11, సెప్టెంబర్ 2024, బుధవారం

సమస్య - 4879

12-9-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీరహితుఁడంచు వీనికిఁ జేసెద నతి”
(లేదా...)
“శ్రీరహితుండు వీఁడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్”

19 కామెంట్‌లు:

  1. తేటగీతి
    విషము గక్కగ రారాజు, విజ్ఞుడగుచు
    ద్రౌపదినవమానము సేయ తగదటవ్న
    విని వృకోదరుండు వికర్ణు ననె, మనమున
    శ్రీరహితుఁడంచు వీనికిఁ జేసెద నతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      నేరిచి మాయలన్ శకుని నీచపు జూదము నందు ధర్మజున్
      దారుణ రీతినోర్చ సతి ద్రౌపది పైన విషమ్ము గ్రక్కుచున్
      జేరిచి రాజరాజు సభఁ జీరలనూడ్చ వికర్ణుఁడొప్పెనే?
      శ్రీరహితుండు వీఁడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్

      తొలగించండి
  2. దూరమైన దేవేరిని చేరనెంచి
    పరమ పదమును వీడిన బభ్రువతడు
    తిరుమల గిరిపైన కొలువై పరగు వాడు
    శ్రీరహితుఁడంచు వీనికిఁ జేసెద నతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా! నమస్కారము. తిరుమల శ్రీనివాసుడు శ్రీరహితుఁడా?

      తొలగించండి
    2. దూరము సాగెపద్మయని దుఃఖము తోవిడి విష్ణులోకమున్
      జేరెను పృథ్వినే కడకు శ్రీకరుడే యిల శ్రీనివాసుడై
      శ్రీరహితుండు వీఁడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్
      గోరిన వెల్లనిమ్మనుచు కొల్చెద నీతని నెల్లవేళలన్

      తొలగించండి
    3. అప్పు తెచ్చుకొన్న వాడు కనుక సంపద (శ్రీ) లేని వాడుగా భావన

      తొలగించండి
  3. చదువుకొన నెంచిననుగూడ చాలినంత
    శ్రీరహితుఁడంచు వీనికిఁ జేసెద నతి
    గ దయజూపుచు దానికి గావలసిన
    పుస్తకముల యేర్పాటును , ముదమునొంద

    రిప్లయితొలగించండి
  4. తే॥ ధరను సర్వులు ఘనసంపదలను బడయు
    తత్పరతను సిరికెపుడు దాసులౌచు
    బ్రదుకఁగను రంతిదేవుని పథముఁ దలచి
    శ్రీ రహితుఁడంచు వీనికిఁ జేసెద నతి

    ఉ॥ ధారుణి యందు సంపదలఁ దత్పరులై కన నెంతు రెల్లరున్
    శ్రీకిల దాసులై బ్రదుకు జీవుల రీతిని వీడి దానముల్
    ధారగఁ జేయుచున్ మిగుల ధన్యతఁ గాంచిన రంతిదేవునిన్
    శ్రీ రహితుండు వీడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్

    శ్రీ సంపద ఐశ్వర్యము ఈ అర్థము తీసుకున్నానండి

    రిప్లయితొలగించండి
  5. గళమున నపత్యశత్రువు కడలి వెన్న
    జూట మందున నిల్పుచు మోట బరియె
    వాహనముగను గలుగు త్రి పాత్తు కాడు
    శ్రీరహితుఁడంచు, వీనికిఁ జేసెద నతి.


    వారిజనేత్రి కృష్ణను వివస్త్రను జేయగ నెంచు పాళమున్
    వారికుచేష్టలన్ నిలుప వాదన చేయు వికర్ణు గాంచి కై
    వారమొసంగి భీముడనె పంచులు భ్రాతల లోన డెందమున్
    శ్రీరహితుండు వీఁడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్.

    రిప్లయితొలగించండి
  6. తే.గీ.॥
    గుణము మఖ్యము మనుజుకు ధనముకన్న
    పేదయైన సద్గుణముల పెన్నిధితఁడు
    పరులు కష్టించ నాకులపాటునొందు
    శ్రీరహితుఁడంచు వీనికిఁ జేసెద నతి

    ఉత్పలమాల:
    కోరికలన్న మానవుల కొందలపాటొనరించు శస్త్రముల్
    తీరినవెన్క వేరొకటి తీరికగా నరుదెంచు వీడకన్
    కోరికలన్ త్యజించి కడు కూరిమి పేదల యార్తిఁ దీర్చఁగన్
    శ్రీరహితుండు వీఁడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్

