17, సెప్టెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4885

18-9-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విద్యావంతున కిడుమలు వేవేలు గదా”
(లేదా...)
“విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే”

20 కామెంట్‌లు:

  1. మద్యము మత్తున మునుగుచు
    పద్యమునొక్కటి యయినను భావముతోడన్
    హృద్యముగచెప్పలేనియ
    *“విద్యావంతున కిడుమలు వేవేలు గదా”*

    రిప్లయితొలగించండి
  2. హృద్యముగ దెలుగునందున
    పద్యము జెప్పుడని యడుగ వక్కాణించన్
    చోద్యముగ నోడిన మోసపు
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా

    రిప్లయితొలగించండి
  3. సద్యశమెక్కడనుండెను
    విద్యావంతులకిడుమలువేవేలుగదా
    హృద్యమునయ్యెగమనిషికి
    మద్యముడబ్బునుగలియుచుమంచినిపెంచన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    ఉద్యోగమ్మున, ప్రభువులు
    ఖాద్యముగ ప్రజల ధనమ్ము గతుకగ నెంచన్,
    మధ్యన బలియౌ యున్నత
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా!

    శార్దూలవిక్రీడితము
    ఖాద్యమ్మంచు ప్రజాధనమ్ము గతుకన్ గావించు ప్రేరేపణన్
    సాధ్యాసాధ్యములెంచకుండ ప్రభువున్ సంతోషపెట్టంగ వా
    రుద్యోగంపు నిబంధనల్ విడచి మాయోపాయముల్ పన్నెడున్
    విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే!

    రిప్లయితొలగించండి
  5. కం॥విద్యలఁ బడయుచుఁ గార్యము
    లుద్యోగమున నొనరించ నుత్సాహముతో
    నాద్యంతమన్నియు నిడరె
    విద్యావంతున కిడుములు వేవేలు గదా!

    శా॥ సద్యస్స్ఫూర్తినిఁ బొంది ప్రజ్ఞఁ గని యుత్సాహమ్ముతోఁ గార్యముల్
    సద్యన్ జాలఁగఁ బెక్కు కార్యములు దుస్సాధ్యమ్ములున్ బొందరే
    యుద్యోగమ్మునఁ స్వేదమెక్కువగుటే యోగంబు గానొప్పెడిన్
    విద్యావంతుడు సర్వకాలములఁ బ్రాప్తింబొందు కష్టమ్ములే!

    చాలు ముగించు ఓగం యడాగమముతో యోగం అండి అర్థము కూడా అదేనండి నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శా॥ 3వ పాదము ఉద్యోగమ్మున తరువాత అరసున్న లేదండి. పొరపాటున పెట్టినాను

      తొలగించండి

  6. వైద్యుం డాతం డుదయము
    మధ్యాహ్నమనక రసనము మాని జనులకున్
    వైద్యము జేయ గని తలచె
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా.


    విద్యాహీనులు కూడదంచు గద నేపెండ్లాడితిన్ మేటి యౌ
    వైద్యుండన్ గడు పేర్మితో నిరతమభ్యంతుండ్రనే గాంచ నా
    సధ్యాంచుండకు తీరికెక్కడిదటన్ సాదమ్ము బోసేయగా
    విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే.

    రిప్లయితొలగించండి
  7. విద్యయు వినయగుణమ్మును
    సద్యశమును గూర్చు మనుజ సంతతికిలలో
    చోద్యము కాదవినయుఁడగు
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా

    రిప్లయితొలగించండి
  8. విద్యయె వినయము నొసగును
    విద్యయె తెలియంగచెప్పు విషయమునెపుడున్
    విద్యన్ బడయని మాయా
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా

    ఉద్యోగించు ప్రవీణతే కలుగదా యుత్సాహముప్పొంగగన్
    విద్యావంతుఁడు నేర్వగల్గును గదా విస్పష్టమౌ రీతినిన్
    విద్యాగంధములేక మోసములతో వెల్గొందు మాయావియౌ
    విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే

    రిప్లయితొలగించండి
  9. విద్యల్ నేరిచినంత మాత్రముననే విజ్ఞానమార్జించినన్
    సద్యస్స్ఫూర్తిగ కార్యనిర్వహణమున్ శస్తంబుగా సల్పినన్
    మద్యంబందున మున్గిదేలి సతమున్మత్తంబునన్ గ్రాలుచో
    విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే

    రిప్లయితొలగించండి
  10. విద్యాభివృద్ధి కొఱకై
    వేద్యంబ ధనవ్యయమ్ము విద్యార్హంబౌ
    యుద్యోగం బార్జించుట
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా


    ఉద్యోగమ్ముల వంత వర్ధిలు నిరుద్యోగమ్ము నిర్వేదముల్
    సద్యోజాతము లై చెలంగుఁ దనరున్ సంతాపముల్ నిత్యమున్
    విద్యా హీనుఁడు దుష్టుఁ డేలు తఱి దుర్భేద్యమ్ముగా ధిఙ్మహా
    విద్యావంతుఁడు సర్వ కాలములఁ బ్రాప్తిం బొందుఁ గష్టమ్ములే

    రిప్లయితొలగించండి
  11. (1)కం:విద్యకు ధనమున్ బోసియు
    నుద్యోగపు రంథి తోడ నూళ్లు తిరుగ కీ
    మద్యము నమ్ముచు బతుకుము
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా”

    (2)శా:విద్యన్ నేర్వగ లక్షలన్ విసుగుచున్ పెద్దల్ సమర్పింప నా
    విద్యన్ బొందియు నేదొ యొక్క పనికై వేటాడ వర్ణమ్ములే
    విద్యోద్యోగము లందు నడ్డు పడుచున్ వేధించ మేధావి యౌ
    విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే”

    రిప్లయితొలగించండి
  12. విద్య లు నేర్వ లభించు ను
    సద్యశ మును జక్క నైన సౌభాగ్యంబు ల్
    మద్యము మత్తున బల్క కు
    విద్యా వంతు న కిడుమలు వేవేలు గదా

    రిప్లయితొలగించండి
  13. విద్యను నేర్చిన మనుజుఁడు
    విద్యార్ధులఁజేరదీసి విద్యను గఱపున్
    విద్యాబుద్ధులు లేనియ
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా

    రిప్లయితొలగించండి
  14. విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే
    విద్యావంతునిగూర్చియట్లుగననన్ వీర్యంబుగాఁదోచెనా?
    విద్యావాసన లేని మానవుఁడహో వేయేల తుల్యుండునై
    మద్యంద్రాగెడు ద్రాగు బోతుని వలెన్ మానంబు లేకుండుగా

    రిప్లయితొలగించండి
  15. విద్యాభ్యాసముసక్రమమ్ముగనవన్ వేగన్లభించున్ గదా
    సద్యః స్ఫూర్తినపొందుచున్ కొలువునన్ చక్కంగచేయన్తగున్
    మద్యమ్మున్ గొనుచున్సదామరచినన్ మానాభిమానంబు ని
    *“ర్విద్యావంతుఁడు సర్వకాలములఁ బ్రాప్తిం బొందు కష్టమ్ములే”*

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    విద్యల నెన్నియొ నేర్చిన
    విద్యకు తగు కొలువులేక వేదన చెందెన్
    బాధ్యతలు భారమాయెను
    విద్యావంతున కిడుమలు వేవేలు గదా!

    రిప్లయితొలగించండి