12, సెప్టెంబర్ 2024, గురువారం

సమస్య - 4880

13-9-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె”
(లేదా...)
“త్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను సెల్లుఫోనహో”
(D.V. రామాచారి గారికి ధన్యవాదాలతో...)

12 కామెంట్‌లు:

  1. తేటగీతి
    చూపనమృతమ్ము సెల్ఫోను పాపకైన
    చిందులేయుచు సెల్ఫోనుఁ జేతఁ గొనఁగఁ
    బూని మార్చిన నార్యుల ముందుమాటఁ
    "బాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె"

    ఉత్పలమాల
    తెచ్చితి సెల్లుఫోను, సుధ తీరుగ నావగు రెండు చేతులన్
    నచ్చిన దేదొ తీసుకొను నర్మిలియంచన పాప సెల్లునే
    మెచ్చితి నంచుఁ గైకొనెను, మీదట మార్చిన నార్యవాక్కులన్
    "ద్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను సెల్లుఫోనహో! "

    రిప్లయితొలగించండి
  2. సురలునసురులు త్రచ్చఁగ చోద్యముగను
    పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె
    పుట్టిమునిగినయట్టుల పుట్టగానె
    శిశువు గోరుచు నేడ్చెను సెల్లు ఫోను

    రిప్లయితొలగించండి
  3. తే॥ పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె
    కనుచుఁ గలికాలమందునఁ గలదు దీని
    యొదవుబడి యని యచ్యుతుఁ డొడుపు గాను
    భద్రపఱచఁగ నేఁడది బయట పడెనొ

    ఉ॥ త్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను సెల్లుఫోనహో
    విచ్చిన వస్తు రూపమును విష్ణువు కాంచిన తోడఁ దోఁచఁగన్
    ముచ్చట గాను జూచెదరు మోదముతోఁ గలి కాలమందునన్
    నచ్చఁగఁ బిచ్చిగా జనులు నాటికి దాఁచెద నంచునుంచెనో

    రిప్లయితొలగించండి
  4. సుధను కోరి త్రచ్చ గ సురా సురులు పుట్టె
    కల్పవృక్షాదివస్తువుల్ ఘనముగాను
    *“పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె”*
    జ్ఞాన సుధలను పంచంగ జనుల కెల్ల

    వచ్చిరి దేవదానవులు వాసుకి రజ్జువు యయ్యె శ్రీశుడున్
    వచ్చెనుకచ్ఛపమ్ముగనువాసిగ శ్రీ యును పుట్టెనచ్చటన్
    *“త్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ, బుట్టెను సెల్లుఫోనహో
    విచ్చగ జ్ఞాన నేత్రములు విజ్ఞులకీ కలికాల మందునన్

    రిప్లయితొలగించండి
  5. చెక్కముక్క తుపాకిని చేతబట్టి
    దూరె నావీధి నొక్క విదూషకుండు
    వినగ నొక్కివక్కాణించె పిట్టలదొర
    'పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె'

    వచ్చెను వీధిలోనికి తుపాకిని పట్టి విదూషకుండహో
    ముచ్చట గొల్పురూపమును మూర్ఖత నిండిన వాక్కులెన్నియో
    గ్రుచ్చి వచించినాడు మరి కోవిదుడైన ప్రవక్త రీతినిన్
    'ద్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను సెల్లుఫోనహో'

    రిప్లయితొలగించండి
  6. వచ్చిరి దేవదానవులు వార్ధిని ద్రచ్చఁగ నిర్జరమ్ముకై
    యిచ్చెను క్షీరవార్ధి సుధ యిచ్చను దీర్చుచు, నంతమందునన్
    మెచ్చగ నెల్ల వారలును మేదినియందున మానవాళికిన్
    ద్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను సెల్లుఫోనహో

    రిప్లయితొలగించండి
  7. పరుల నెచటి నుండియయిన పలకరించ
    ననువుగ వెలయించుకొనెడి యాస తోడ
    శాస్త్ర వేయ్తలు నిరతము జవిగొను బడ
    పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె

    రిప్లయితొలగించండి
  8. మాట లాడుచు నవ్వుచు మేటి సఖుల
    తోడ దాఁటంగ నది నొకనాఁడు మురిసి
    నావ లోఁ జనఁ జేజాఱ నా నుడిమర
    పాల సంద్రానఁ జేవాణి ప్రభవ మందె


    మెచ్చి నరాలి వర్తనము మేదిని నారసి దేవదేవుఁడే
    యిచ్చెను బ్రీతినిన్ మెదడు నింపుగఁ బోలఁగ నిర్మలాంబుధిన్
    ముచ్చట లాడ నెల్లరును మోదము నిండ నెడంద లందు వే
    త్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను బల్కు జంత్రమే


    రిప్లయితొలగించండి
  9. తే.గీ:యువతియును యువకుడు ప్రేమ నొకరి కొకరు
    ప్రేమ దెలుపగ వరమై లభించుచు మురి
    పాలసంద్రాన సెల్ఫోను ప్రభవమందె
    పెద్ద వారలు సొమ్ముతో ముద్దు చేయ

    రిప్లయితొలగించండి
  10. కలిగె సందేహ మొకరికి ఘనము గాను
    ప్రశ్న వేసిరి పెద్దను వాంఛ మీర
    నతడు జెప్పెను దానికి య ద్భు త ము గ
    పాల సంద్రాన సెల్ఫోను ప్రభవ మందె

    రిప్లయితొలగించండి
  11. ఉ:తెచ్చిన క్రొత్త ఫోను సుదతీమణి రైకన నుంచి క్షీరమున్
    ద్రచ్చుచు నుండ ఫోను పడ దాకన నామె గ్రహించకుండె నా
    బొచ్చెను మార్చి వేరొకట బోయుచు నుండగ భర్త యిట్లనెన్
    "త్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను సెల్లుఫోనహో”

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    త్రచ్చగ సురాసురలు పుట్టె లక్ష్మి దేవి,
    అప్సరసలు,చంద్రుడు,సుర,హాలహలము
    పాల సంద్రాన; సెల్ ఫోను ప్రభవమందె
    మానవుడు తన మేధను మంథనించ.

    రిప్లయితొలగించండి