24, జూన్ 2010, గురువారం

సమస్యాపూరణం - 19

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను.

26 కామెంట్‌లు:

 1. కన్ను మిన్ను గనక కసిరితి కాంతను
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
  యనుచు, కడకు తెలిసె ఆమె పవరు, మాడె
  కడుపు, బెడ్డు జరిగె! ఖర్మ తుదకు

  రిప్లయితొలగించండి
 2. దేశమున విలువల నాశన మునకును
  నీతి అంతరించు రీతులకును
  నిగ్గదీయవలెను నెహ్రూకుటుంబమా
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను!

  రిప్లయితొలగించండి
 3. భాస్కర్ గారు, చదువరిగారు
  ఇద్దరూ భలే చమత్కారంగా రాశారు.

  రిప్లయితొలగించండి
 4. భాస్కర రామిరెడ్డి గారూ,
  ఆలిని తిట్టి ఫుడ్డుకు, బెడ్డుకు దూరమైన మగని పాటును చక్కగా తెలుపుతూ పూరణ నిచ్చారు. బాగుంది.

  చదువరి గారూ,
  నిజమే. కొందరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కొన్ని విషయాలలో ఆ కుటుంబం నిగ్గదీయ వలసిందే. మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. ఆ.వె.
  అంతరంగిక సభనందుండ పాండవుల్
  ద్రుపద పుత్రి చనువు తోడ వచ్చి
  పలికె నిటుల తాను "పిలిచె రమ్మని కుంతి
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను" !!

  రిప్లయితొలగించండి
 6. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ అత్యద్భుతం. నాకు ఆనందదాయకం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. నిండు సభన నింతి మెండుగ రోదింప,
  జూసి నంత భీము జేసె నాన,
  యుథ్థమందు గదతొ ముద్దలు జేసెగ!
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను.

  రిప్లయితొలగించండి
 8. విన్నపములు జేయ నెన్నవు విఘ్నేశ!
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
  మన్నననెటు గొల్తు? మన్నింపఁదగునోయి!
  చిన్ని కైత నాదుఁ జేగొనన్న!

  రిప్లయితొలగించండి
 9. నా పూరణ -
  కౌరవ సభలోన కంజాక్షుఁ డనె " కురు
  క్షేత్ర యుద్ధమందు చెలఁగి మిమ్ము
  భీముఁ డర్జునుండు వీరులై చంపరా
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను"

  రిప్లయితొలగించండి
 10. నా పూరణ -
  కౌరవ సభలోన కంజాక్షుఁ డనె " కురు
  క్షేత్ర యుద్ధమందు చెలఁగి మిమ్ము
  భీముఁ డర్జునుండు వీరులై చంపరా
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను"

  రిప్లయితొలగించండి
 11. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  రవి గారూ,
  మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. అబలయని తలచి, శుభముల గూర్చు తల్లిని
  నభోవీధి నపహరించిన రావణున్ గని , కడతేర్చును
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
  రామబాణమని దిశలం చాటెను కపీశ్వరుండమిత పరాక్రమమ్ముతోన్...
  (చందస్సు లేదు ఇప్పుడిప్పుడె నేర్చుకుంటున్నాను. భావ పరిగ్రహణం చేయగలరని మనవి. ఎవరైనా చ్ంధో బద్దం చేస్తే మరీ ఆనందం. )
  భాస్కర్ గారూ,

  "కన్నూ మిన్నూ గానక " అంటారేమొ కదా(తెలియక అడిగింది,తెలిపి పుణ్యం కట్టుకోగలరు.) చూస్తుంటే పద్యాలకు మళ్ళి మంచి రోజులొస్తాయనిపిస్తోంది.
  నెనర్లు.

  రిప్లయితొలగించండి
 13. బాలకృష్ణ ఉవాచ :
  మన్ను తింటినంచు నన్నతోబాటుగా
  అమ్మతోడ మీర లైదుగురును
  చెప్పినారు గాన, చేరనీ నాటలో -
  నిన్ను,నిన్ను,నిన్ను,నిన్ను,నిన్ను!

  రిప్లయితొలగించండి
 14. మనోహర్ చెవికల గారూ,
  "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం! పద్య కవిత్వం మీద రోజురోజుకు ఆసక్తి పెరుగుతున్నది. ఇది సంతోషకర పరిణామం. ఛందస్సు నేర్చుకుంటున్నందుకు అభినందనలు.మీరిచ్చిన భావం పెద్దది. వ్రాయ వలసిన "ఆటవెలది" పద్యం చిన్నది. అయినా ప్రయత్నించాను. చూడండి.........

  రావణు సభలోన పావని యిట్లనె
  "సీత నపహరించి చేటు తెచ్చు
  కొంటివి; విను, రామకోపాగ్ని దహియించు
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను"

  రిప్లయితొలగించండి
 15. డా.ఆచార్య ఫణీంద్ర గారూ,
  అద్భుతమైన పూరణ నందించారు. ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 16. I immensely liked the poems of Jiguru Satyanarayana garu and Acharya Phanindra garu.

  రిప్లయితొలగించండి
 17. మాధురి గారూ,
  నా బ్లాగు, బ్లాగులోని పద్యాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. “కృష్ణఫలము దెస్తి గెల్చి నే గొంతెమ్మ!
  చెప్పవమ్మ వేగ చేయుటేమి?”
  “తల్లి మనసెరుగవె ధన్విఁ? గైకొనమందు
  నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను”

  రిప్లయితొలగించండి
 19. మనోహర్ చెనికల గారూ

  కన్ను మిన్ను అనేది మాట్లాడే టప్పుడు కన్నూ మిన్నూ అంటామేమో. నాకు సరిగా తెలియదు. పెద్దలు నివృత్తి చేస్తే మీతో పాటు నేనూ నేర్చుకుంటాను.

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  కురుసభలో దుర్యోధనాదులతో శ్రీకృష్ణుడు :

  01)
  ________________________________

  సాధ్వి యైన సుదతి - సభకు నీడ్చి, పిదప
  పడతి చీర లాగు - పాపి తోడ
  పట్టు బట్టి మిమ్ము - పరిమార్చు భీముడు
  నిన్ను నిన్ను నిన్ను - నిన్ను నిన్ను !
  ________________________________

  రిప్లయితొలగించండి
 21. ద్రౌపదిని పాండవులైదుగురు పెండ్లి చేసుకునే సమయంలో వ్యాసుడు వచ్చి వారి సందేహాన్ని తీర్చిన సందర్భం ....

  పూర్వ జన్మ మందు శర్వుని పూజించి
  అడిగె తానుగ ' పతి ' నైదు మార్లు
  నాటి వరము వలన నాతి చేకొను నేడు
  నిన్ను, నిన్ను, నిన్ను, నిన్ను, నిన్ను.
  __________________

  రిప్లయితొలగించండి
 22. వసంత కిశోర్ గారూ,
  మన్నించాలి. మీ పూరణను ఆలస్యంగా చూసి స్పందిస్తున్నందుకు. పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. శంకరార్యా ! ధన్యవాదములు.
  కిషోర్ జీ ! ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి