రవి గారూ, మంచి భావంతో పూరించారు. అయితే రెండవ పాదంలో గణదోషం (4వ గణం జగణం అయింది. కందంలో 2వ 4వ పాదాలలో సరిగణంగా జగణం వేయరాదు), యతిదోషం (ప-స్మ లకు) ఉన్నాయి. ఆ పాదాన్ని ఇలా సవరిస్తే బాగుంటుంది. శ్రీరామ నామ మను భవ పారావార తరణమును భావించి తనన్ జేర కబీరు గురువు మవ సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్.
ఫణిప్రసన్న కుమార్ గారూ, ఉదాత్తమైన భావం, చక్కని విరుపు. చాలా బాగుంది. అయితే ద్వితీయ పాదంలో "కరుణను ఈశున్" అని విసంధిగా వ్రాసారు. "కరుణను దేవున్" అంటే సరిపోతుందేమో.
శ్రీరామ నామమను భవ
రిప్లయితొలగించండిపారావారతరణమును స్మరించి తననుం
జేరఁ కబీరు గురువు మన
సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్.
రవి గారూ,
రిప్లయితొలగించండిమంచి భావంతో పూరించారు. అయితే రెండవ పాదంలో గణదోషం (4వ గణం జగణం అయింది. కందంలో 2వ 4వ పాదాలలో సరిగణంగా జగణం వేయరాదు), యతిదోషం (ప-స్మ లకు) ఉన్నాయి. ఆ పాదాన్ని ఇలా సవరిస్తే బాగుంటుంది.
శ్రీరామ నామ మను భవ
పారావార తరణమును భావించి తనన్
జేర కబీరు గురువు మవ
సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్.
జ్ఞానంబిచ్చెను సాధువు
రిప్లయితొలగించండిసంసారంబున దరింప సర్వ విధములన్
తులసి జలమునున్ నామన
సారా త్రాగుమని చెప్పి సద్గురువయ్యెన్.
పరమును చేరగ జీవుడు
రిప్లయితొలగించండితరుణోపాయమ్ము తెలిసి " కరుణను ఈశున్
శరణను భక్తి రసము మన
సా! రా, త్రాగు " మని చెప్పి సద్గురుడయ్యెన్
శ్రీరామ నవమి నాడొక
రిప్లయితొలగించండిసారా బానిస నిషాన సారా యడుగన్
మారుగ పానకమిడి, యిది
సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్!!
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించండిమంచి భావం. అయితే మూడవపాదాన్ని ఇలా మార్చితే బాగుంటుందేమో. చూడండి.
"తులసీజలమును నీ మవ"
ఫణిప్రసన్న కుమార్ గారూ,
రిప్లయితొలగించండిఉదాత్తమైన భావం, చక్కని విరుపు. చాలా బాగుంది. అయితే ద్వితీయ పాదంలో "కరుణను ఈశున్" అని విసంధిగా వ్రాసారు.
"కరుణను దేవున్" అంటే సరిపోతుందేమో.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినిర్దోషంగా మంచి పూరణ నందించారు. అభినందనలు.
తప్పకుండా నండీ. పద్యాన్ని సవరించినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
________________________________
పాపాన్ని పంచుకోడానికి ఎవ్వరూ ముందుకు
రాలేదన్న బోయవానితో నారదుడు :
ఘోరము హింసా మార్గము !
రారెవ్వరునాదు కొనగ ! - రక్షణ నిచ్చే
శ్రీరామ నామమును , మన
సారా త్రాగుమని చెప్పి- సద్గురు వయ్యెన్ !
________________________________
వ్యాసుడనే వాని బాధలు తగ్గించి ఒక స్వాముల వారు అతనికి గురువుగా మారిన విధం ...
రిప్లయితొలగించండినారోగము తగ్గించగ
మీరేదో మంత్ర మునిడి మేల్జేయమనన్ !
తీరగు తీర్థము నిడి వ్యా
సా ! రా ! త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్ !!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
కోరిక తీరగ రాముని
రిప్లయితొలగించండిధారగ నామామృతమ్ము దండిగ నిడెదన్
ద్వారము తెరచుచు ఓ! మన
సా! రా! త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్
విలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి