12, జూన్ 2010, శనివారం

సమస్యాపూరణం - 9

కవి మిత్రులారా, రోజు పూరించ వలసిన సమస్య -
కారమును త్యజించి ఘనత గనుము

18 కామెంట్‌లు:

 1. శంకరాభరణ నిర్వాహకా! అభినందనలు.
  మీరిచ్చిన సమస్యకు నాపూరణ తిలకించండి.

  నేర మెన్నకెపుడు. నిత్యుండనే గనుము.
  వారసత్వ ధనము భరతపుత్ర!
  వరలఁ జేయు నిన్ను. వరలగ నీ యహం
  కారమును త్యజించి ఘనత గనుము.

  http://andhraamrutham.blogspot.com
  ఈ సమస్య కూడా పూరించే ప్రయత్నం చేద్దామా?

  "మునికి నుదుట సీత ముద్దులిడెను".

  రిప్లయితొలగించండి
 2. తండ్రి యేలి నాడు తనవంతు రాష్ట్రమ్ము
  పంత మేల నీకు పదవి కొరకు?
  పట్టుదలకు పోక పదవిపై నీ మమ
  కారమును త్యజించి ఘనత గనుము.

  రిప్లయితొలగించండి
 3. తండ్రి కోర్కె మీద త్యజియించి రాజ్యమ్ము
  నార బట్ట కట్టి నారి తోడ
  వనము లేగ పూని వచ్చినట్టి రఘురా
  మునికి నుదుట సీత ముద్దులిడెను

  రిప్లయితొలగించండి
 4. కలిమిలేములందు కలసిమెలసియుండు
  మధురజీవనమ్ము మాయజేసి
  సంకుచితము జేయు స్వార్థ జీవితపు ప్రా
  కారమును త్యజించి ఘనత గనుము.

  క్రింది సమస్యను పూరించ గోరుతున్నాను.

  "భార్యను బాధించువాడు భర్తగయొప్పున్."

  రిప్లయితొలగించండి
 5. చింతా రామకృష్ణారావు గారి పద్యంలో మూడో పాదం.."వరలఁ జేయు నిన్ను. వరలగ నీ..," అర్ధం కాలేదు.

  హరి దోర్నాల గారి రెండు పద్యాలూ చాలా నచ్చాయి (అంటే..నాకు తేలికగా అర్ధమైనాయి).

  రిప్లయితొలగించండి
 6. సుప్రణీత స్వాతి సూచించె నెద్దాని
  చూపు చుంటి దాని ప్రాపుఁ గొలుప.
  వరలఁ జేయుటన్న వర్ధిల్లఁ జేయుట.
  వర్ధిలంగయహము వదలుమనుట.
  అమ్మా!
  నేను వ్రాసిన పద్యం ఒక గురువు చేయుచున్న హితబోధ.
  ఎప్పుడూ ఇతరుల నేరములను ఎంచుటయే పనిగా కలిగి ఉండకుము. శాశ్వితుడైన పరమాత్మనే నీ మదిలో చూడుము. ఓ భరతమాత పుత్రుడా!ఈ విధమైన ప్రవృత్తి మన భారతీయుల వారసత్వమనెడి ధనము. నిన్ను తప్పక వృద్ధి చేయును. ఆవిధముగ వరలుట కొఱకు నీవు అహంకారము అనే దుర్గుణమును వీడి గొప్పదనమును పొందుము.
  అని భావమమ్మా!
  పాఠకుల కర్థమయే విధంగా వ్రాయలేకపోయినట్లున్నాను.క్షంతవ్యుణ్ణి.

  రిప్లయితొలగించండి
 7. అతులిత సుమధుర చరితము
  స్తుతమతుల ప్రశంసలందు త్రోవను సదసత్
  జ్ఞతుడవనగ తెలిపితివయ!
  అతిమధురము పూరణంబు హరి దోర్నాలా!

  రిప్లయితొలగించండి
 8. చింతా రామకృష్ణా రావు గారు,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. ప్రణీత గారు,

  రామకృష్ణా రావుగారు మహా పండితులు, వారు వ్రాసినవి అర్థం చేసుకోవడానికి మనం కొంత శ్రమించాలి, అది మనకే ఉపయోగం.

  రిప్లయితొలగించండి
 10. చింతా రామకృష్ణారావు గారూ,
  మంచి పూరణతో నా బ్లాగుకు వన్నె తెచ్చారు. ధన్యవాదాలు. ఇక "తమ్ముని భార్య తల్లియగు ......" సమస్యకు మీ పూరణ అద్భుతం.

