16-9-2024 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్”
(లేదా...)
“రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్”
విద్యార్థుల మధ్యన సంభాషణ:కందంబీడీల్ ద్రాగుచుఁ జదివెడువాడవు పాసైతివి గద! పరిశీలించన్బాడిగ మీయమ్మ సలుప,రౌడీ! పూజలను విఘ్నరాజు గ్రహించెన్!శార్దూలవిక్రీడితముబీడీల్ ద్రాగెడు సోమరుల్ గదర! మా విశ్వాసమున్ దాటుచున్వాడల్ మెచ్చెడు రీతి పాసయితిరే! భావింప సత్యమ్మిదే!గోడున్ దెల్పుచు చేయ మీ జననులున్ గోరంగ, మన్నించుచున్రౌడీమూకల, పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్!
కూడలి కిజేరి యచ్చటియాడంగుల నేడిపించి యడలిన వేళన్వేడుకొనుచు జేసిన యారౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
నేడిది పర్వదినమ్మనివేడగ జేరితిమి గుజ్జు వేల్పునిచట నాకీడకు మనగ, వెడలె నారౌడీ! పూజలను విఘ్నరాజు గ్రహించెన్”*నేడే పర్వదిన మ్మటంచు నట విఘ్నేశుండనే భక్తితోవేడన్ జేరితిమప్పుడచ్చటకు మా విశ్వాసమున్ ద్రుంచుచున్ దాడిన్ జేయగ వచ్చినట్టి ఖలులన్ ధైర్యమ్ముగా పంప నారౌడీమూకల, పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్
కం॥ పీడించి ధనముఁ బొందెడిరౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్వేడుకఁగ దీవెనలిడఁగనేఁడనిఁ దలపకదనుఁ గని నేర్పును బుద్ధిన్శా॥ నేఁడీరీతి ధనమ్ముఁ బూజకనుచున్ నిర్భీతితోఁ బొందఁగన్బీడించన్ జనులెల్లరున్ బలికిరే ప్రీతిన్ దురాచారులౌరౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరాజెల్లడన్వీడన్ బోడు సుమీ గరాసులనటుల్ వేధించి శిక్షించడే!గరాసు దుష్టుడు నిఘంటువు సహాయమండి
రౌడీలకు నేతలకున్రూడిగ భేదము తొలగిన రోజులివిగదానేడీ మందిరములలోరౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్నేడెచ్చోటను చూతుమన్నఁ గలరా నిస్వార్థులౌ నేతలేతోడేళ్ళై సతమున్నిఘర్షణముకున్ దోడ్పాటునందించగానేడీసంఘము చీలిపోయెను గదా నిర్ణీతవర్గాల వారౌ 'డీ' మూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్డీ - డీకొను
తాడో పేడో తేల్చిన నీడేఱునె నీదు కోర్కు లెవ్విధి నైనన్ వీడుమ మాటలలోఁ బో రౌ డీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్ [పోరు + ఔ = పోరౌ]కాడయ్యెం గద యిప్పుడీ పురమె యొక్కండైనఁ జింతింపఁడే యీడేరంగ మనోర థోత్కరము లిస్సీ మద్య మాంసమ్ములంబాడిం దప్పి యొనర్చుచుండ నిటులన్ వారింపఁగా విప్ప రే రౌ డీ మూకల పూజలం గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్ [ఏరు+ ఔడు+ఈ = ఏ రౌ డీ; ఔడు = క్రింది పెదవి]
కూడని పనులను సలిపెడురౌడీలను గూడ విఘ్నరాజు దయగొనున్చూడకనే భేదమ్ములరౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
రౌడీయైనను మూర్ఖుఁడైన సుతుపై రాగంబు జూపించుచున్తోడున్నీడగనుండు దండ్రియెపుఁడున్ దుర్మార్గమున్నెంచకన్వేడన్ భక్తిపురస్సరమ్ముగ జనుల్ విఘ్నేశునిన్ శ్రద్ధగన్రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్
వేడె డి వార లెవరనె డి తే డా లేనట్టి వాడు దివ్యుo డగు చున్ వేడ గ భక్తి గ వచ్చి న రౌడీ పూజలను విఘ్న రాజు గ్రహించెన్
కం:దాడికి నన్యమతమ్ములరౌడీ లెల్లరును రాగ రక్షణకై పోరాడగ నిలచిన హిందూరౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్”(ఎవరో రౌడీ తనానికి వస్తే హిందువులు ఊరుకుంటారా?వీళ్ల రౌడీ తనం వీళ్లూ చూపించారు.రౌడీలు దేవుడి పూజ చెయ్య వచ్చు.)
