రవి గారూ, ఏమని వ్యాఖ్యానించను? తడబాటు లేకుండా సాఫీగా హాయిగా సాగింది పద్యం. మంచి భావం, భావానికి తగిన పదసంపద, పదప్రవాహాన్ని తలపించే ధార.... అద్భుతం. అన్నట్టు ఇది నా బ్లాగులో కనిపించిన మొట్టమొదటి వృత్తం. ధన్యవాదాలు.
తక్కువ ధరలకు రైతుల వద్ద పంటను కొని కృత్రిమ కొరత సృష్టించి, విపరీతముగా రేట్లు పెంచి వినియోగ దారుల కడుపు కొట్టి వర్తకులు తమ సంపదనూ శరీరమునూ పెంచుకొను తీరు :
02) __________________________________
లేదు న్యాయము పంటకు - రేటు తరుగు పంట మాయము ! తదుపరి - పాట్లు గలుగు ధరల గాయము వినియోగ - దారులకును వడిగ కాయము పెరుగును - వర్తకులకు ! __________________________________
కాయము వంచి కష్టపడి ఘర్మము చిందగ నెల్లవేళలన్
రిప్లయితొలగించండిగాయములోర్చి రైతులట కాయలుఁ గూరలు సాగుఁ జేయగా
మాయము డబ్బులన్నియును మధ్యదళారుల చేతిలో. ఇలన్
న్యాయము ఎక్కడున్నదొకొ? అంబరమంటె ధరల్ విపత్తుగన్
రవి గారూ,
రిప్లయితొలగించండిఏమని వ్యాఖ్యానించను? తడబాటు లేకుండా సాఫీగా హాయిగా సాగింది పద్యం. మంచి భావం, భావానికి తగిన పదసంపద, పదప్రవాహాన్ని తలపించే ధార.... అద్భుతం. అన్నట్టు ఇది నా బ్లాగులో కనిపించిన మొట్టమొదటి వృత్తం. ధన్యవాదాలు.
కాయము తప్పులింక యధికారము కోసము వేయి వేషముల్
రిప్లయితొలగించండివేయగ చూసినాము తమ వేడుక; గాయము లయ్యె మామదిన్
మాయము చేసినారు ధనమాజల యజ్ఞము పేరు చెప్పి; అ
న్యాయము చెల్ల బోదు తమ నాటక మంతయు కాంచిరందరున్
కాయము గాచుటైన కడు కష్టము దోచెను నేటి కాలమున్,
రిప్లయితొలగించండిగాయమొనర్చెనే మదిని కానని రీతుల కామితార్థముల్.
మాయము చేయనెంచె మహిమాన్విత గ్రాసము ఆర్జితమ్ములన్.
న్యాయము చేయుమీశ్వర ! అనాథలమైతిమి మీరగన్ ధరల్.
ఈ దత్తపదిని ఆధ్యాత్మిక భావంతో పూరించమని నా తల్లిగాడు(మా చెల్లెలు)అడిగింది. నాకున్న పరిధిలో....
కాయమునిచ్చెనీశ్వరుడు గాయము మాయముచేయు న్యాయమై,
గాయము చేసిరెల్లరున్ కారణభూతమహమ్ము మీరగన్
మాయముయయ్యెనిధ్ధరణి మానవ జీవన రాగబంధముల్
న్యాయము చేయగన్ మదిని నాటుడు మాయని ప్రేమబీజముల్.
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. కాని పెరిగిన ధరల ప్రస్తావన లేదేమిటి?
"సుమిత్ర" గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
శంకరయ్య గారు చాలా మంచి బ్లాగు మీది.. నాకు పద్యాలవి రావు కాని చదివి ఆనందపడుతున్నా ..ధన్యవాదాలు :)
రిప్లయితొలగించండినేస్తం గారూ,
రిప్లయితొలగించండినా బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
సీసము:
రిప్లయితొలగించండిపొట్లకాయ మునగ పుదిన చిక్కుడు చేమ
బీర దోస టమాట బెండ దొండ
క్యారెట్టు క్యాప్సికం క్యాలీఫ్లవరు నిమ్మ
ఆలుగడ్డ పనస అరటికాయ
కాకర గోంగూర క్యాబేజి ముల్లంగి
కంద గుమ్మడి సొరకాయ మిరప
వివిధ రకములుగ విస్తరిల్లిన కూర
గాయలు కొనబోవ భయము కలుగు
తేట గీతి:
పెద్ద గాయమునయ్యను పేద వాని
జేబుకును, మాయమునిటుల జీతమంత
న్యాయముఁగలదె యెక్కడనైనఁజూడ?
సగటు జీవులింక బ్రతుకఁజాలలేరు!!
సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినా బ్లాగులో మొట్టమొదటి సీసపద్యాన్ని పెట్టి నన్ను, చక్కని పూరణ నిచ్చి పద్యప్రియుల నందరినీ అలరించారు. ధన్యవాదాలు.
@జిగురు సత్యనారాయణ గారు: మీ శైలి, ఒరవడి, ఆహా. భేష్!
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
పంట వచ్చేసరికి దళారులు ధరలు కృత్రిమంగా
తగ్గిస్తే కిట్టుబాటు ధరలేక :
01)
__________________________________
న్యాయముగ పొలమందున - ననవరతము
కాయముల వంచి కడదాక - కష్ట పడిన
మదిని గాయము దప్పని - మంచి రైతు
మాన ధనములె మాయము - మహిని నేడు !
__________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితక్కువ ధరలకు రైతుల వద్ద పంటను కొని
రిప్లయితొలగించండికృత్రిమ కొరత సృష్టించి, విపరీతముగా
రేట్లు పెంచి వినియోగ దారుల కడుపు కొట్టి
వర్తకులు తమ సంపదనూ శరీరమునూ
పెంచుకొను తీరు :
02)
__________________________________
లేదు న్యాయము పంటకు - రేటు తరుగు
పంట మాయము ! తదుపరి - పాట్లు గలుగు
ధరల గాయము వినియోగ - దారులకును
వడిగ కాయము పెరుగును - వర్తకులకు !
__________________________________
(న్యాయము) గాదు మీకు మము నవ్వుల పాలును జేయబోకుడీ
రిప్లయితొలగించండి(మాయము)నయ్యె మూటలు టమాటలు,బీరయు సోరకాయలున్
(కాయము) తూట్లునయ్యెనయ కష్టముజేసిన పంటలిట్టులన్
(గా యము) జేయనేల, ధర కాటికి జేరు దళారులున్నచో!!