5, సెప్టెంబర్ 2024, గురువారం

సమస్య - 4873

6-9-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అర్జును నిర్జించె శకుని యాహవమందున్”

(లేదా...)

“ఆహవమందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై”

14 కామెంట్‌లు:

  1. కం॥ నిర్జించెఁ గౌరవ హితుల
    గర్జన సేయుచు విజయుఁడు కదనమునందున్
    వర్జితుఁడొకఁడు కలగనెనొ
    యర్జును నిర్జించె శకుని యాహవమందున్

    ఉ॥ సాహస మందునర్జునుఁడు సాటిని కాంచఁడు యుద్ధమందునన్
    ద్రోహుల కౌరవాధముల దుర్జయుఁడై హితులన్ వధించెనే
    మోహము క్రమ్మఁ ద్రావఁగను మూర్ఖుఁడు పల్కెనొ నిట్లు చూడఁగా
    నాహవమందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసెనుగ్రుఁడై

    రిప్లయితొలగించండి
  2. మోహము పెంచె ద్యూతమున మోసము తోడుగ ధర్మ రాజుకున్
    ద్రోహము జేయగా శకుని దుష్టుడు వేయగ దొంగ పాచికల్
    బాహు బలుండు భీముడు స్వభావము వీడచు నోడె, వెన్క ద్యూ
    తాహవమందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై!!

    రిప్లయితొలగించండి
  3. నిర్జన కందువ నందున
    తర్జన మొందగ ధవళపు దర్వీకరమున్
    దౌర్జన్యముగ దలపడుచు
    నర్జును నిర్జించె శకుని యాహవమందున్

    రిప్లయితొలగించండి
  4. అర్జునుని పుత్రుడే గద
    యర్జును నిర్జించె; శకుని యాహవమందున్
    నిర్జీవుండయ్యెను గద
    గర్జించిన మాద్రి సుతుడు ఖండింపంగా

    కాహళమైన మానసము కల్గిన కౌరవ మేనమామ సం
    దేహము లేని రీతి సహదేవుడు పోరగ నంతరించె తా
    నాహవమందునన్ శకుని; యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై
    సాహసి బభ్రువాహనుఁడు చక్కగ సల్పిన యుద్ధమందునన్

    రిప్లయితొలగించండి
  5. నిర్జర దేవర పుత్రుఁడు
    పర్జన్యమువోలె వైరి వర్గము నెల్లన్
    నిర్జింప నొకఁడు కలఁగనె
    నర్జును నిర్జించె శకుని యాహవమందున్

    రిప్లయితొలగించండి
  6. ద్రోహఁపు యోచనల్ మదిని దూఁకొని మోసఁపు ద్యూతమందునన్
    వ్యూహముపన్ని పాండవుల నోటమిపాలొనరించి కౌరవుల్
    యూహల దేలియాడిరిటు యుద్ధము తథ్యము విస్మయమ్ముగా
    నాహవమందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై

    రిప్లయితొలగించండి
  7. దుర్జన దుర్యోధనుఁ డా
    కర్జము మెచ్చ వలలు పడగను గ్రుద్ధుండై
    దుర్జయు నా విజయు విడిచి
    యర్జును నిర్జించె శకుని యాహవ మందున్


    ఆహవ దుర్నిరీక్ష్యుని మహాతిరథప్రము ఖాగ్రగణ్యునిన్
    బాహు పరాక్రమప్రవరుఁ బాండవ మధ్యము సవ్యసాచినిన్
    మోహునిఁ జేసి ధర్మజుని మూరుచు మాయల నక్ష నామ ఘో
    రాహవ మందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై

    రిప్లయితొలగించండి
  8. కం:దుర్జయుడౌ భీముని మరి
    యర్జును నిర్జించె శకుని, యాహవ మందున్
    నిర్జించునె జూదమ్మున
    నార్జించెను పణము వెట్ట నన్నయె వారిన్
    (భీమార్జునుల్ని శకుని యుద్ధం లో జయించ గలడా?జూదం లో పణము గా గెలిచాడు.)

    రిప్లయితొలగించండి
  9. :స్నేహ మటంచు ధర్మజుని జేర్చెను జూదమునందు,కల్మష
    మ్మూహన లేని ధర్మజుని నోడగ జేసె,పణమ్ము భీముడై
    దాహము దీర్చ దక్కెను ,ముదమ్మునకే యని నట్టి మోసమౌ
    నా హవమందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై”
    (హవము=ఆహ్వానము.స్నేహం గా పిలిచిన ఆ ఆహ్వానం లో శకుని భీముణ్ని,అర్జునుణ్ని పణములు గా గెలిచాడు.)


    రిప్లయితొలగించండి
  10. కర్జంబేమియు దెలియని
    దుర్జనుడొక కలను గాంచి దురి తం బనుచున్
    గర్జన జేయుచు వీరుని
    యర్జను నిర్జించె శకుని యాహవ మందున్

    రిప్లయితొలగించండి
  11. దుర్జన సహవాసముతో
    గర్జించుచురాజ రాజు కలగనెననిలో
    తర్జని చూపులు ననె గను
    మర్జును నిర్జించె శకుని యాహవ మందున్

    రిప్లయితొలగించండి
  12. బాహు పరాక్రముండయిన పార్థుని చంపుదునంచు వేగమే
    వాహిని తోడ పల్కుచును వచ్చెను గాంచుమటంచు పల్కగన్
    యాహవమందునన్ శకుని యర్జునినోడగజేసెనుగ్రుడై
    మోహము వీడిచూడుమిట మూర్ఖపు మాటలవేటికో సఖా


    రిప్లయితొలగించండి
  13. కందం
    దుర్జన క్రీడయె జూదము
    నార్జించినదెల్ల నోడనన్న సతి సభన్
    గర్జించిన గావఁ దగక
    యర్జుని నిర్జించె శకుని యా హవమందున్!

    ఉత్పలమాల
    సాహసవంతుఁడై చెలఁగి చక్కగ గెల్చ ధనంజయుండుగా
    నూహల ధార్తరాష్ట్రునకునొప్పని సంపదలందినంతటన్
    వ్యూహము పన్ని ధర్మజుఁడు నోడగ సర్వము పత్ని, ద్యూత భీ
    తాహవమందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై!

    రిప్లయితొలగించండి