శా:మాడల్ బోసెడు వారు, పేదలును,సామాన్యుల్,శృతుల్ నేర్చి మాటాడన్ జాలెడు వారు గొల్చినను నిత్యానందుడై పొందు నీరౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్”తేడా లేక గ్రహించు, నిక్కమగు భక్తిన్,మోసమున్ గాంచుచున్.
వీడుం వాడని జూడడు మూఢుడు మఱి మంచివాడు మొరటుడ యైనన్ గోడును జెప్పగ వినియారౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
వీడా పూజను జేయు వాడనుచుఁదాఁబ్రేమాభి మానంబుతో వీడుంవారును నందఱయ్యెడను విఘ్నేశు నర్చించగా రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్ వీడండెప్పుడు భక్త కోటిని దయన్ వీక్షించు నెక్కాలమున్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.రౌడీగా వర్తించియువీడెను చింతించుచు తన వృత్తిని, భక్తిన్నేడు చవితి యని చేసినరౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్.
విద్యార్థుల మధ్యన సంభాషణ:
రిప్లయితొలగించండికందం
బీడీల్ ద్రాగుచుఁ జదివెడు
వాడవు పాసైతివి గద! పరిశీలించన్
బాడిగ మీయమ్మ సలుప,
రౌడీ! పూజలను విఘ్నరాజు గ్రహించెన్!
శార్దూలవిక్రీడితము
బీడీల్ ద్రాగెడు సోమరుల్ గదర! మా విశ్వాసమున్ దాటుచున్
వాడల్ మెచ్చెడు రీతి పాసయితిరే! భావింప సత్యమ్మిదే!
గోడున్ దెల్పుచు చేయ మీ జననులున్ గోరంగ, మన్నించుచున్
రౌడీమూకల, పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్!
కూడలి కిజేరి యచ్చటి
రిప్లయితొలగించండియాడంగుల నేడిపించి యడలిన వేళన్
వేడుకొనుచు జేసిన యా
రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
రిప్లయితొలగించండినేడిది పర్వదినమ్మని
వేడగ జేరితిమి గుజ్జు వేల్పునిచట నా
కీడకు మనగ, వెడలె నా
రౌడీ! పూజలను విఘ్నరాజు గ్రహించెన్”*
నేడే పర్వదిన మ్మటంచు నట విఘ్నేశుండనే భక్తితో
వేడన్ జేరితిమప్పుడచ్చటకు మా విశ్వాసమున్ ద్రుంచుచున్
దాడిన్ జేయగ వచ్చినట్టి ఖలులన్ ధైర్యమ్ముగా పంప నా
రౌడీమూకల, పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్
కం॥ పీడించి ధనముఁ బొందెడి
రిప్లయితొలగించండిరౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
వేడుకఁగ దీవెనలిడఁగ
నేఁడనిఁ దలపకదనుఁ గని నేర్పును బుద్ధిన్
శా॥ నేఁడీరీతి ధనమ్ముఁ బూజకనుచున్ నిర్భీతితోఁ బొందఁగన్
బీడించన్ జనులెల్లరున్ బలికిరే ప్రీతిన్ దురాచారులౌ
రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరాజెల్లడన్
వీడన్ బోడు సుమీ గరాసులనటుల్ వేధించి శిక్షించడే!
