సింహాసన బంధం
ఈ సింహాసన బంధం గురించి ఇంతకు ముందు వినలేదు. రవి గారు తమ బ్లాగులో ఈ బంధంలో పద్యం వ్రాసి చిత్రాన్ని కూడా ఇచ్చారు. వారినే ఆదర్శంగా తీసుకొని ఈ సింహాసన బంధాన్ని వ్రాసాను. విద్వజ్జనులు దీనిని చూసి గుణదోష విచారణ చేయ వలసిందిగా మనవి. కంసాది రాక్షసాంతక!
శంసిత పద! గరుడ గమన! కరి వర వరదా!
సంసార నిరత కలుష
ధ్వంసక ! నెయ్యమున నన్ను దయఁ గనుము సదా!
(బంధంలో మధ్య అక్షరాలను చదివితే "కంది శంకరయ్యను" అని వస్తుంది)
శంకరులకు వందనములు
రిప్లయితొలగించండివంకరులను వెదకతగని వటువును ఆర్యా
జంకుచు చెప్పెద రెండవ
పంక్తిన బెడిసె యతి యనుచు పరికించనుచున్ !!
శంకరయ్య గారు చాలా బాగాఉంది మీ ప్రయత్నం. ఇలా ఇంకా ఎన్నో అద్భుతాలను మాకు పరిచయం చేయ గలరు. నేచెప్పిన దాంట్లో తప్పులున్న మన్నించగలరు.
Chala bagundi..
రిప్లయితొలగించండిDhanyavadalu..
అవును గురువుగారూ..కింద మీరు ఇచ్చిన పద్యాన్ని చూడకుండా(గమనించలేదు)..కేవలం బొమ్మలో అక్షరాలూ మాత్రమే చూస్తూ పేపర్ మీద వరసగా రాస్తూ పోయా. ఆ తరవాత మీ పూరణ చూశాను. కరెక్ట్ గా వచ్చింది. కానీ నాలుగు పాదాలుగా విడగొట్టడం రాలేదు. మధ్యలో(నిలువు) మీ పేరు కూడా వచ్చింది.
రిప్లయితొలగించండిబాగున్నదండి. మంచి ప్రయత్నం. కొనసాగించండి.
రిప్లయితొలగించండిword verification ను తీసి వేయండి. ఇది కూడా lay out లోనికి వెళ్ళి comments లో word verification కు no పెట్టెయ్యటమే.
చదువరి గారూ,
రిప్లయితొలగించండిపూరణ చాలా బాగుంది. అభినందనలు.
@ రాం నర్సింహ -
రిప్లయితొలగించండి@ ప్రణీత స్వాతి -
నా సింహాసన బంధం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
వేదుల బాలకృష్ణమూర్తి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా వర్డ్ వెరిఫికేషన్ తొలగించే ప్రయత్నం చేస్తాను. నాకు కూడ అది చికాకు పెడుతోంది.
అత్యద్భుతంగా, భావయుక్తంగా ఉందండి. ఇటువంటిదే గోపురబంధమూ, రథబంధమూ కూడా. వాటిని కూడా పూరించగలరు.
రిప్లయితొలగించండిరవి గారూ,
రిప్లయితొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. నాకు మతి తప్పింది. సవరించి మళ్ళీ పోస్ట్ పెడతాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్య గారు,
రిప్లయితొలగించండిఇది గొప్ప ప్రయత్నం అని తెలుస్తున్నా, ఈ కవిత్వం యొక్క గొప్పతనమును పూర్తిగా అభినందించలేని పామరుడిని. బంధ కవిత్వం గురించి వివరాలు నేను ఎక్కడ తెలుసుకోగలను? ఇంటర్నెట్ లో లభ్యమయ్యే వీలు ఉంటే తెలియజేయగలరు.