14, సెప్టెంబర్ 2024, శనివారం

సమస్య - 4882

15-9-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ”
(లేదా...)
“పూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే”

19 కామెంట్‌లు:

  1. మామా నే జెప్పెద విను
    మేమాత్రము జక్కనుండదెంచి కనంగన్
    ఆమె జననమొందెనుగద
    స్త్రీమూర్తిగ ; మగతనమును జిమ్ముట వెఱగౌ

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి బ్రిటీష్ వారి భావన:

      కందం
      సామూహిక బానిసలై
      మేమాదేశించినట్లు మెలిగెడు ప్రజలం
      దేమా ఝాన్సీ ధైర్యము!
      స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ! !


      శార్దూలవిక్రీడితము
      సేవించన్ మము భారతీయులెలమిన్ సిద్ధమ్ముగన్ దల్చి మా
      భావంబౌ విభజించి పాలనము గూర్పన్ దోడ్పడన్ మోదమౌ
      నీ వీలుండగ, రోషమున్ దెలిపె ఝన్సీలక్ష్మి ధైర్యమ్ముతో
      బూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే!

      తొలగించండి
  3. కం॥ తామే యధికుల మంచును
    భామలు క్రీడలఁ బురుషుల పాటి వరలఁగన్
    సామాన్యమ్మా యన విని
    స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱవౌ

    శా॥ హావంబందున లాలనా జనిత సౌహార్ద్రమ్ముతో నొప్పినన్
    భావంబందున మార్దవమ్ముఁగని సంభాషమ్ముఁ గావించినన్
    బూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముంజిమ్ము టాశ్చర్యమే
    ప్రావీణ్యంబును జూపఁ గ్రీడలనటుల్ వర్తించెనా ముగ్ధయే

    మగతనము శౌర్యము (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సౌహార్దమ్ము అండి శార్దూలము మొదటి పాదములో తప్పుగా సౌహార్ద్రమ్ము అనుకున్నాను.

      తొలగించండి

  4. సామియె మూర్ఛిలి నంతట
    నా మనుజాశను వధింప ననిసాగింపన్
    భామయె చేపట్టె ధనువు
    స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ.


    ఆ వృష్ణేయుడు సొమ్మసిల్లగనె తానస్త్రమ్ము చేబూనుచున్
    బ్రావెల్పున్ దునుమాడగా దలచె నభ్యామర్ధమున్ సత్యయే
    చేవన్ జూపుచు నిల్వరించెగద దుశ్శీలుండ నవ్వేళలో
    పూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే.

    రిప్లయితొలగించండి
  5. ఏ మాత్రము వెను దీయక
    ధీమా గా యుద్ధ మందు తేకువ జూప న్
    భామా మణి గని వైరులు
    స్త్రీ మూర్తి గ మగ తనమును జిమ్ముట వెఱ గౌ

    రిప్లయితొలగించండి
  6. భామిని రుద్రమ దేవీ
    ధీమంతముతోడబోరె దిగ్గజులదరన్
    నామము నిలిపె జరిత్రన్
    స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱవౌ

    రిప్లయితొలగించండి
  7. స్త్రీమూర్తుల లాలిత్యము
    సామాన్యముగద చరిత్ర సకలమెఱుగకే
    లేమగ పుట్టిన రుద్రమ
    స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ

    కావేవీ పరికించకున్న బలిమిన్ గన్పర్చు ప్రస్తావముల్
    భావోద్వేగముతో వచించె నతడే ప్రాపంచ చారిత్రమే
    చేవంజూపిన రుద్రమాంబ నరయన్ జిత్రాతిచిత్రంబుగా
    పూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే

    రిప్లయితొలగించండి
  8. భావంబందున జూపు ప్రేమ హరిపై, పాపాత్ముపై కోపమున్
    శ్రీవత్సున్ గన వాలుచూపు, నరకున్ చెండాడు బాణమ్ములన్
    దేవీసత్య హసించు కృష్ణుఁ గనినన్, తీండ్రించు నక్తంచరున్
    పూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే!!

    రిప్లయితొలగించండి
  9. తా వేషంబునుదాల్చి యిందుముఖి యోధాగ్రేశుగా వేదిపై
    ఆవేశంబుగ మాటలాడ జనులాహాయంచు కీర్తింపఁగన్
    భావావేశము దూఁకొనన్ మగటిమిన్ భవ్యంబుగా జూపుచున్
    పూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే

    రిప్లయితొలగించండి
  10. భామామణి పురుషునిగా
    దీమసముగ వేదిపైన ధిషణను జూపెన్
    యేమా భావావేశము!
    స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ

    రిప్లయితొలగించండి
  11. మై బల మల్ప మయిన మే
    దో బలమున మిన్న యంచుఁ దోయజ నయనల్
    లోఁ బురుషులను గణింపరు
    పూఁబోఁడిగ మగతనమును బోలుట వెఱఁగౌ

    మా మై బల మల్ప మయిన
    మా మేదో బలము మిన్న మగవారలకున్
    నా మది వారి గణింపరు
    స్త్రీ మూర్తిగ మగతనమును జిమ్ముట వెఱఁగౌ


    కావన్ వచ్చిన వారినిం దఱిమి యా కౌరవ్యులే యాలకై
    రా వేగమ్మున సంగ రావనిని భద్రం బెంచి వైరాటికిన్
    లా వొప్పంగ బృహన్నలా వనిత సారథ్యమ్ము సేపట్టఁగా
    బూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే

    రిప్లయితొలగించండి
  12. ఏమా యాధైర్యముఁగన
    భామాయే యామెయనుచుఁబరవశమొందన్
    భీమాకారపు ఝాన్సీ
    స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ

    రిప్లయితొలగించండి
  13. ఆవంబంతయు లేక భీతము మహాహర్షంబు తో వీరులన్
    జేవంజూపుచు నొక్కభామయె
    యనిన్ చెండాడు వృత్రాదులన్
    బ్రావీణ్యంబును తోడ, ఝాన్సిని గనన్ భావంబు నందోచెగా
    పూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తా మూర్ఛిల్లగ కృష్ణుడు
    భామయె స్వయముగ ధనుస్సు పట్టి
    నరకునిన్
    ధీమాగా వధియించెను
    స్త్రీమూర్తిగ మగతనమును జిమ్ముట వెఱగౌ.

    రిప్లయితొలగించండి