22, జూన్ 2010, మంగళవారం

దత్తపది -3

కవి మిత్రులారా,
నమస్కృతులు. ఈ రోజు దత్తపది ఇస్తున్నాను. క్రింది పదాలను ఉపయోగిస్తూ మహాభారతార్థంలో మీకు నచ్చిన చందస్సులో పద్యం వ్రాయండి.
పూరి, వడ, దోశ, అట్టు.

16 కామెంట్‌లు:

 1. సీసపద్యము

  మరువక సవితుని మనమునఁ పూరించి
  భరమును సైపక వెరగు పడుచు,
  కసరునుఁ దాల్పుచు నొసలటఁ ముడివడ
  నేర్పుగ చేతులఁ ద్రిప్పి త్రిప్పి,
  అక్షములనధాట్టుఁ యవని సమ్రాట్టుకు
  వెగడు కలుఁగునటు విసరి వైచి,
  విజయము నూహించి వెలుగందినయదో,శ
  కుని మామ మోముయనునటు వీగి,

  ఆ.వె
  పాత పగ రగులఁగ జ్ఞాతుల మధ్యను
  చిచ్చు వెట్ట నెంచి చెలగి చెలగి
  రయమునఁ యత గాడు రాగబద్ధుడవగ
  అక్ష క్రీడనట్టు ఆడ దొడగె.

  శకుని మామ ద్యూత క్రీడ మొదలెట్టి, పాచికలేస్తున్నాడు.మొదట తన తండ్రి (సవితుడు =తండ్రి)ని మనసులో నింపుకున్నాడు. ఆయన అస్థికలే కదా పాచికలు. అందుకని ఆ భారము ఓపలేక (సైపక)కాస్త బాధ(వెరగు)పడ్డాడు. ఆ బాధ కోపమయ్యింది(కసరు). దాన్ని సహించాడు (దాల్పు).నొసలు ముడివడింది.భావాలు దాచిపెట్టటానికి చేతులను నేర్పుగా తిప్పాడు. పాచికలను (అక్షములను)అధాట్టుగా ధర్మరాజుకు తడబాటు(వెగడు)కలిగేలాగ విసిరాడు. విజయం తనదే అన్న ధీమా(వీగటం) కాబోలు.

  తన తండ్రి తాలూకు పగ తీర్చుకోవటం కోసం దాయాదుల (జ్ఞాతులు) మధ్య చిచ్చు పెట్టాలని అలా చెలగి,కోపంతో పాచికలాట ఆడనారంభించాడు.

  రిప్లయితొలగించండి
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 3. పూరి వడ దోశ అట్టుల భూరి గాను
  తిన్న భీమయ్య రక్కసుని ధీటు గాను
  ఎదురుకొని యుద్ధమున జంపి ఏకచక్ర
  పురము కష్టముల్ దీర్చెను పూర్తిగాను.

  రిప్లయితొలగించండి
 4. Aarya!

  Mee blog Kadu Ramaneeyamga unnadi..

  Meeku mikkili dhanyavadamul

  teliyajeyuta naa takshana

  kartvavyamuga tochuchunnadi..

  @Bhavadeeyudu..

  రిప్లయితొలగించండి
 5. తే.గీ.
  అట్టుడుకు కురుక్షేత్రంబునల్లడిల్ల
  దేవదత్తము పూరించ ధీర నరుడు
  హడలి పోయి వైరి తతులు వడలి పోయె
  గగనమందో శరము వోలె రగిలె తరణి!!

  గగనమందు + ఓ + శరము = గగనమందో శరము

  రిప్లయితొలగించండి
 6. @ రవి -
  రవి గారూ, శకుని చేత ఉపాహారం సీస(పద్య)పళ్ళెంలో వడ్డింప జేసారు. బాగు .. బాగు.

  ఃఅరి దోర్నాల
  మంచి పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

  @ రాంనర్సింహ -
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.

  @ జిగురు సత్యనారాయణ -
  నిజంగా గొప్ప పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. రవి గారూ, సత్యనారాయణ గారూ చాలా అద్భుతంగా చెప్పారండీ.

  రిప్లయితొలగించండి
 8. ఇపుడు గెల్తుమన్న తలపూ, రిపుల తంత్ర
  బలము, కలసి ఏదో శని పట్టినట్టు
  బాట మరలించి పాండవు లాటకొచ్చి
  రాడున దెవడన్నదెరిగీ! ఓడ కేమి!?

  రిప్లయితొలగించండి
 9. చదువరి గారూ,
  పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  ___________________________________

  దేవదత్తము పూరించ - బావ తోడ
  గనుడదో , శంకర కృపను - గాంచె నంచు
  అర్జునుని జూచి వడకిరి - హడలి పోయి
  వాహి నంతయు మృత్యువే - వచ్చి నట్టు !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 11. వసంత కిశోర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ కృష్ణుడు అర్జునునకు చేసిన హిత బోధ...

  సమరమందున వలెనదో శక్తి యుక్తి !
  వడలి పోకుమ ! చేయుము వారి వధను!
  పూరి గరచునె కౌంతేయ ! పులియు సహజ
  ధర్మ మట్టులె విడనాడి? ధర్మ మిదియె!

  రిప్లయితొలగించండి
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఎప్పుడో ఇచ్చిన దత్తపదిని వెదలి మరీ చక్కని పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. తే.గీ.
  జాజి(పూరీ)తి, పార్వతి సందడించె
  పట్టుపా(వడ)తళుకులు, పరవశింప
  (అట్టు)లుండినకన్యకనభవుడంత
  (దోసె)డదినిండ తలబ్రాల,తోడ ముంచె

  రిప్లయితొలగించండి