సంగర మందు చోద్యముగ శాపములే తమ శక్తి చూపగా క్రుంగగ స్యందనమ్ము దిగులొందుచు కర్ణుడు యుద్ధమందునన్ భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో చెంగట నిల్వగా చెలగి చెండెను కౌరవ సేన నంతటిన్
ఉ:"సంగర మందు లేరు తన సాటి యటంచు,బ్రతిజ్ఞ దీర్చుటన్ భంగము జెందునో" యనెడు భావము వాటిల సైంధవుండు తృ ప్తింగొన ప్రొద్దు గ్రుంకు తరి భీతియు గొల్పగ నంత దాకయున్ భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో (ఆ సమయం లో కృష్ణుడు నవ్వుతాడా?అంటే ఎంత ప్రమాదం వచ్చినా కృష్ణుడు నవ్వుతూనే ఉంటాడు.దాని ఉపాయం తన వద్ద ఎలాగూ ఉంటుంది.)
కం॥ రంగము సిద్ధము నొందఁగఁ
రిప్లయితొలగించండిజెంగున దూకిరి యురసులు చేవను జూపన్
గ్రుంగుచు భీష్ముని ధాటికి
భంగపడఁగ నరుఁడు హరియె ఫక్కున నవ్వెన్
ఉ॥ రంగము సిద్ధమయ్యెనట రాజస మొప్పఁగ వీరులందరున్
జెంగున దూక యుద్ధమునఁ జేవను జూపఁగఁ బార్థుఁడచ్చటన్
గ్రుంగఁగ భీష్మ శూరతకు కొంతయుఁ దాళక ఖిన్నుఁడై యటుల్
భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో
పిదప కోపముతో భీష్ముని వైపుకు పరుగిడతాడు అని అండి
ఉరసుడు శూరుడు నిఘంటువు సహాయమండి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిసంగర మందున తొలుతగ
రిప్లయితొలగించండినంగపతి విడిచిన బాణమంటగ ధ్వజమున్
వంగుటగని సిగ్గుబడెను
భంగపడఁగ నరుఁడు ; హరియె ఫక్కున నవ్వెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంగరమెంచుచుత్రాతగ
రిప్లయితొలగించండిచెంగటజేరినగయుగని చేదుకొనంగా
ముంగిటవంచెనుశీర్షము
భంగపడగనరుడు, హరియెఫక్కుననవ్వెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంగరసీమయందు తన శౌర్యముఁ జూపుచు వైరిమూకలన్
రిప్లయితొలగించండిబెంగడిలంగజేసి కురు వృద్ధుఁడు భీష్ముఁడు చెంగలించగన్
భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను, గృష్ణుఁ డాజిలో
చెంగున స్యందనమ్ముఁదిగి చేతను చక్రముఁబూనెనుగ్రుఁడై.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరంగము సిద్ధమ్మయ్యెను
రిప్లయితొలగించండిసంగరమునకున్ కిరీటి శౌరిల నడుమన్
బెంగడిలఁజేయ నాజిని
భంగపడఁగ నరుఁడు హరియె ఫక్కున నవ్వెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంగర మందున గురువును
రిప్లయితొలగించండిచెంగట భీష్ముడు మొదలగు శ్రే ష్టుల గని యున్
పొంగగ బాధలు న య్యె డ
భంగపడ గ నరుడు హరి యె ఫ క్కు న నవ్వె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలొంగుట వీరునికి తగదు
రిప్లయితొలగించండిసంగరమే వీరపుత్ర సద్గుణమని చి
త్రాంగద తనయుని చేతన్
భంగపడఁగ నరుఁడు హరియె ఫక్కున నవ్వెన్
[హరి = యముడు]
సంగర మందు చోద్యముగ శాపములే తమ శక్తి చూపగా
క్రుంగగ స్యందనమ్ము దిగులొందుచు కర్ణుడు యుద్ధమందునన్
భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో
చెంగట నిల్వగా చెలగి చెండెను కౌరవ సేన నంతటిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిచెంగున గెంతుచు చేయుచు
రిప్లయితొలగించండివెంగలి చేష్టలు తరువున వ్రేలాడుచు ను
త్తుంగ శిఖ నుండి దుముకుచు
భంగపడఁగ నరుఁడు హరియె పక్కున నవ్వెన్
[హరి = కోఁతి]
భృంగముఁ బోలు దీ వనుచుఁ బెల్లుగ నార్చుచు సంబరమ్మునన్
రంగము నందుఁ బోరుచును గ్రాలుచు మేదినిఁ గూల మేని యా
రంగు కడింది మాయగను గ్రన్నన మల్లుని చేత వింతఁ దా
భంగపడంగ నర్జునుఁడు పక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో
[అర్జునుఁడు = తెల్లనివాఁడు; కృష్ణుఁడు = నల్లని వాఁడు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం:బెంగ నిడగ మమకారము,
రిప్లయితొలగించండిక్రుంగగ తన పగయు,విల్లు కూడ వణకగన్
సంగరమున క్షత్రియతన్
భంగపడఁగ నరుఁడు హరియె ఫక్కున నవ్వెన్”
(అర్జునవిషాదయోగం.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:"సంగర మందు లేరు తన సాటి యటంచు,బ్రతిజ్ఞ దీర్చుటన్
రిప్లయితొలగించండిభంగము జెందునో" యనెడు భావము వాటిల సైంధవుండు తృ
ప్తింగొన ప్రొద్దు గ్రుంకు తరి భీతియు గొల్పగ నంత దాకయున్
భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో
(ఆ సమయం లో కృష్ణుడు నవ్వుతాడా?అంటే ఎంత ప్రమాదం వచ్చినా కృష్ణుడు నవ్వుతూనే ఉంటాడు.దాని ఉపాయం తన వద్ద ఎలాగూ ఉంటుంది.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅంగన ద్రౌపది సభలో
క్రుంగిన ఘట్టమ్ము మఱచి లోకము నవ్వన్
ఖంగు తిని తన్నె తానుగ
భంగపడఁగ నరుఁడు హరియె ఫక్కున నవ్వెన్!
ఉత్పలమాల
అంగన ద్రౌపదిన్ సభఁ బరాభవమందగఁ జేయ కౌరవుల్
సింగము వోలె భీముడల చీల్చెద రొమ్ములనన్ ప్రతిజ్ఞలన్
ఖంగు తినంగఁ దా మఱచి గాండివమెత్తక తన్నె తానుగా
భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో!
అంగన కొసగిన మాటకు
రిప్లయితొలగించండిభంగము కలిగించురీతి పార్థుండనిలో
వెంగలిగ పోరు వలదన
*“భంగపడఁగ నరుఁడు హరియె ఫక్కున నవ్వెన్”*
అంగములన్నియున్ వణక నార్తి ని బొందుచు గాంచుచెల్లరన్
సంగరరంగమందు వడి శస్త్రములన్ విడి నిల్వ స్థాణువై
సింగము వంటి వీరుడిటు శీర్షము వాల్చుట గాంచు చయ్యెడన్
*“భంగపడంగ నర్జునుఁడు ఫక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సంగరమున కేతెంచియు
క్రుంగుచు బంధువులఁ గాంచి కోర్కె నశించన్
సంగరమును వీడుదునని
భంగపడగ నరుడు హరియె ఫక్కున నవ్వెన్.