గరాసు దుష్టుడు నిఘంటువు సహాయమండి
రౌడీలకు నేతలకున్
రిప్లయితొలగించండిరూడిగ భేదము తొలగిన రోజులివిగదా
నేడీ మందిరములలో
రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
నేడెచ్చోటను చూతుమన్నఁ గలరా నిస్వార్థులౌ నేతలే
తోడేళ్ళై సతమున్నిఘర్షణముకున్ దోడ్పాటునందించగా
నేడీసంఘము చీలిపోయెను గదా నిర్ణీతవర్గాల వా
రౌ 'డీ' మూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్
డీ - డీకొను
తాడో పేడో తేల్చిన
రిప్లయితొలగించండినీడేఱునె నీదు కోర్కు లెవ్విధి నైనన్
వీడుమ మాటలలోఁ బో
రౌ డీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
[పోరు + ఔ = పోరౌ]
కాడయ్యెం గద యిప్పుడీ పురమె యొక్కండైనఁ జింతింపఁడే
యీడేరంగ మనోర థోత్కరము లిస్సీ మద్య మాంసమ్ములం
బాడిం దప్పి యొనర్చుచుండ నిటులన్ వారింపఁగా విప్ప రే
రౌ డీ మూకల పూజలం గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్
[ఏరు+ ఔడు+ఈ = ఏ రౌ డీ; ఔడు = క్రింది పెదవి]
కూడని పనులను సలిపెడు
రిప్లయితొలగించండిరౌడీలను గూడ విఘ్నరాజు దయగొనున్
చూడకనే భేదమ్ముల
రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
రౌడీయైనను మూర్ఖుఁడైన సుతుపై రాగంబు జూపించుచున్
రిప్లయితొలగించండితోడున్నీడగనుండు దండ్రియెపుఁడున్ దుర్మార్గమున్నెంచకన్
వేడన్ భక్తిపురస్సరమ్ముగ జనుల్ విఘ్నేశునిన్ శ్రద్ధగన్
రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్
వేడె డి వార లెవరనె డి
రిప్లయితొలగించండితే డా లేనట్టి వాడు దివ్యుo డగు చున్
వేడ గ భక్తి గ వచ్చి న
రౌడీ పూజలను విఘ్న రాజు గ్రహించెన్
కం:దాడికి నన్యమతమ్ముల
రిప్లయితొలగించండిరౌడీ లెల్లరును రాగ రక్షణకై పో
రాడగ నిలచిన హిందూ
రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్”
(ఎవరో రౌడీ తనానికి వస్తే హిందువులు ఊరుకుంటారా?వీళ్ల రౌడీ తనం వీళ్లూ చూపించారు.రౌడీలు దేవుడి పూజ చెయ్య వచ్చు.)
శా:మాడల్ బోసెడు వారు, పేదలును,సామాన్యుల్,శృతుల్ నేర్చి మా
రిప్లయితొలగించండిటాడన్ జాలెడు వారు గొల్చినను నిత్యానందుడై పొందు నీ
రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్”
తేడా లేక గ్రహించు, నిక్కమగు భక్తిన్,మోసమున్ గాంచుచున్.
వీడుం వాడని జూడడు
రిప్లయితొలగించండిమూఢుడు మఱి మంచివాడు మొరటుడ యైనన్
గోడును జెప్పగ వినియా
రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్
వీడా పూజను జేయు వాడనుచుఁదాఁబ్రేమాభి మానంబుతో
రిప్లయితొలగించండివీడుంవారును నందఱయ్యెడను విఘ్నేశు నర్చించగా
రౌడీమూకల పూజలన్ గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్
వీడండెప్పుడు భక్త కోటిని దయన్ వీక్షించు నెక్కాలమున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రౌడీగా వర్తించియు
వీడెను చింతించుచు తన వృత్తిని, భక్తిన్
నేడు చవితి యని చేసిన
రౌడీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్.