8, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4876

9-9-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే”
(లేదా...)
“గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్”

18 కామెంట్‌లు:

  1. తే||గీ||
    నేటి పాఠము పూర్తిగ నేర్వకున్న
    బడితపూజ తప్పదనెడి పరుషమైన
    గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుము
    నే యని దలచి యందరు నేర్చిరపుడు

    రిప్లయితొలగించండి

  2. పరమాత్ముడు లేడనుచును
    పరమపదము మూఢులకని వచియించెడు బ
    ర్బరుడుపదేశి యయిన నా
    గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే.


    ధరణిని నాస్తికత్వమును దండడిగా పచరింపనెంచి సా
    వరముల నుగ్గడించి నిరుపాఖ్యుడు మిథ్యయటంచు చెప్పుచున్
    బరమపదమ్ము మోసమను వాడుప దేశికు డైన చోట నా
    గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్.

    రిప్లయితొలగించండి
  3. పాఠశాలలో పంతులు పాఠములను
    బోధజేయు, విద్యార్థల బుద్ధితోడ
    చదవుమని చెప్పునైనను మదినిగొనని
    గురువచనము శిష్యులకొనగూర్చునిడుము

    రిప్లయితొలగించండి
  4. కం॥ ధరణిని ధార్మిక ముసుగునఁ
    బరమత ద్వేషమును గరపి వరలి ధిషణతోఁ
    జరిపెడు బాషణ మందున
    గురువచనము శిష్యల కొనఁగూర్చు నిడుమునే!

    చం॥ ధరణిని నేఁడు కాంచఁగను ధార్మిక భావము నింపు సాకుతోఁ
    బరమత మన్న ద్వేషమును బట్టుగఁ బెంపును సేయు చుందురే
    మరువకు నాదు పల్కుమత మౌఢ్యము నేర్పుచునుండు జాలమౌ
    గురవచనంబు విన్న నొనఁగూడును గష్టము శిష్య పంక్తి కిన్

    జాలము వల

    రిప్లయితొలగించండి
  5. ఇరులను దొలగింతురు స
    ద్గురువులు తమ బోధనముల గూర్తురు యెఱుకన్
    మొరకులవలె వినకున్నను
    “గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే”

    రిప్లయితొలగించండి
  6. కందం
    దొరుకుననఁగ గురుదక్షిణ
    గురిగొని యంగుటము బొమ్మ గురుడందెనహో!
    జెఱచ విలుకాని, భేదపు
    గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే!

    చంపకమాల
    దొరుకగ శిష్యునంచు, మదిదోషమయంబుగ నేకలవ్యునిన్,
    గురిగొని యంగుటమ్మడిగె కోల్పడ బొమ్మగురుండు దక్షతన్!
    జెఱచు వివక్షతో నరుని శ్రేష్ఠత నెంచుచు, భేదభావనన్
    గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్!

    రిప్లయితొలగించండి
  7. గురుదక్షిణ చెల్లింపగ
    వెరవక ఖండించె యిచ్చె వ్రేలిని రయమున్
    గురువడుగ నేకలవ్యుడు
    గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే

    గురువుల మాటలే తరచు గుంభనమై పొలుపారుచుండుగా
    నిరతము వారిమాటవినఁ నిక్కము తిప్పలు తప్పబోవుగా
    గురువుగ ద్రోణుడే కొసరె కోడిగమొప్పగ నంగుళమ్మునే
    గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్

    రిప్లయితొలగించండి
  8. ఇరులనుబాపి సద్గురువులేర్పడ ఛాత్రుల సత్పథంబునం
    దరుగఁగజేయు మాన్యవరులా మహితాత్ముల బోధనమ్ములన్
    మరువకనాచరించదగు మానసమందునలక్ష్య భావనన్
    గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్

    రిప్లయితొలగించండి
  9. పరమార్థమ్ము వలుకు నవ
    సరమ్మున వచించి నట్టి సంయమి పలుకుల్
    కరము దురవగాహమ్ములు
    గురు వచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే


    సరళ విదూర శబ్ద చయ సంకుల వాక్యము క్లిష్ట భావమున్
    గురు వరుఁ డప్డు పల్కచు నకుంఠిత మియ్యది మీ కిఁకన్ నిరం
    తరమును సాధ నార్హమని తా వచియింపఁగ నేకధాటి నా
    గురు వచనంబు విన్న నొనఁగూడును గష్టము శిష్య పంక్తికిన్

    [గురు వచనము = భారమైన వచనము]

    రిప్లయితొలగించండి
  10. తిరమగు జ్ఞానము నీయక
    నరుదగు క్షుద్రంపు విద్య లనవ స రముగా
    నిరతము బోధించు కపట
    గురు వచనము శిష్యుల కొన గూర్చు నిడు ములనే

    రిప్లయితొలగించండి
  11. కం:సరియౌ తపమ్ము లేకయె
    యరకొరగా చదివి కీర్తి నందుట కై తెం
    పరి యై బోధించగ నా
    గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే”
    (సాధన లేకుండా కేవలం పుస్తకాలు చదివి మాట్లాడే గురువుల బోధ సమగ్రం కాదు.)

    రిప్లయితొలగించండి
  12. చం:సరళము వేమనార్య కవిసత్తము దౌ శతకమ్మె, పద్యముల్
    పరుష మటంద్రు,కావ్యముల పల్ వచనమ్ముల భాష జూడగా
    గురువర! నారికేళమును గొట్టి భుజించుట యట్టు లుండు నా
    గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్”
    (ఇక్కడ గురువచనం అంటే పెద్ద వచనము అని.వేమన వంటి వారి పద్యాలే తేలిక.కావ్యాలలో ఉండే పెద్ద పెద్ద వచనాలే కష్టం అని శిష్యుడు గురువు తో అంటున్నట్లు.)

    రిప్లయితొలగించండి
  13. వరమగునెప్పుడు మనకిల
    గురువచనము, శిష్యునకొనగూర్చు నిడుమునే
    పరిపరి విధముల తిట్టుచు
    పరిహాసమ్ములను చేయ ఫలితం బిదియే

    రిప్లయితొలగించండి
  14. వరదల ప్రాంతాన్నంతను
    బురదాదులను తొలగించి పుట్టెడు వెతలన్
    మరుగుపడజేయుడనే
    గురువచనము శిష్యులకొనగూర్చునిడుమనే

    (గురు వచనము= భారమైన పలుకులు)

    By వేదుల గణపతి రావు

    రిప్లయితొలగించండి
  15. నిరతముఁబనులను జెప్పుచు
    గరమును బీడించుచుండి కాఠిన్యముతోన్
    చురచుర లాడుచుఁబలికిన
    గురువచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే

    రిప్లయితొలగించండి
  16. పరుష దనంబుఁదోడపలుపల్కులు బల్కుచు నెల్లవారినిన్
    నిరతముబాధ వెట్టుచును నిమ్మకు నీరును బెట్టు వానిగా
    సరసపుమాటలాడుచును జక్కగ నేర్పుగఁబల్కుచుండు నా
    గురువచనంబు విన్న నొనఁగూడును కష్టము శిష్యపంక్తికిన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    గురువు ప్రతిమను ముందిడి
    నిరతము తాను విలువిద్య నేర్వగ తుదకా
    గురువే యంగుళి కోరెను
    గురు వచనము శిష్యుల కొనగూర్చు
    నిడుమునే.

    రిప్లయితొలగించండి