    రిప్లయితొలగించండి
  7. నర వరేణ్యుండు కరుణా వననిధి సద్వ్ర
    తుండు దాంతుండు విష్ణు భక్తుండు పరమ
    ధార్మి కోదార సన్నుత దాత కాదు
    శ్రీరహితుఁ డంచు వీనికిఁ జేసెద నతి


    వారము వారముం బుడమి వారక తా నవతార మెత్తుచున్
    ధారుణి ధర్మ రక్షణముఁ దప్పకొనర్చుచు నుండు నంచునున్
    నీరజ పత్రలోచనుఁడు నిత్యుఁడు శ్రీదుఁడు శ్రీ ధవుండుఁ దా
    శ్రీ రహితుండు వీఁ డనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్

    [శ్రీ రహితుండు = విషము లేనివాఁడు]

    రిప్లయితొలగించండి
  8. పరుల సేవలు జేయుటే భాగ్య మనుచు
    మంచి మర్యాద దె లిసిన మాన్యు డగు చు
    సకల జనతతి మె చ్చె డి సజ్జ నునికి
    శ్రీ రహి తు డంచు వీనికి జేసె ద నతి

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:"విద్య లే దెట్లు బతుకునో వీ!" డటంచు
    "శ్రీరహితుఁ"డంచు వీనికిఁ జేసెద నతి
    దయన సంభావనన్ హెచ్చు ధనము తోడ
    నతని విద్య మెచ్చితి నని యతడు తలచు
    (విద్య లేని పేదవాడు కదా అని అతనికి సంభావనలో ఎక్కువ ఇస్తే అదేదో తన పాండిత్యానికే అని అతడు సంబర పడుతున్నాడు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:చేరెను పోరులో ,నడల జేసె విదేశపు దౌష్ట్య నీతినే,
    కోరిన స్వేచ్ఛ రాగ, యొనగూడగ ముఖ్యపదమ్ము,నాకలే
    తీరని బాధ నెవ్వరిని దిట్టని నేత యశస్సమృద్ధుడౌ
    శ్రీరహితుండు వీఁడనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్
    (కొందరు నాయకులు ఇలాంటి వా రున్నారు.ఉదా:- ప్రకాశం పంతులు గారు. సమస్య లో "వీడు" అనే పదం ఉండటం తో పేర్లు రాయ లేదు.వారి పట్ల గౌరవం తో.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కావ్యములలో వాఁడు పద మగౌరవము కాదండి. వాడుకలో నట్లు పరిగణింపఁ బడుచున్నది.

      వ. వాఁడును బ్రాహ్మణ వచనంబునం జేసి యెల్ల రాజులకు నధికుండయి రాజసూయమహాయజ్ఞకరణంబునం జేసి దేవేంద్రుసాలోక్యంబు వడసె; నట్టి హరిశ్చంద్రు మహిమాతిశయంబు రాజసూయ నిమిత్తంబున నయినదిగా నెఱింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో ని ట్లనియె. భార. సభా. 1. 87

      తొలగించండి
  11. డా బల్లూరి ఉమాదేవి
    దారుణియందు చెంతగల ద్రవ్యము నంతయు దానమిచ్చు చున్
    చేరుచు కానసుంతయును చింతనుచేయక పొద్దుపుచ్చుచున్
    చారుదళాయుతాక్షుడగుచక్రినికొల్చినరంతిదేవునిన్
    శ్రీరహితుండు వీడనుచు జేతులు మోడ్చి నమస్కరించెదన్

    కూటికినిరు పేదయెయైనగుణమునందు
    రాజటంచును మది నెంచి రయముగాను
    పరుల హితమును కోరేడు భాగ్య శాలి
    శ్రీరహితుడంచు వీనికి చేసెదనతి



    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్

    దానధర్మముల్ జేయుచు దాత పగిది
    పర హితమ్మును కోరెడు భక్తిపరుడు
    నీతిగా ప్రవర్తించుచు నియతితోడ
    ధనము లేకున్న గాని సద్గుణము వాడు
    శ్రీ రహితుడంచు వీనికి జేసెద నతి.

    రిప్లయితొలగించండి
  13. కించపఱచుట కోపాన గేలునెత్త
    నలుగురుండగ నవమాన పలుకు లెపుడు
    పలుక కూడదు వినుమార్య! పరుని నైన
    శ్రీరహితుఁడంచు, వీనికిఁ జేసెద నతి
    సాటివానిగ నుపకృతి జగమునందు

    రిప్లయితొలగించండి