8, జూన్ 2010, మంగళవారం

చమత్కార పద్యాలు -3

ఛురికా బంధము

ధీర! మురహర! గదాధర!
నారద రసనాగ్ర గేహ! నగధర! సుఖదా!
దారుణ దనుజాంతక! నా
నా రదనచ్ఛద నుత శుభనామా! వరదా!

8 కామెంట్‌లు:

 1. చాలా బావుందండి. ’నానా రదనచ్ఛద’ = ఈ ప్రయోగం కాస్త సరసంగా ఉంది.

  మీ బ్లాగు అప్రతిహతంగా కొనసాగగలదని ఆశ. అలా, మీ వంటి పెద్దల అడుగుజాడలలో నేనూ ప్రయాణించే అవకాశం నా వంటి వాళ్ళకు దొరుకుతుంది.

  రిప్లయితొలగించండి
 2. నమస్తే.
  ఛురికా బంధ ప్రయోగం భలే ఉంది.
  పిడిలో మురహ మాత్రమే కన్పిస్తోంది. మురహర అని రాశారు కదా!

  రిప్లయితొలగించండి
 3. నాదొక చిన్న ప్రయత్నం.

  సకలకళాకలితవికసి
  తకమలదళలోచని లలితసురుచిరలతాం
  గి కమలభవురాణి భవప
  ద కమలములనే భజించెద మది వినయమున్

  చిత్రం ఇక్కడ

  రిప్లయితొలగించండి
 4. ఛురికా బంధము అంటే ఏమిటండి?
  దత్త పది, సమస్యా పూరణం లాంటి ప్రక్రియా లేక ఇది ఒక ఛందస్సా?
  నా పామరత్వానికి మన్నించండి. తెలుసుకోవాలనే కుతూహలంతో అడుగుతున్నాను.

  రిప్లయితొలగించండి
 5. @ రవి -
  రవి గారూ, 1969లో కళాశాల విద్యార్థిగా నేను వ్రాసిన "వరద శతకం" లోని పద్యం ఇది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీరు రాసిన చురికాబంధం బాగుంది. అభినందనలు. అలాగే మీరు పెట్టిన పికాసా ఆల్బం లోని చిత్రకవిత్వం బొమ్మలు సేవ్ చేసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 6. @ మందాకిని -
  మందాకిని గారూ, చురికాబంధం మీకు నచ్చినందుకు ధన్యుణ్ణి. పిడి మధ్యలోనున్న "ర" మూడుసార్లు ఉపయోగపడుతుంది. ధీ "ర" ము "ర" హ "ర" .... ఈ విధంగా.
  @ సాయి ప్రవీణ్ -
  @ ప్రణిత స్వాతి -
  చందోబద్ధమైన కవిత్వం ఆశుకవిత్వం, మధుర కవిత్వం, చిత్రకవిత్వం, విస్తరకవిత్వం అని నాలుగు విధాలు. ఇందులో చిత్రకవిత్వంలో గర్భకవిత్వం, బంధకవిత్వం ఉంటాయి. బంధకవిత్వం గురించి శ్రీ చింతా రామకృష్ణారావు గారు తమ "ఆంధ్రామృతం" బ్లాగులో నన్నెచోడుని గోమూత్రికాబంధాన్ని పరిచయం చేస్తూ కొంత ప్రస్తావించారు. నేను నా బ్లాగులో చురికాబంధాన్ని పెట్టడానికి వారే స్ఫూర్తి. ఈ చిత్రకవిత్వాన్ని గురించి వివరంగా త్వరలోనే నా బ్లాగులో ఒక పోస్ట్ పెడతాను.

  రిప్లయితొలగించండి
 7. రవి గారూ,
  మీరు రాసిందే ఛురికాబంధం. నేను రాసింది ఖడ్గబంధం. నిన్న చిత్రకవిత్వాన్ని గురించి ఒక వ్యాసం చదివాను. అందులో బంధకవిత్వాన్ని బొమ్మలతో వివరించారు. నేను రాసిన వరదశతకంలో అది ఖడ్గబంధమనే ఉంది.

  రిప్లయితొలగించండి