26-9-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవుల కవనమ్ములో నీతి గానరాదు”
(లేదా...)
“నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్”
తేటగీతినీతిమంతుని కవులెనా! జాతి పొగడుస్వార్థచిత్తుని మోహాంధు చరితవినుచుపల్వురు తెగెడెడున్ 'దుష్టభావమందు'కవుల కవనమ్ములో 'నీతి గానరాదు'శార్దూలవిక్రీడితముచేతన్ బూనుచు ఘంటమున్ జగతికిన్ శ్రేయమ్ము సేకూర్చెడున్బూతాత్ముల్ దగ మెచ్చెడున్ కృతులనే పూయుంచు యజ్ఞమ్మునన్రోతన్ సల్పెడు 'దుష్టపాత్రల గతిన్' లోకమ్ము ఛీకొట్టగన్' నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్'
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏 తమ వాట్సప్ సూచనలమేరకు సవరించిన పూరణలు:తేటగీతినాయకత్వపు లక్షణాల్ మాయఁజేస్వార్థచిత్తుని మోహాంధు చరితవినుచుదుష్టపాత్రల నడతనే యిష్టపడగకవుల కవనమ్ములో 'నీతి గానరాదు'శార్దూలవిక్రీడితముచేతన్ బూనుచు ఘంటమున్ జగతికిన్ శ్రేయమ్ము సేకూర్చెడున్బూతాత్ముల్ దగ మెచ్చెడున్ సరళిలోఁ పుణ్యంబు వర్జించుచున్రోతన్ సల్పెడు దుష్టపాత్రల గతిన్ లోకమ్ము గీర్తింప దుర్నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
బ్రహ్మమానందమైయుండు పలుకు తోడుకొనిరసముజాలునువారంగ రమ్యమగుచువరలుకావ్యమ్ము రమణీయభావమెంచికవులకవనమ్ములోనీతికానరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో గణభంగం. సవరించండి.
పలుకుతోడ
సవరించారు కదా...!
లాతిన్జూడరురామణీయకమునల్లాడించునాత్మాంబుధిన్త్రాతల్నైరిగవేదవేద్యులునుసూత్రంబందురాసిక్యమేశ్రోతల్మెచ్చగబ్రహ్మమున్గనిరిగా శోభిల్లకావ్యాలలోనీతిన్జూపినవారులేరుకవులై నిర్మించికావ్యమ్ములన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'త్రాతల్నైరి' ?
త్రాతల్గాగను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే॥ విప్లవ కవిత్వమంచును వివిధ తెగలమధ్య స్పర్ధను బెంచుచు మానవతనుమంటఁగలిపెడు రచనల మరులుకొనెడికవుల కవనమ్ములో నీతి గానరాదుశా॥ వ్రాతల్ పిచ్చిగ విప్లవమ్మనుచు సద్భావమ్ము మిత్రత్వమున్బ్రీతిన్ దూరముఁ జేసి మానవుల కావేశంబు స్పర్ధాదులన్బాతాళంబుకు జార్చు కైతలనె సంభావించుచున్ వ్రాయగానీతిన్ జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
స్త్రీల యంగాంగవర్ణనల్ జేయువారుచప్పనౌ కవనమ్ములఁ జెప్పువారుకవులు కాబోరు వారు కుకవులు, యట్టికవుల కవనమ్ములో నీతి గానరాదు
మంచి పూరణ. అభినందనలు.
కవితలను జెప్పుటందున గణుతినొందికూడ , దుర్జనుడగుటన కుటిలమైనతలపులు గలిగియుండగ దబ్బు చుండుకవుల కవనమ్ములో నీతి గానరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేతల్ జూడగ నీతిబాహ్యములు సౌశీల్యంబు మృగ్యంబుసూ చేతోజాతముగా తలోదరులపై చిత్రాతిచిత్రంబుగావ్రాతల్ వ్రాసెడివారలన్ కవులుగా వర్ణింపగా చెల్లునేనీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నీతి వాక్రుచ్చు రచనలు ప్రీతిగొనగకచ్చి తముగ కనుంగొన వచ్చునెపుడుకవుల కవనమ్ములో నీతి; గానరాదువిరచి తంబైన దుర్నీతి తరచి చూడనీతిన్ జూపుచు సత్కవుల్ జగతికిన్చేకూర్చిరే మార్గమున్ఖ్యాతిన్ గొన్నవి పెక్కుకావ్యములిలన్ కాలాను గుణ్యంబుగారీతిన్ తెల్పుచు వ్రాసినారు కవులే క్రేళ్ళుబ్బు చందాన దుర్నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. 'జగతికిన్జేకూర్చిరే'
ధన్యవాదాలు గురూజీ 🙏
పచ్చి లైంగిక భావనల్ పద్య మందు నింపి వ్రాసెడు వారౌ చు నిశిత మైన సభ్య తలను మరచు వారు సల్పు నట్టి కవుల కవనమ్ము లో నీతి గాన రాదు
నేత లాడెడు మాటల నిజము గనము నేతి బీరకాయల లోన నేతిఁ గనము ప్రాస యతులకుఁ బడరాని పాట్లు పడు కుకవుల కవనమ్ములో నీతి గాన రాదు ప్రాతఃకాల రవి ప్రభా సదృశ దుర్వా రోజ్జ్వల స్కంధులై శ్రోతృ శ్రేణికి నర్థ వంత పదముల్ సొప్పించి పద్యమ్ములం జేతో మోదము గూర్తు రత్యధిక సంశ్రేయంబు నీక్షించి దుర్నీతిం జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తే.గీ:స్త్రీల అంగాంగవర్ణనల్ చెలగుచుండి,విరహములు, రతి సౌఖ్యముల్ వెలసినంత,నన్యవర్ణనలున్నంత నా ప్రబంధకవుల కవనమ్ములో నీతి గానరాదు(ప్రబంధకవుల కవనాలలో నీతి అసలే ఉండ దనను కానీ ఆ వర్ణన లున్నంతగా నీతులు కనుపించవు అని.)
ఉ:వ్రాతన్ తత్త్వము,భక్తియున్ దెలిపియున్, ప్రార్థించి యే రాజుకో చేతన్ బెట్టుచు కావ్యముల్ ధనములన్ జేబట్టి రా ప్రాకవుల్ పోతన్నన్ బలె దైవదత్తకవనమ్మున్ సొమ్ము కై యమ్మనన్నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
పుట్ట గొడుగుల వోలెను బుట్టుచుండె గవుల మంచును వేలాదికవులు భువినితఱచి చూడఁగ వ్యంగము తప్ప,నేటి కవుల కవనమ్ములో నీతి గానరాదు
నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్ రాతల్ వ్రాయును బ్రహ్మ దేవుఁడు ముఖాగ్రంబందు చిత్రంబుగాఁ బాత్రల్ వారిగ వారి భావమిడుచున్ బాత్రోచి తంబొందనౌ బ్రీతిన్ వారలు వ్రాయఁగల్గుదురటన్ బ్రేమాను రాగంబుతో
ప్రాసలుయతుల తోడను పద్యములను వ్రాయ లేనట్టి వారలు పదములనటపేర్చి పొందగనెంచుచు పేరు వ్రాయు కవులు కవనమ్ములోనీతి కానరాదు
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.గణములున్ బ్రాస యతులకు కష్టపడుచువిషయమేమి లేకుండగ విసుగు చెందునటుల వ్రాయబూనుచునుండు నట్టి నేటికవుల కవనమ్ములో నీతి గానరాదు.
తేటగీతి
రిప్లయితొలగించండినీతిమంతుని కవులెనా! జాతి పొగడు
స్వార్థచిత్తుని మోహాంధు చరితవినుచు
పల్వురు తెగెడెడున్ 'దుష్టభావమందు'
కవుల కవనమ్ములో 'నీతి గానరాదు'
శార్దూలవిక్రీడితము
చేతన్ బూనుచు ఘంటమున్ జగతికిన్ శ్రేయమ్ము సేకూర్చెడున్
బూతాత్ముల్ దగ మెచ్చెడున్ కృతులనే పూయుంచు యజ్ఞమ్మునన్
రోతన్ సల్పెడు 'దుష్టపాత్రల గతిన్' లోకమ్ము ఛీకొట్టగన్
' నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్'
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏 తమ వాట్సప్ సూచనలమేరకు సవరించిన పూరణలు:
తొలగించండితేటగీతి
నాయకత్వపు లక్షణాల్ మాయఁజే
స్వార్థచిత్తుని మోహాంధు చరితవినుచు
దుష్టపాత్రల నడతనే యిష్టపడగ
కవుల కవనమ్ములో 'నీతి గానరాదు'
శార్దూలవిక్రీడితము
చేతన్ బూనుచు ఘంటమున్ జగతికిన్ శ్రేయమ్ము సేకూర్చెడున్
బూతాత్ముల్ దగ మెచ్చెడున్ సరళిలోఁ పుణ్యంబు వర్జించుచున్
రోతన్ సల్పెడు దుష్టపాత్రల గతిన్ లోకమ్ము గీర్తింప దు
ర్నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
బ్రహ్మమానందమైయుండు పలుకు తోడుకొని
రిప్లయితొలగించండిరసముజాలునువారంగ రమ్యమగుచు
వరలుకావ్యమ్ము రమణీయభావమెంచి
కవులకవనమ్ములోనీతికానరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
పలుకుతోడ
రిప్లయితొలగించండిసవరించారు కదా...!
తొలగించండిలాతిన్జూడరురామణీయకమునల్లాడించునాత్మాంబుధిన్
రిప్లయితొలగించండిత్రాతల్నైరిగవేదవేద్యులునుసూత్రంబందురాసిక్యమే
శ్రోతల్మెచ్చగబ్రహ్మమున్గనిరిగా శోభిల్లకావ్యాలలో
నీతిన్జూపినవారులేరుకవులై నిర్మించికావ్యమ్ములన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'త్రాతల్నైరి' ?
త్రాతల్గాగను
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ విప్లవ కవిత్వమంచును వివిధ తెగల
రిప్లయితొలగించండిమధ్య స్పర్ధను బెంచుచు మానవతను
మంటఁగలిపెడు రచనల మరులుకొనెడి
కవుల కవనమ్ములో నీతి గానరాదు
శా॥ వ్రాతల్ పిచ్చిగ విప్లవమ్మనుచు సద్భావమ్ము మిత్రత్వమున్
బ్రీతిన్ దూరముఁ జేసి మానవుల కావేశంబు స్పర్ధాదులన్
బాతాళంబుకు జార్చు కైతలనె సంభావించుచున్ వ్రాయగా
నీతిన్ జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిస్త్రీల యంగాంగవర్ణనల్ జేయువారు
రిప్లయితొలగించండిచప్పనౌ కవనమ్ములఁ జెప్పువారు
కవులు కాబోరు వారు కుకవులు, యట్టి
కవుల కవనమ్ములో నీతి గానరాదు
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండికవితలను జెప్పుటందున గణుతినొంది
రిప్లయితొలగించండికూడ , దుర్జనుడగుటన కుటిలమైన
తలపులు గలిగియుండగ దబ్బు చుండు
కవుల కవనమ్ములో నీతి గానరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేతల్ జూడగ నీతిబాహ్యములు సౌశీల్యంబు మృగ్యంబుసూ
రిప్లయితొలగించండిచేతోజాతముగా తలోదరులపై చిత్రాతిచిత్రంబుగా
వ్రాతల్ వ్రాసెడివారలన్ కవులుగా వర్ణింపగా చెల్లునే
నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినీతి వాక్రుచ్చు రచనలు ప్రీతిగొనగ
రిప్లయితొలగించండికచ్చి తముగ కనుంగొన వచ్చునెపుడు
కవుల కవనమ్ములో నీతి; గానరాదు
విరచి తంబైన దుర్నీతి తరచి చూడ
నీతిన్ జూపుచు సత్కవుల్ జగతికిన్చేకూర్చిరే మార్గమున్
ఖ్యాతిన్ గొన్నవి పెక్కుకావ్యములిలన్ కాలాను గుణ్యంబుగా
రీతిన్ తెల్పుచు వ్రాసినారు కవులే క్రేళ్ళుబ్బు చందాన దు
ర్నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'జగతికిన్జేకూర్చిరే'
ధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపచ్చి లైంగిక భావనల్ పద్య మందు
రిప్లయితొలగించండినింపి వ్రాసెడు వారౌ చు నిశిత మైన
సభ్య తలను మరచు వారు సల్పు నట్టి
కవుల కవనమ్ము లో నీతి గాన రాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేత లాడెడు మాటల నిజము గనము
రిప్లయితొలగించండినేతి బీరకాయల లోన నేతిఁ గనము
ప్రాస యతులకుఁ బడరాని పాట్లు పడు కు
కవుల కవనమ్ములో నీతి గాన రాదు
ప్రాతఃకాల రవి ప్రభా సదృశ దుర్వా రోజ్జ్వల స్కంధులై
శ్రోతృ శ్రేణికి నర్థ వంత పదముల్ సొప్పించి పద్యమ్ములం
జేతో మోదము గూర్తు రత్యధిక సంశ్రేయంబు నీక్షించి దు
ర్నీతిం జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితే.గీ:స్త్రీల అంగాంగవర్ణనల్ చెలగుచుండి,
రిప్లయితొలగించండివిరహములు, రతి సౌఖ్యముల్ వెలసినంత,
నన్యవర్ణనలున్నంత నా ప్రబంధ
కవుల కవనమ్ములో నీతి గానరాదు
(ప్రబంధకవుల కవనాలలో నీతి అసలే ఉండ దనను కానీ ఆ వర్ణన లున్నంతగా నీతులు కనుపించవు అని.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:వ్రాతన్ తత్త్వము,భక్తియున్ దెలిపియున్, ప్రార్థించి యే రాజుకో
రిప్లయితొలగించండిచేతన్ బెట్టుచు కావ్యముల్ ధనములన్ జేబట్టి రా ప్రాకవుల్
పోతన్నన్ బలె దైవదత్తకవనమ్మున్ సొమ్ము కై యమ్మనన్
నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
పుట్ట గొడుగుల వోలెను బుట్టుచుండె
రిప్లయితొలగించండిగవుల మంచును వేలాదికవులు భువిని
తఱచి చూడఁగ వ్యంగము తప్ప,నేటి
కవుల కవనమ్ములో నీతి గానరాదు
నీతిన్ జూపినవారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్
రిప్లయితొలగించండిరాతల్ వ్రాయును బ్రహ్మ దేవుఁడు ముఖాగ్రంబందు చిత్రంబుగాఁ
బాత్రల్ వారిగ వారి భావమిడుచున్ బాత్రోచి తంబొందనౌ
బ్రీతిన్ వారలు వ్రాయఁగల్గుదురటన్ బ్రేమాను రాగంబుతో
ప్రాసలుయతుల తోడను పద్యములను
రిప్లయితొలగించండివ్రాయ లేనట్టి వారలు పదములనట
పేర్చి పొందగనెంచుచు పేరు వ్రాయు
కవులు కవనమ్ములోనీతి కానరాదు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
గణములున్ బ్రాస యతులకు కష్టపడుచు
విషయమేమి లేకుండగ విసుగు చెందు
నటుల వ్రాయబూనుచునుండు నట్టి నేటి
కవుల కవనమ్ములో నీతి గానరాదు.