  తమ్ముని భార్యను సజ్జన
  సమ్మతముగఁ దల్లిఁ జేయు సామర్థ్యముతో
  కమ్మగ పూరించిన నిన్
  నెమ్మనమున మెత్తునయ్య నేర్పరి వనుచున్.

  ఇక మీరిచ్చిన "మునికి నుదుట సీత ముద్దులిడెను" సమస్యకు నా పూరణ ........

  ఇనకులమునఁ బుట్టి తన తండ్రి మాట ని
  ల్పుటకు రాజ్యసుఖము వదలి వనము
  వెడలు నప్పూడు తన వెంట రమ్మన్న రా
  మునికి నుదుట సీత ముద్దులిడెను.

  రిప్లయితొలగించండి
 11. హరి దోర్నాల గారూ,
  నేనిచ్చిన సమస్యకు, చింతావారి సమస్యకు మంచి పూరణలను అందించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. సుమిత్ర గారూ,
  మంచి భావంతో సమస్యను పూరించారు. ధన్యవాదాలు. ఇక మీరిచ్చిన "భార్యను బాధించువాఁడు భర్తగ నొప్పున్" సమస్యకు నా పూరణ .......

  కార్యోన్ముఖుఁడై యలయ స
  పర్యల నొనరించి తనను వలపించఁగ నా
  శ్చర్యముగ మొరటు రతిచే
  భార్యను బాధించువాఁడు భర్తగ నొప్పున్.

  రిప్లయితొలగించండి
 13. ప్రణిత స్వాతి గారూ,
  మీ సందేహం తీరింది కదా!

  హరి దోర్నాల గారూ,
  చింతావారి సమస్యను గుర్తుంచుకొని గ్రామాంతరం వెళ్ళాను. అక్కడ విరామసమయంలో పద్యం రాసి బ్లాగు తెరిస్తే మీ పూరణ కనిపించింది. దాదాపు ఇద్దరి భావం ఒక్కటే. మరో కొత్త భావంతో పద్యం రాసే సమయం లేక ఆ పూరణనే ఇచ్చాను. ఆ పద్యం మూడవపాదంలో "వెడలు నప్పుడు" కు "వెడలు నప్పూడు" అని టైపయింది.

  రిప్లయితొలగించండి
 14. అమ్మా! సుమిత్రా! చక్కని సమస్యనిచ్చావమ్మా! ఇక నాపూరణ విలోకించమ్మా!

  భార్యలు దురాశ; దుర్దశ.
  క్రౌర్యంబుగ ముందు వెనుక కాసుకు యున్నన్;
  భార్య దురాశను; దుర్దశ
  భార్యను; బాధించువాఁడు భర్తగ నొప్పున్

  రిప్లయితొలగించండి
 15. @ కంది శంకరయ్యగారు, పూరణ బాగుంది. ధన్యవాదములు.
  ఇక నేనిచ్చిన సమస్యకు నా పూరణ.

  సర్వము తానే యనుచును
  సర్వస్వము నర్పించగ సంతసమొందన్,
  విరహపు తాపమ్మున తన
  భార్యను బాధించువాడు భర్తగయొప్పున్. ))


  @ చింతా రామకృష్ణా రావుగారు,
  పూరించిన భావము బాగుందండి. ధన్యవాదములు.
  ఇక.. నా కలం పేరు 'సుమిత్ర'.

  @ హరి దోర్నాల గారు,
  రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. చింతా రామకృష్ణా రావుగారూ..ముందుగా నా మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వుంటే క్షమించమని మనవి.

  అలాగే పిచ్చి సందేహం అనుకోకుండా..నాకు పద్య పాదాల అర్ధాలు తెలియ చెప్పారు. చాలా థాంక్సండీ.

  రిప్లయితొలగించండి
 17. శంకరయ్య గారు, రామకృష్ణ గారు, హరి గారు,సుమిత్ర గారు,
  చక్కని సమస్యలను, అద్భుతమైన పూరణలను ప్రతి రోజు మాకు చూపుతూ మా జ్ఞానం పెంపొందించుకొనుటకు దోహద పడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. అందరికీ వందనములు
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01)
  ___________________________________

  మూగ జీవులు కడు - మోదంబు నొందగ
  హింస మాని మహి , న - హింస బూను !
  మదము కొంత నణచి - మనుజుడ నను నహం
  కారమును త్యజించి - ఘనత గనుము ! ___________________________________

  రిప్లయితొలగించండి