21, జనవరి 2025, మంగళవారం

సమస్య - 5010

22-1-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న”
(లేదా...)
“ఆగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్”
(శిష్ట్లా లక్ష్మీ వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

39 కామెంట్‌లు:

  1. మంచు దుప్పటిపరువగా మానితముగ
    జనులుమైకమ్ము నందునజారుకొనిరి
    ప్రొద్దు పొడిచిన తెలియదా రుచులులేవె
    ఆగెఁగాలమ్ము భాస్కరు డాగకున్న

    రిప్లయితొలగించండి
  2. జోగెనుప్రాణికోటియట జోరుహిమాంశువుఁజూపనయ్యెడన్
    ఆగెనుకాలచక్రమది యబ్జసఖుండపుడాగకుండినన్
    వేగముమందగించెగద పెద్దలుపిన్నలుపవ్వళింపగా
    సాగవు జీవయాత్రలవి సందడిలేకను రేపునందునన్

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    అక్కురుక్షేత్ర సంగ్రామమందుఁ జెలఁగి
    కృష్ణునానతి పార్థుండు గెలుపునెంచి
    హతుని జేయఁ గర్ణుని, సూర్య సుతుని గుండె
    యాగెఁ! గాలమ్ము, భాస్కరుఁడాగకున్న!!

    ఉత్పలమాల
    సాగెడు యుద్ధరంగమున సఖ్యడు సారధి కృష్ణమూర్తియే,
    రాగ విహీనుడై చెలఁగు రాధకుమారుని సూర్యపుత్రునిన్
    వేగమె సంహరింపుమన వేయగ బాణము క్రీడి, శ్వాసయే
    యాగెను! కాల చక్రమది, యబ్జసఖుం డపు డాఁగకుండినన్! !

    రిప్లయితొలగించండి

  4. జనకుడడిగిన వేమియు జరుపకుండి
    సమయ మేమాత్ర మైనను చాలదనెడు
    దుష్టుడయిన యాకొమరుడు తొండుడగుట
    నాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న

    రిప్లయితొలగించండి
  5. కారుమబ్బులు నింగిలో గ్రమ్ముకొనఁగ
    నంధకారము పుడమిపై నలముకొనెను
    రాత్రివలె దోచి పగలు ధరిత్రి యందు
    నాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న

    రిప్లయితొలగించండి

  6. కోవిడను వ్యాధి వ్యాపించి క్షోణి నెల్ల
    గడగడ వణికించెడు వేళ కాననమున
    జనులు బంధితులయినట్టి సమయమందు
    నాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న.


    వేగము నత్తమిల్లి కడు భీకర రూపము దాల్చు కోవిడీ
    సాగను చేరినట్టి తరి శాశ్వతి యెల్ల యచేత నమ్ముగా
    లోగిలి బందిగీడులయి లోకులు దద్దఱు చెందు పాళమం
    దాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్.

    రిప్లయితొలగించండి
  7. తెలిసి సైంధ వు వరమును దెలి వి గాను
    చక్ర మును బంపె కృష్ణుడు చతురు డగుచు
    నాగె కాలమ్ము భాస్కరు డాగ కున్న
    చంపె విజయుడు సైంధ వు సమర మందు

    రిప్లయితొలగించండి

  8. సాగును చేతనావృతిని
    సాగును జీవన మీ ధరిత్రిపై
    ౘాగు ప్రభాతసాంధ్యలయి
    సాగును సాగిలుచుండు నిత్యమున్
    సాగెడికాలమే ముగియ
    సాగుచు బోవలె శ్వాసవీడుచున్!
    ఆగెను కాలచక్ర మది....!
    యబ్జసఖుం డపు డాఁగకుండినన్!


    పుట్టి గిట్టుట నైజంబు పుడమిపైన
    నెట్టివారలకైనను నిట్టి దశను
    వదలిపెట్టంగ శక్యమే ప్రిదులుకొనక?
    ఆగె కాలమ్ము! భాస్కరుడాగకున్న!


    ప్రిదులు=రాలిపోవు

    రిప్లయితొలగించండి
  9. త్రాగగ రాహు కేతువులు రాక్షస మాయలతో సుధల్ సరిన్
    సాగగ నివ్వలేదనుచు సప్తతురంగ రథాఖ్య సూరిపై
    రేగిన కోపతాపమున మ్రింగగ సూర్యుని తీవ్ర తేజమే
    యాగెను! కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్!!

    రిప్లయితొలగించండి
  10. కారణమె రాహు కేతువుల్ గ్రహణములకు?
    సూర్య చంద్ర గ్రహణములు చూచినాడ
    గ్రహణ మేతించి నప్పుడు కాంతిరేఖ
    లాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న

    సాగుచునుండుకాలమిది సాధ్యము కాదయ దీనినాపగా
    తేగలనారగించుచును దీరుగ చూచిరి చిత్ర రాజమున్
    జేగురు రంగు సౌధమున చిత్ర ప్రదర్శనమే సమాప్తమై
    యాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్

    ['కాలచక్రం' అనే చలనచిత్రమును దృష్టిలోనుంచుకొని..]

