తమ్ములఁ జూచుచున్ దశరథప్రథమాత్మజుఁ డీసుఁ జెందెరా!

      తొలగించండి
  2. ఇమ్ముగ వశిష్టుడు దమకు
    నమ్ముల సంధించు విద్య నందించిననున్
    వమ్ము సలుపు చుండగ దన
    తమ్ములఁ గని యీసుఁ జెందె దాశరథి వెసన్

    రిప్లయితొలగించండి
  3. తమ్ముడు లక్ష్మణుఁ నాజిని
    యమ్ములుతో మేఘనాథు డటమట వెట్టన్
    తమ్ముని మేన శరాఘా
    తమ్ములఁ గని యీసుఁ జెందె దాశరథి వెసన్

    రిప్లయితొలగించండి
  4. చిమ్మగ ప్రేమ భావములు చెంతఁ గనంగను లేదు సీత శో
    కమ్మున మున్గి దాశరథి కన్నుల నీరము కార్చు చుండగా
    సమ్మగ భాస్కరుంగనుచు సారసముల్ ముదమొందుచుండునా
    తమ్ములఁ జూచుచున్ దశరథప్రథమాత్మజుఁ డీసుఁ జెందెరా!!

    రిప్లయితొలగించండి
  5. తమ్ముడు తనవెంట నిలువ
    నమ్ముని వెన్నడి తరలెను యజ్ఞము నరయన్
    పిమ్మట వినాశకర భూ
    తమ్ములఁ గని యీసుఁ జెందె దాశరథి వెసన్

    తమ్ముడు లక్ష్మణుండు తన ధర్మము తప్పక వెంట నుండగా
    నమ్మహి తాత్ముడే నడచె నాముని వెన్నడి యాగ రక్షకై
    పిమ్మట యజ్ఞనాశనము భీకరరీతిని సల్పుచున్న భూ
    తమ్ములఁ జూచుచున్ దశరథప్రథమాత్మజుఁ డీసుఁ జెందెరా

    [ఈసు = కోపము]

    రిప్లయితొలగించండి
  6. కమ్మని భావనలు గలిగి
    నమ్మక ముకు మారు రూపు నైతిక పరులై
    నెమ్మది గా వర్తించెడు
    తమ్ముల గని యీసు చెందె దాశరథి వెసన్

    రిప్లయితొలగించండి