7, జూన్ 2010, సోమవారం

సమస్యాపూరణం - 4

కవి మిత్రులారా, రోజు పూరించ వలసిన సమస్య ఇది.
కోకిలమ్మకు పుట్టెను కాకి యొకటి

6 కామెంట్‌లు:

  1. మదిని నిండి యున్న మమతానురాగాలు
    మకిలి పట్టగ నేడిటు మాయతోడ
    గుండె కట్టుకొనిన చెలిమి గూటిలోని
    కోకిలమ్మకు పుట్టెను కాకి యొకటి.

    రిప్లయితొలగించండి
  2. @ సుమిత్ర -
    సుమిత్ర గారూ, మంచి ప్రయత్నం. పూరణ బాగుంది. అభినందనలు. అయితే మొదటి పాదాన్ని ఆటవెలదిలో రాసారు. మూడవ పాదంలో గణదోషం ఉంది. మీ పూరణలో కొద్ది మార్పులు చేసాను.
    మదిని నిండిన మమతలు మంచితనము
    మకిలి పట్టఁగ నేడిటు మాయతోడ
    గుండె కట్టుకొన్న చెలిమి గూటిలోని
    కోకిలమ్మకు పుట్టెను కాకి యొకటి.
    @ మాధురి -
    మాధురి గారూ, స్వాగతం. నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    01)
    ________________________________

    గాంధి నెహ్రుల గన్నట్టి - కనక గర్భ !
    నేటి భారతావని జూడ - నిజము గాను
    లంచ గొండులె పాలించు - రాజ్య మయ్యె!
    కోకిలమ్మకు పుట్టెను - కాకి యొకటి !
    ________________________________

    రిప్లయితొలగించండి
  4. కోకిలమ్మకు బుట్టెను కాకి యొకటి
    యన్నవారెప్డు జూచిరో యన్నలార
    కోకిలలు బెట్టు గ్రుడ్లను కాకి పొదుగు
    పుణ్యమేదియో జెప్పుడీ పురుషులార !!

    రిప్లయితొలగించండి