    రిప్లయితొలగించండి
  11. సాగెను వారివాహములు సాంద్రముగా నభమందు నల్దెసల్
    వేగమె గ్రమ్మె జీకటులు వేవెలుఁగున్గబళింప మేఘముల్
    మాఁగగ భానుడంబుదము మాటున రేయిగ దోచె ఘస్రమే
    యాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    దేవదాసు-పార్వతి , సలీమ్-అనార్కలి, రోమియో-జూలియెట్ !
    విధి ఒక విష వలయం - విషాద కథలకు అది నిలయం
    విషాద కథలకు అది నిలయం

    01)
    _________________________________________

    వాదన జేయలేక, విడె - ప్రాణసమమ్మగు పార్వతిన్, మనో
    వేదన నోర్వలేక పసి - బేలగ మారిన దేవదాసు తాన్
    గాదనలేక క్షాంతువును - కాలిక పాల్బడి చంద్ర ఛాయలోన్
    రోదన హెచ్చి హెచ్చి క్షయ - రోగము పాలయి క్రుంగిపోయినన్
    రాదది రానెరాదు గన - రాదిక రమ్మన రాదు రాదికన్ !
    _________________________________________
    క్షాంతువు = తండ్రి
    కాలిక = మద్యము
    చంద్ర = చంద్రముఖి
    ఛాయ = ఇల్లు

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒక సభలో పృచ్ఛకునితో అవధాని :

    01)
    _________________________________________

    ఆగునె కాలచక్రమది- యబ్జసఖుండదె యాగడెన్నడున్
    సాగును సాగుచుండు నిల - సత్యము ధర్మము సూర్యచంద్రులున్
    యేగతి పల్కెదీవు యిటు - లీగతి మూర్ఖత పెచ్చరిల్లగా
    ఆగెను కాలచక్ర మది - యబ్జసఖుం డపు డాఁగకుండినన్
    _________________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా సవరణ చూడండి.

      తొలగించండి
  14. మకరరాశిన జేరిన మర్కుడపుడు
    దక్షిణాయణ కాలంబు తరలు వేళ
    ఉత్తరాయణ నేతెంచు పుణ్య క్షణము
    నాగెఁ గాలమ్ము;భాస్కరుఁ డాఁగకున్న

    రిప్లయితొలగించండి
  15. తే॥ కాలచక్రగతినిఁ గన నాప నెవరి
    తరము హరిహరులకును సాధ్యమగునె నిజ
    ముఁ దెలుపఁగ వృద్ధులకుఁ గష్టములను తోఁచు
    నాఁగె కాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న

    ఉ॥ ఆఁగదు కాలచక్రగతి యాపఁగఁ జాలఁడు విష్ణువైననున్
    సాగగ జీవితమ్ము సుఖ శాంతులఁ గాలము పర్వు తీయఁగా
    మూఁగఁగఁ గష్టనష్టములు పొత్తున మాత్రమె తోఁచు మిత్రమా!
    ఆఁగెను కాలచక్ర మది యబ్జసఖుండపు డాఁగకుండినన్

    పొత్తు ముసలితనము (పండు ముదుసలి అని నాభావమండి) ముంపు అంటే కూడ ముదుసలి అనుకున్నానండి. నిఘంటువులో కనపడనందున మార్చానండి

    పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు

    రిప్లయితొలగించండి
  16. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఏనుగు పైన నవాబు - గాడిద పైన గరీబు
    నడిచే దారుల గమ్య మొక్కటే - నడిపే వాడికి అందరొక్కటే
    ఇంతేరా యీ జీవితం - తిరిగే రంగుల రాట్నము :

    01)
    _________________________________________

    వేదన నోపెనే గజము - వేయికి పైబడి వత్సరంబులున్
    బాధల మెచ్చెనే క్షమను - భక్తశిఖామణి రామదాసదే
    శోధన జేయగా నిలను - శోకము నిచ్చును నీశ్వరుండదే
    మోద మహానుభోగమున - ముఖ్యమునైనది దుఃఖమే కదా
    _________________________________________

    రిప్లయితొలగించండి
  17. ఆగిరివాసు దర్శనము నందరికన్నను ముందు చేయఁగా
    నా గిరి మ్రోల టోకెనుల కవ్వరుసన్ జనఁ ద్రోపులాటలో
    మ్రోగెను మృత్యుఘంటికలు మూడినదయ్యయొ నీకు నీకటం
    “చాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్”

    రిప్లయితొలగించండి
  18. తామరస దళ లోచన తన్ను విడిచి
    పుట్టి నింటికిఁ జనినంత బెట్టిదముగ
    విరహ తాపంబు సెలరేఁగ వింత వాని
    కాఁగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న


    వేగ మెలర్పఁగా విసర బిట్టు చలమ్మునఁ జక్ర యుగ్మముం
    జాగి రయమ్మునం బుడమి జంటగ నించుక సేపు సుంత యే
    నాఁగక యేఁగుచుండ వడి నర్జున చక్రము తగ్గ వేగమే
    యాఁగెను గాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురుభ్యోనమః
    ఉ.మా.
    ఆ గళమందు దాగిన రహస్యము మంత్రము వేసినట్లుగా
    భోగము పంచి రాగముల, భూతలమేలి చరించువేళలో
    రోగపు చిచ్చుకున్ గనలి మ్రోగక నిల్వగ శాశ్వతమ్ముగా
    *నాగెను గాలచక్రమది యబ్జసఖుండపు డాఁగకుండినన్*

    రిప్లయితొలగించండి